హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైఎస్ వివేకా హత్య కేసులో మున్ముందు అనూహ్య పరిణామాలు?

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తులో మున్ముందు అనూహ్య పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

|
Google Oneindia TeluguNews

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తులో మున్ముందు అనూహ్య పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. తాజాగా కడప ఎంపీ అవినాష్ రెడ్డిని విచారించిన అధికారులు తర్వాత మరోసారి విచారణకు హాజరు కావాల్సి ఉంటుందని చెప్పారు.

తాను పూర్తిగా సహకరిస్తానని, ప్రజలందరికీ తెలియజేయడం కోసం విచారణను వీడియో తీయాలని కోరినప్పటికీ సీబీఐ అంగీకరించలేదన్నారు. తనపై ఒక వర్గం మీడియా కుట్ర చేస్తోందని అవినాష్ రెడ్డి ఆరోపించారు.

జైలులో ఉన్నవారిని కోర్టుకు హాజరుపరచాలి?

జైలులో ఉన్నవారిని కోర్టుకు హాజరుపరచాలి?

ఫిబ్రవరి 10వ తేదీన విచారణకు హాజరుకావాలంటూ సీబీఐ కోర్టు నిందితులైన గజ్జల ఉమాశంకర్ రెడ్డి, సునీల్‌ యాదవ్‌, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, ఎర్ర గంగిరెడ్డితోపాటు అప్రూవర్ గా మారిన దస్తగిరికి సమన్లు జారీచేసింది. కడప సెషన్స్ కోర్టు నుంచి ఇటీవలే సీబీఐ దాఖలు చేసిన అభియోగ పత్రాలు, సిట్ దర్యాప్తు చేసిన ఫైల్స్, ఇతర ఫైల్స్ అన్నీ సీబీఐ కోర్టుకు చేరాయి. దర్యాప్తు అధికారులు ఇప్పటివరకు 248 మందిని విచారించి వాంగ్మూలాలను నమోదు చేశారు.

సీబీఐ కోర్టు ఈ కేసుకు ఎస్‌సీ 1/2023గా నంబరు కేటాయించింది. జైలులో ఉన్న శివశంకర్ రెడ్డి, సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డిని హైదరాబాద్ జైలుకు తరలించని పక్షంలో సీబీఐ కోర్టుకు హాజరుపరచాల్సి ఉంటుంది. లేదంటే కోర్టు అనుమతితో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరుపరిచే అవకాశాలున్నాయి.

క్షేత్రస్థాయిలో ఆధారాలు సేకరించిన సీబీఐ

క్షేత్రస్థాయిలో ఆధారాలు సేకరించిన సీబీఐ


ఢిల్లీ సీబీఐ ఎస్‌సీ-3 విభాగం ఎస్పీ రాంసింగ్‌ నేతృత్వంలోని బృందం అవినాష్‌రెడ్డిని సుదీర్ఘంగా విచారించింది. అలాగే వివేకానందరెడ్డి హత్య జరిగిన సమయంలో దర్యాప్తు చేసిన కడప పోలీసులను కూడా సీబీఐ అధికారులు అవినాష్ రెడ్డి రావడానికి ముందు ప్రశ్నించినట్లు తెలుస్తోంది.

2019 మార్చిలో వైఎస్‌ వివేకా హత్య జరగ్గా తొలుత గుండెపోటు మరణంగా చిత్రీకరించే ప్రయత్నం జరిగిందనే ఆరోపణలు వచ్చాయి. హత్య జరిగిన ఏడాది తర్వాత హైకోర్టు ఆదేశాలతో కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించారు. అప్పటి నుంచి పలు విడతలుగా సీబీఐ దర్యాప్తును కొనసాగిస్తోంది. కడప జిల్లాకు వెళ్లి క్షేత్రస్థాయిలో సాక్ష్యాధారాల్ని సేకరించాయి.

ఏపీ పోలీసులపై సీబీఐ అధికారుల అసహనం

ఏపీ పోలీసులపై సీబీఐ అధికారుల అసహనం


248 మంది నుంచి వాంగ్మూలాలను సేకరించిన అధికారులు పూర్తిస్థాయిలో ఆధారాలు సేకరించిన తర్వాతే అవినాష్ రెడ్డి ని విచారించాలనే యోచనలో సీబీఐ ఉంది. ఆంధ్రప్రదేశ్ పోలీసులు సహకరించడంలేదని మొదటి నుంచి సీబీఐ అధికారులు అసహనంగా ఉన్నారు.

వైఎస్ వివేకా కుమార్తె సునీతారెడ్డి కేసు విచారణను ఇతర రాష్ట్రానికి మార్చాలంటూ సుప్రీంకోర్టను ఆశ్రయించారు. దీంతో ఈ కేసు విచారణను తెలంగాణకు బదిలీ చేస్తూ సుప్రీం ఉత్తర్వులిచ్చింది. నోటీసుల జారీ ఒక్క అవినాష్ రెడ్డితో ఆగేది కాదని, మున్ముందు చాలామంది నోటీసులు అందుకునే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

వివేకా హత్యకేసుకు సంబంధించిన కీలక విషయాలను తమకు తెలియజేయాల్సిందిగా కీలక వ్యక్తులను సీబీఐ విచారణకు పిలిచే అవకాశం ఉందంటున్నారు. మున్ముందు ఈ కేసు దర్యాప్తులో అనూహ్య పరిణామాలు చోటుచేసుకోబోతున్నాయని భావిస్తున్నారు.

English summary
Political circles are predicting that the investigation of YS Vivekananda Reddy's murder case may lead to unexpected developments.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X