YS Viveka case:సీబీఐ విచారణ వేళ అనూహ్య ట్విస్ట్ - పులివెందులకు అవినాశ్, వాట్ నెక్స్ట్..!!

YS Viveka case:వైఎస్ అవినాశ్ రెడ్డి సీబీఐ విచారణ వేళ మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. వివేకా హత్య కేసులో ఈ రోజు ఎంపీ అవినాశ్ రెడ్డి సీబీఐ ముందు హాజరు కావాల్సి ఉంది. నాలుగు రోజుల క్రితమే సీబీఐ విచారణ కు రావాలని సీబీఐ నోటీసులు ఇచ్చింది. అయితే, ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ కారణంగా తనకు విచారణకు హాజరయ్యేందుకు నాలుగు రోజుల సమయం కోరారు. దీంతో, ఈ రోజు విచారణకు రావాలని సీబీఐ నోటీసులు జారీ చేసింది. కానీ, అవినాశ్ రెడ్డి నేటి విచారణకు హాజరు కాలేదు.

సీబీఐ నోటీసులు : వివేకా హత్య కేసులో ఇప్పటికే అవినాశ్ ను ఆరు సార్లు విచారించింది. తదుపరి విచారణ కోసం ఈ రోజు విచారణకు రావాలని సీబీఐ నోటీసులు ఇచ్చింది. విచారణకు హాజరయ్యేందుకు అవినాశ్ రెడ్డి కడప నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. మరి కాసేపట్లో అవినాశ్ విచారణకు సిద్దం అవుతున్న సమాచారం అందింది. అవినాశ్ ఈ రోజు సీబీఐ ముందు విచారణకు హాజరైతే ఉత్కంఠ పరిణామాలు ఉంటాయనే అభిప్రాయం తో పెద్ద సంఖ్యలో అభిమానులు.. అనుచరులు హైదరాబాద్ చేరుకున్నారు. ఇదే సమయంలో విచారణకు వెళ్లాల్సిన సమయంలో అవినాశ్ ఆసక్మికంగా పులివెందులకు బయల్దేరారు. ఆ సమయం లోనే అవినాశ్ నుంచి సీబీఐకు ఒక లేఖ పంపినట్లు తెలుస్తోంది.

 avinashcbi-

పులివెందులకు అవినాశ్ : అవినాశ్ తన తల్లి అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారని సమాచారం. తండ్రి భాస్కర రెడ్డి జైల్లో ఉండటం..తనను సీబీఐ విచారణ చేస్తుండటంతో తన తల్లి ఒత్తిడితో అనారోగ్యానికి గురయ్యారని చెబుతున్నారు. ప్రస్తుతం అవినాశ్ తల్లి పులివెందులలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. తల్లి అనారోగ్యంతో ఆందోళనతో ఉన్న అవినాష్ ఈ రోజు విచారణకు హాజరు కావటం లేదని సమాచారం ఇచ్చారు. అవినాశ్ హైదరాబాద్ నుంచి పులివెందులకు బయల్దేరారు. అవినాష్ విచారణ కోసం ఢిల్లీ నుంచి హైదరాబాద్ సీబీఐ కార్యాలయానికి వచ్చిన అధికారులు సైతం అక్కడ నుంచి వెళ్లిపోయారు. ఇప్పుడు అవినాశ్ అభ్యర్ధన పైన సీబీఐ స్పందన కీలకం కానుంది.

పులివెందులకు అవినాశ్ : అటు సుప్రీంకోర్టులో అవినాశ్ ముందస్తు బెయిల్ పిటీషన్ విచారించాలనే అంశం పైన స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుతం వేసవి సెలవుల్లో ఉండటంతో వెకేషన్ బెంచ్ లో అవినాశ్ తరపు న్యాయవాదులు పిటీషన్ దాఖలు చేసారు. అవినాశ్ పిటీషన విచారణ తేదీ పైన నిర్ణయం రావాల్సి ఉంది. ఈ సమయంలో సీబీఐ ముందుకు అవినాశ్ హాజరు అవుతున్నారని..కీలక నిర్ణయాలు ఉంటాయని పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. కానీ, చివరి నిమిషంలో సీబీఐ విచారణకు అవినాశ్ హాజరు కాలేదు. పులివెందుల బయల్దేరారు. సీబీఐ అధికారులు అనుసరిస్తున్న తెలుస్తోంది. దీంతో..ఇప్పుడు సీబీఐ నిర్ణయం ఏంటనేది ఉత్కంఠగా మారుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+