వివేకా హత్య కేసులో కొత్త ట్విస్ట్ - ఆధారాలను చెరిపివేసిందెవరు...!!
వివేకా హత్య కేసులో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఎంపీ అవినాష్‌రెడ్డి ప్రధాన అనుచరుడైన ఉదయ్‌కుమార్‌రెడ్డిని సీబీఐ అదుపులోకి తీసుకుంది. ఉదయ్ రిమాండ్ రిపోర్ట్‌లో కీలక అంశాలు వెల్లడించింది.కడపలో అరెస్ట్ చేసి హైదరాబాద్ తీసుకొచ్చిన ఉదయ్‌కుమార్‌రెడ్డికి 14 రోజుల రిమాండ్ విధించారు న్యాయమూర్తి. దీంతో అతడిని చంచల్‌గూడ జైలుకు తరలించారు. విచారణ అనంతరం న్యాయమూర్తి అతనికి ఈనెల 26 వరకూ రిమాండ్ విధించారు. రిమాండ్ రిపోర్టులో సీబీఐ పలు అంశాలను ప్రస్తావించింది.
సీబీఐ సేకరించిన గూగుల్ టేక్ ఔట్ లో ఉదయ్ కుమార్‌కి సంబంధించిన వివరాలు ఉండడంతో సీబీఐ ఆయన్ని అదుపులోకి తీసుకుంది. హత్య ప్రదేశంలో ఆధారాలను టాంపర్ చేయటంలో ఉదయ్ తో పాటుగా మరి కొందరి పేర్లను సీబీఐ ప్రస్తావించింది.

వివేక హత్య గురించి ఉదయ్ కుమార్ రెడ్డికి ముందే తెలుసన్నది రిమాండ్ రిపోర్ట్‌లో సీబీఐ పేర్కొంది. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం కోసం ఉదయ్ కుమార్ రెడ్డిని పలుమార్లు విచారించినా సహకరించలేదని సీబీఐ పేర్కొంది. ఉదయ్ కుమార్ రెడ్డి పారిపోతాడనే అనుమానంతోనే అరెస్ట్ చేయాల్సి వచ్చిందని సీబీఐ రిమాండ్ రిపోర్టులో వివరించింది. ఇదే సమయంలో హత్య జరిగిన రోజున ఏం జరిగిందేనది రిమాండ్ రిపోర్టులో సీబీఐ వెల్లడించింది.
వివేకా హత్య రోజు ఉదయం 4 గంటలకు ఉదయ్ కుమార్ తన ఇంట్లో నుంచి బయటికెళ్లారని చెప్పుకొచ్చింది. హత్యకు గురైన స్థలంలోని ఆధారాలను ఉదయ్ చెరిపేశారనేందుకు సాక్ష్యాలు ఉన్నాయని సీబీఐ పేర్కొంది. వివేకా గుండెపోటుతో చనిపోయినట్లు చిత్రీకరణకు ఉదయ్ ప్రయత్నించారని వివరించింది.

అవినాష్‌కు శివప్రకాశ్ రెడ్డి ఫోన్‌చేసి వివేకా చనిపోయినట్లు సమాచారమిచ్చారని తెలిపింది. అవినాష్ ఇంట్లో ఉదయ్ కుమార్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, శివశంకర్ రెడ్డిలు ఉన్నట్లు గుర్తించామని రిపోర్టులో పేర్కింది. ఉదయ్‌కుమార్‌ను విచారణ కోసం సీబీఐ కస్టడీ పిటిషన్ వేసింది. మరోవైపు ఉదయ్‌కుమార్ తరఫున నోటీసులు తీసుకున్న ఆయన న్యాయవాదులు బెయిల్ మంజూరు చేయాలని మెజిస్ట్రేట్‌ను కోరారు. అయితే సోమవారం కస్టడీ, బెయిల్ పిటిషన్లపై విచారణ చేస్తామని కోర్టు తెలిపింది.












Click it and Unblock the Notifications