వైఎస్ వివేకా ఓడిపోతారా, ఆది ఏమంటున్నారు?

Posted By:
Subscribe to Oneindia Telugu

కడప:కడప జిల్లాలో తొలిసారిగా వైఎస్ కుటుంబాన్ని ఓడించబోతున్నామని, ఏక పక్ష కుటుంబ పాలనకు చరమగీతం పాడబోతున్నట్టు టిడిపి నేతలు ప్రకటించారు. ఆ పార్టీకి చెందిన రాజ్యసభ్యుడు సిఎం రమేష్, ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు రెడ్డి శుక్రవారం నాడు ప్రకటించారు.

కడప స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపి అభ్యర్థి బిటెక్ రవి భారీ మెజారిటీతో విజయం సాధిస్తారని ఆయన ధీమాను వ్యక్తం చేశారు.

ys vivekananda reddy

ఈ ఎన్నికల్లో తమ బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి ఓటమిపాలౌతారనే బయంతోనే జగన్ ఓటు వేసేందుకు వచ్చారని ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి చెప్పారు.

జిల్లా అభివృద్దికి సంబంధించిన అనేక సమావేశాలు జరిగినా ఒక్క దానికి కూడ హజరుకాని జగన్ తన చిన్నాన్న ఓడిపోతున్నారని తెలిసి ఓటు వేసేందుకు వచ్చారని ఆయన ఆరోపించారు. ఓటమి భయంతోనే ఒక్క ఓటు వచ్చినా చాలనే ఉద్దేశ్యంతోనే జగన్ ఈ ఓటింగ్ లో పాల్గొన్నారని ఆయన ఎద్దేవా చేశారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
ys vivekananda reddy will defeat in local body mlc elections said tdp leaders cm ramesh , adinarayana reddy, srinivasulu reddy on friday.first time ys family members will be defeat said mla adinarayana reddy.
Please Wait while comments are loading...