వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వివేకా హత్యకేసు తెలంగాణాకు బదిలీ: తలెక్కడ పెట్టుకుంటావ్ జగన్ రెడ్డి: చంద్రబాబు, లోకేష్ టార్గెట్!!

|
Google Oneindia TeluguNews

వైయస్ వివేకానంద రెడ్డి హత్య గత ఎన్నికలకు ముందు జరిగినా ఇప్పటివరకు వైయస్ వివేకానంద రెడ్డిని ఎవరు హత్య చేశారు అన్నది తేలలేదు. అప్పటి నుండి ఆయన కుమార్తె వైఎస్ సునీతా రెడ్డి తన తండ్రిని చంపిన వారిని పట్టుకోవటం కోసం న్యాయపోరాటం చేస్తుంది. వైయస్ వివేకా హత్య కేసు మిస్టరీని ఛేదించడానికి సిబిఐ రంగంలోకి దిగి దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే సి.బి.ఐ దర్యాప్తు నేపథ్యంలో ఎదురవుతున్న బెదిరింపులతో వైయస్ వివేకా హత్య కేసును వేరే రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి బదిలీ చేసినా పరవాలేదని వైయస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీత సుప్రీం కోర్టులో పిటీషన్ దాఖలు చేయగా సుప్రీంకోర్టు నేడు ఈ కేసులో సంచలన తీర్పునిచ్చింది.

వైఎస్ వివేకా హత్యకేసు తెలంగాణా రాష్ట్రానికి బదిలీ

వైఎస్ వివేకా హత్యకేసు తెలంగాణా రాష్ట్రానికి బదిలీ


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పోలీసులు దర్యాప్తు అధికారులను బెదిరిస్తున్నారని వివేకా హత్య కేసులో సునీత ఆరోపణలు చేస్తూ తన తండ్రి హత్యకేసును వేరే రాష్ట్రానికి బదిలీ చెయ్యాలని సుప్రీం ధర్మాసనాన్ని కోరింది. ఏపీలో జరుగుతున్న దర్యాప్తుపై తమకు నమ్మకం పోయిందని పేర్కొంది. హత్య కేసును విచారిస్తున్న సీబీఐ అధికారులకు కూడా భద్రత లేనందున ఇతర రాష్ట్రం లోని సీబీఐ కోర్టులోదర్యాప్తుకు అప్పగించాలని ఆమె సుప్రీం కోర్టుకు చేసిన విజ్ఞప్తిపై స్పందించిన అత్యున్నత న్యాయస్థానం నేడు సంచలన తీర్పును వెలువరించింది. వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణను తెలంగాణ రాష్ట్రానికి బదిలీ చేస్తూ తీర్పునిచ్చింది.

టార్గెట్ చేసిన చంద్రబాబు... తలెక్కడ పెట్టుకుంటావ్ జగన్ రెడ్డి ?

టార్గెట్ చేసిన చంద్రబాబు... తలెక్కడ పెట్టుకుంటావ్ జగన్ రెడ్డి ?


ఇక దీనిపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బాబాయ్ హత్య కేసునే ఇప్పటివరకు ఛేదించలేకపోయారు అంటూ జగన్ రెడ్డి ని టార్గెట్ చేస్తూ టిడిపి అధినేత చంద్రబాబు, టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు నారా లోకేష్ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేశారు. సోషల్ మీడియా వేదికగా దీనిపైన స్పందించిన చంద్రబాబు సొంత బాబాయ్ హత్య కేసు విచారణ పొరుగు రాష్ట్రానికి బదిలీ ... అది కూడా నువ్వు సీఎంగా ఉండగా! అని ప్రశ్నించారు. తలెక్కడ పెట్టుకుంటావ్ జగన్ రెడ్డీ? అంటూ నిలదీశారు చంద్రబాబు.

బాబాయ్ హత్య కేసు పక్క రాష్ట్రానికి... అబ్బాయ్ చంచల్ గూడ జైలుకి: లోకేష్

బాబాయ్ హత్య కేసు పక్క రాష్ట్రానికి... అబ్బాయ్ చంచల్ గూడ జైలుకి: లోకేష్


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన వైఎస్ వివేకా హత్య ఉదంతానికి సంబంధించిన కేసును, ఏపీ కాకుండా వేరే రాష్ట్రానికి బదిలీ చేయడం ఏపీకి అవమానం అన్న చందంగా చంద్రబాబు ఆ పోస్ట్ పెట్టారు. ఇక తాజాగా సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో నారా లోకేష్ స్పందిస్తూ బాబాయ్ హత్య కేసు పక్క రాష్ట్రానికి... అబ్బాయ్ చంచల్ గూడ జైలుకి.. అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అబ్బాయి కిల్డ్ బాబాయ్ అంటూ జగన్ మోహన్ రెడ్డి ని టార్గెట్ చేశారు.

 చెల్లెలికి ఇంత అన్యాయం చేసిన అన్న ఉండడు: టీడీపీ ఇక తెలుగుదేశం పార్టీ ట్విటర్ ఖాతాలో వివేకా హత్య కేసు విచారణను తెలంగాణకు సుప్రీం కోర్టు బదిలీ చేయడం విన్నాక వేరే వాళ్ళు అయితే సిగ్గుతో రాజీనామా చేసే వాళ్ళు. వివేకా హత్య కేసులో ముందు నుండీ టీడీపీ చెబుతున్నదే నిజమైంది అని పేర్కొని, హత్య కేసులో విచారణ పక్కదారి పట్టించడం, సాక్షులను, సీబీఐ అధికారులను బెదిరించడం అన్నీ నిజాలే. చెల్లెలికి ఇంత అన్యాయం చేసిన అన్న ఉండడు అంటూ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసింది తెలుగుదేశం పార్టీ.

చెల్లెలికి ఇంత అన్యాయం చేసిన అన్న ఉండడు: టీడీపీ ఇక తెలుగుదేశం పార్టీ ట్విటర్ ఖాతాలో వివేకా హత్య కేసు విచారణను తెలంగాణకు సుప్రీం కోర్టు బదిలీ చేయడం విన్నాక వేరే వాళ్ళు అయితే సిగ్గుతో రాజీనామా చేసే వాళ్ళు. వివేకా హత్య కేసులో ముందు నుండీ టీడీపీ చెబుతున్నదే నిజమైంది అని పేర్కొని, హత్య కేసులో విచారణ పక్కదారి పట్టించడం, సాక్షులను, సీబీఐ అధికారులను బెదిరించడం అన్నీ నిజాలే. చెల్లెలికి ఇంత అన్యాయం చేసిన అన్న ఉండడు అంటూ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసింది తెలుగుదేశం పార్టీ.


చెల్లెలికి ఇంత అన్యాయం చేసిన అన్న ఉండడు: టీడీపీ
ఇక తెలుగుదేశం పార్టీ ట్విటర్ ఖాతాలో వివేకా హత్య కేసు విచారణను తెలంగాణకు సుప్రీం కోర్టు బదిలీ చేయడం విన్నాక వేరే వాళ్ళు అయితే సిగ్గుతో రాజీనామా చేసే వాళ్ళు. వివేకా హత్య కేసులో ముందు నుండీ టీడీపీ చెబుతున్నదే నిజమైంది అని పేర్కొని, హత్య కేసులో విచారణ పక్కదారి పట్టించడం, సాక్షులను, సీబీఐ అధికారులను బెదిరించడం అన్నీ నిజాలే. చెల్లెలికి ఇంత అన్యాయం చేసిన అన్న ఉండడు అంటూ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసింది తెలుగుదేశం పార్టీ.

ఎమ్మెల్సీ కవితపై కేసు నమోదుకు హైకోర్టు మెట్లెక్కిన ఎంపీ అరవింద్.. కారణమిదే!!ఎమ్మెల్సీ కవితపై కేసు నమోదుకు హైకోర్టు మెట్లెక్కిన ఎంపీ అరవింద్.. కారణమిదే!!

English summary
Chandrababu targeted Jagan Reddy saying, "Where will you put your head" on the transfer of YS Viveka's murder case to Telangana? Lokesh also posted a shocking post on Jagan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X