వైఎస్ వివేకా హత్య .. ఇంటి దొంగలున్నారా ? మీరే గొడ్డలి వేటేశారా ? వైఎస్ జగన్ టార్గెట్ గా టీడీపీ
వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు పై వివేకా కుమార్తె సునీత రెడ్డి నిన్న సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తన తండ్రి హత్య కేసు ఇప్పటివరకూ కొలిక్కి రాకపోవడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన సునీతారెడ్డి న్యాయం కోసం ఇంత కాలం వేచి చూడాలని ప్రశ్నించారు. ప్రజల మద్దతు కోసమే తాను ప్రెస్మీట్ పెట్టినట్లుగా పేర్కొన్న ఆమె 15 మంది అనుమానితుల పేర్లను సిబిఐ అధికారులకు ఇచ్చామని వారిలో ఎంపీ అవినాష్ రెడ్డి కూడా ఉన్నారని పేర్కొన్నారు . సీఎం జగన్ కు సొంత బాబాయి అయిన వివేకా హత్య కేసు ఇప్పటివరకు తేలకపోవడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన సునీతారెడ్డి తన తండ్రి హత్య ఖచ్చితంగా రాజకీయ ప్రేరేపిత హత్యని పేర్కొన్నారు.

మీ సొంత బాబాయి సంగతేంటి ? ఇప్పుడు మీరు సీఎం కదా... మరి మీ పై బాధ్యత లేదా? గోరంట్ల ప్రశ్న
సునీత రెడ్డి వ్యాఖ్యల నేపథ్యంలో టిడిపి నేతలు సీఎం జగన్ మోహన్ రెడ్డిని టార్గెట్ చేసి విమర్శలు గుప్పించారు. వైయస్ వివేకానంద రెడ్డి హత్య పై టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఢిల్లీ వేదికగా సునీత రెడ్డి ప్రెస్ మీట్ పెట్టడం, తనకు న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేయడం పై జగన్ ను ప్రశ్నించిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి మీ సొంత బాబాయి సంగతేంటి ? ఇప్పుడు మీరు సీఎం కదా... మరి మీ పై బాధ్యత లేదా? లేక దీని వెనుక ఇంటి దొంగలు ఉన్నారా ? అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు .

బాబాయ్ గొడ్డలితో గుండెలపై పొడుచుకున్నా డా? లేక మీరే గొడ్డలి వేటేశారా? అయ్యన్న ప్రశ్న
ఎన్నికలకు ముందు జరిగిన వివేకా హత్య ఎన్నికల సమయంలో సింపతి కోసం చేయించిన, వైసిపి నాయకుల హస్తం ఉన్న రాజకీయ హత్యగా ఇప్పటికే టిడిపి నేతలు అనేక సార్లు అనుమానాలు వ్యక్తం చేశారు. ఇదే క్రమంలో తాజాగా మరోమారు జగన్ ను టార్గెట్ చేస్తూ విమర్శిస్తున్నారు. ఇక మాజీ మంత్రి, సీనియర్ నాయకుడు అయ్యన్నపాత్రుడు కూడా వైయస్ వివేకానంద రెడ్డి హత్య పై ట్విట్టర్ వేదికగా స్పందించారు. బాబాయ్ గొడ్డలితో గుండెలపై పొడుచుకున్నా డా? లేక మీరే గొడ్డలి వేటేశారా? అని ప్రశ్నించారు అయ్యన్నపాత్రుడు.

ఒక చెల్లి తెలంగాణాలో .. మరో చెల్లి ఢిల్లీలో .. అన్న కాదు అరాచకుడు అంటున్నారా ?
తెలుగుదేశం పార్టీపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలకు కౌంటర్ గా జగన్ ను టార్గెట్ చేస్తూ సాయిరెడ్డికి పలు ప్రశ్నలు సంధించారు. ఏ 2 దొంగ రెడ్డి అని సంబోధిస్తూ వైయస్ వివేకా హత్య పై చురకలంటించారు. ఓ చెల్లి తెలంగాణలో రోడ్లపైన, మరో చెల్లి ఢిల్లీలో .. అన్న కాదు అరాచకుడు అని నినదిస్తూ భయపెడుతున్నారా ? అని ప్రశ్నించారు . పంచాయతీలు ,మునిసిపాలిటీలు గెలిచామని కాలర్ ఎగరేస్తున్న ఏ 1 వలలు , బారికేడ్లు, 1000 మంది పోలీసులు కాపలాలో వ్యాక్సిన్ వేయించుకున్నాడు అంటేనే జనాన్ని చూసి ఎలా వణుకుతున్నాడో అర్థమయింది. సిబిఐ వాళ్ళు వస్తున్నారట .. హైదరాబాద్ లో కోవిడ్ బెడ్ లు రెడీ చేసుకో మరి సాయి రెడ్డి అంటూ అయ్యన్న వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ని, సీఎం జగన్ మోహన్ రెడ్డిని టార్గెట్ చేసి విమర్శలు గుప్పించారు.

వివేకా హత్య కేసు ఇంకా తేలకపోవటం , సునీతా రెడ్డి వ్యాఖ్యలతో టార్గెట్ అయిన జగన్
గత ఎన్నికల కంటే ముందు మార్చి నెలలో వైయస్ వివేకానంద రెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. అప్పటినుండి ఇప్పటివరకు ఆయన హత్య ఎందుకు జరిగింది? ఆయన హత్యకు పాల్పడిన వారెవరు ? అన్నది తేల్చలేకపోయారు. ఈ నేపథ్యంలోనే న్యాయం కోసం పోరాటం చేస్తున్న వివేకానంద రెడ్డి కుమార్తె సునీత రెడ్డి తన తండ్రి మరణం పై సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. సునీత రెడ్డి వ్యాఖ్యలతో తెలుగుదేశం పార్టీ నేతలు జగన్ ఇంతకాలం వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు పై ఏం చేశాడు అంటూ విరుచుకు పడుతున్నారు.
-
దేశవ్యాప్తంగా 'ఎనర్జీ లాక్ డౌన్'.. ప్రతి బుధవారం సెలవు.. కఠినమైన రూల్స్ అమల్లోకి..! -
వాస్తు ప్రకారం ఐశ్వర్యాన్ని తెచ్చేది మనీప్లాంట్ కాదు.. 'క్రాసులా' మొక్కను పెంచాలి -
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
విద్యార్థులకు గుడ్ న్యూస్.. మరో 4 రోజులు స్కూళ్లకు సెలవులు..! -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
రైతు భరోసా రెండు, మూడో విడత నిధుల జమ షెడ్యూల్ ఫిక్స్- ఎవరికి ఎప్పుడు..!! -
రామ్ చరణ్ "పెద్ది" కోసం ప్రభాస్ ఫేవరెట్ బ్యూటీ.. -
పదో తరగతి ఫలితాల విడుదల పై తాజా నిర్ణయం..!! -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్!












Click it and Unblock the Notifications