మా ఇంట్లోనే మాకు శత్రువులు: వైఎస్ వివేకా సతీమణి సంచలన వీడియో; టీడీపీ ట్వీట్!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో ప్రస్తుతం వైయస్ వివేకానంద రెడ్డి ఐదో వర్ధంతి వేళ అన్ని రాజకీయ పార్టీలు అలర్ట్ అయ్యాయి. వివేకానంద రెడ్డి హత్య కేసును తెరమీదకు తీసుకువచ్చి రాజకీయాలు చేసేందుకు అన్ని రాజకీయ పార్టీలు రెడీ అయ్యాయి. ముఖ్యంగా వైయస్ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయడానికి ఆయుధంగా ఎంచుకున్నాయి.
గత ఎన్నికలకు ముందు మార్చి నెలలో మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. అయితే అప్పటినుంచి ఇప్పటివరకు వైయస్ వివేకానంద రెడ్డి ని ఎవరు ఎందుకు హతమార్చారు అన్నది బయటకు రాలేదు. అయితే నేడు మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి ఐదో వర్ధంతి సందర్భంగా పులివెందులలో ఘాట్ వద్ద ఆయన కుమార్తె సునీత రెడ్డి తండ్రి సమాధి వద్ద పూలమాలవేసి నివాళులర్పించారు.

ఇదే సమయంలో వైయస్ వివేకానంద రెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ మాట్లాడిన ఒక సంచలన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఇటీవల ఓ టెలివిజన్ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సౌభాగ్యమ్మ తన భర్త మరణంపై ఆవేదన వ్యక్తం చేశారు. మా ఇంట్లోనే శత్రువులు ఉన్నారని, ఈ విషయం తాము గ్రహించలేకపోయామని సౌభాగ్యమ్మ సంచలన వ్యాఖ్యలు చేశారు.
వివేకానంద రెడ్డిని ఎమ్మెల్సీగా ఓడించి ఆయనను పక్కన పెట్టేసారు అని వ్యాఖ్యలు చేశారు. అసలు వైయస్ వివేకానంద రెడ్డి విషయంలో ఇలా జరుగుతుందని కానీ, ఇలా చేస్తారని కానీ తమ ఊహించలేకపోయాము అని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరెవరి మనసులో ఏముందో గ్రహించలేకపోయామని పేర్కొన్న సౌభాగ్యమ్మ, తలుచుకుంటే చాలా బాధేస్తుంది అని పేర్కొన్నారు.
జగన్‌లో మాపై ఇంత ద్వేషం ఉందనుకోలేదు. మా ఇంట్లోనే మా శత్రువులు ఉన్నారని గ్రహించలేక పోయాం. ఇది చాలా ఘోరమైన పరిస్థితి.
— Telugu Desam Party (@JaiTDP) March 15, 2024
- వైఎస్ వివేకా సతీమణి సౌభాగ్యమ్మ#JaganBehindVivekaMurder #AbbaiKilledBabai #JusticeForBabai #YCPAntham #2024JaganNoMore #ByeByeJaganIn2024 #AndhraPradesh pic.twitter.com/aDIXrrM5g2
ఆమె మాట్లాడిన వీడియోను టిడిపి తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తోంది. సౌభాగ్యమ్మ వ్యాఖ్యలు జగన్ ను ఉద్దేశించిన వ్యాఖ్యలని పోస్ట్ పెట్టింది. జగన్‌లో మాపై ఇంత ద్వేషం ఉందనుకోలేదు. మా ఇంట్లోనే మా శత్రువులు ఉన్నారని గ్రహించలేక పోయాం. ఇది చాలా ఘోరమైన పరిస్థితి అని వైయస్ వివేకా సతీమణి సౌభాగ్యమ్మ వ్యాఖ్యలు చేశారని ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టింది.












Click it and Unblock the Notifications