వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బ్రేకింగ్: జగన్-షర్మిలను కలిపిన వైఎస్సార్ ఘాట్ : కలిసి ప్రార్ధనల్లో-అంతా ఒక్కటిగా: కానీ...!!

By Lekhaka
|
Google Oneindia TeluguNews

అన్నా-చెల్లి ఒకే వేదిక మీదకు వచ్చారు. తండ్రి వైఎస్సార్ ఘాట్ సాక్షిగా ఇద్దరూ కలిసే వైఎస్సార్ ను నివాళి అర్పించారు. ప్రార్ధనల్లో పక్క పక్కనే ఉన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ కు సీఎం జగన్ కుటుంబ సభ్యులతో కలిసి నివాళి అర్పించారు. ఇడుపులపాయలోని తండ్రి ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్ధనల్లో పాల్గొన్నారు. ముందు రోజే ఇడుపులపాయ చేరుకున్న సీఎం జగన్ వైఎస్సార్ 12వ వర్దంతి సందర్భంగా వైఎస్సార్ ఘాట్ లో కుటుంబ సభ్యులతో కలిసి నివాళులు అర్పించారు. కొంత కాలంగా సీఎం జగన్ - షర్మిల మధ్య ఏర్పడిన గ్యాప్ తో ఇద్దరూ ఎక్కడ కలిసిన సందర్భాలు లేవు.

#YSR :మరపురాని మహానేత YSR గారి 12వ వర్థంతి సందర్భంగా ఘననివాళులు, ప్రముఖులతో వైఎస్‌ రాజశేఖరరెడ్డి (ఫొటోస్)

అన్నా - చెల్లెలు కలిసారు..

అన్నా - చెల్లెలు కలిసారు..

అయితే, ఈ సారి తండ్రి వైఎస్సార్ వర్దంతికి నివాళి అర్పించేందుకు ఇద్దరూ ముందు రోజు సాయంత్రమే ఇడుపులపాయకు చేరుకున్నారు. దీంతో..ఇద్దరూ కలిసి కుటుంబ సభ్యులతో పాటుగా నివాళి అర్పిస్తారా లేక జూలై 8న జయంతి నాడు జరిగిన విధంగానే విడివిడిగానే తమ కార్యక్రమాలు పూర్తి చేస్తారా అనే ఆసక్తి కర చర్చ జరుగుతోంది. దీంతో..వైఎస్సార్ అభిమానులు ఇడుపులపాయలో నివాళి కార్యక్రమం పైన ఆసక్తి చూపిస్తున్నారు. అయితే, గ్యాప్ ఇక ఉండదనే విధంగా అన్నా -చెల్లి తమ కుటుంబ సభ్యులతో కలిసి ప్రార్ధనల్లో పాల్గొన్నారు.

 జగన్ - షర్మిలను కలిపిన వైఎస్సార్ ఘాట్..

జగన్ - షర్మిలను కలిపిన వైఎస్సార్ ఘాట్..

గతంలో లాగా..అంత క్లోజ్ రిలేషన్ మాత్రం ఈ సారి కనిపించ లేదు. ప్రతీ ఏటా క్రిస్మస్ వేడుకలను కలిసే జరుపుకొనే జగన్ కుటుంబ సభ్యులు..గత ఏడాది మాత్రం కలవలేదు. ఇక, తెలంగాణలో షర్మిల పార్టీ ఏర్పాటును జగన్ వ్యతిరేకించారు. పొరుగు రాష్ట్రంతో సన్నిహిత సంబంధాలు కోరుకుంటున్న తాము అక్కడి రాజకీయాల్లో జోక్యం చేసుకోబోమని జగన్ స్పష్టం చేసారు. అయితే, షర్మిల తెలంగాణలో రాజకీయ పార్టీ ఏర్పాటు చేసారు. దీంతో..వారిద్దరి మధ్య గ్యాప్ కనిపించింది. ప్రతీ ఏటా తన అన్నకు రాఖీ కట్టి సెలబ్రేషన్స్ చేసుకొనే షర్మిల..ఈ ఏడాది కేవలం ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలకే పరిమితం అయ్యారు.

ఇద్దరూ వేర్వేరు పార్టీలతో..

ఇద్దరూ వేర్వేరు పార్టీలతో..


ఇక, తెలంగాణలో పార్టీ ఏర్పాటు-ఈ రోజు విజయమ్మ హైదరాబాద్ లో వైఎస్సార్ సంస్మరణ సభ ద్వారా మరింత ముందుకు వెళ్లేందుకు రూట్ క్లియర్ చేసుకుంటున్నారు. కానీ, జగన్ మాత్రం షర్మిల రాజకీయ వ్యవహారాలకు పూర్తిగా దూరంగా ఉంటున్నారు. తన చెల్లి వెనుక తాను ఉన్నాననే అభిప్రాయం కలగకుండా జాగ్రత్త పడుతూ వచ్చారు. అందులో భాగంగా.. జూలై 8న తన తండ్రి జన్మదినం నాడు ఇడుపుల పాయలో నివాళి అర్పించేందుకు ముందుగా షెడ్యూల్ ఖరారు కాగా..అదే సమయానికి షర్మిల సైతం వస్తుండటంతో సీఎం జగన్ తన సమయాన్ని మార్చుకున్నారు.

జగన్ ఇప్పటి వరకూ జాగ్రత్తగా..

జగన్ ఇప్పటి వరకూ జాగ్రత్తగా..


రాజకీయంగా ఎటువంటి అనుమానాలకు తావు ఇవ్వకూడదనే సీఎం జగన్ తన షెడ్యూల్ మార్చుకున్నారంటూ ఆయన సన్నిహితులు స్పష్టం చేసారు. ఇక, ఈ సారి ఇద్దరూ ముందు రోజే ఇడుపులపాయకు చేరటంతో..రాజకీయంగా ఎటువంటి భిన్నాభిప్రాయాలు ఉన్నా..అన్నా- చెల్లెలుగా ఒక్కటిగా తండ్రికి నివాళి అర్పించటం తో ఇప్పుడు ఇది తెలుగు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇక, ఈ రోజు సాయంత్రం హైదరాబాద్ లో విజయమ్మ తన భర్త వైఎస్సార్ 12వ వర్దంతి సందర్భంగా ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసారు. రాజకీయాలకు అతీతంగా నాడు వైఎస్సార్ తో కలిసి సన్నిహితంగా మెలిగిన వారిని పేరు పేరునా ఆహ్వానించారు.

 విజయమ్మ సభ పైనా ఆసక్తి..

విజయమ్మ సభ పైనా ఆసక్తి..


అయితే, ఏపీ నుంచి గతంలో వైఎస్సార్ తో కలిసి పని చేసి..నేడు జగన్ కు మద్దతుగా ఉన్న వారు మాత్రం ఈ కార్యక్రమానికి హాజరు కావటం లేదని తెలుస్తోంది. ఇరత పార్టీల్లో ఉన్న నేతలు-సినీ ప్రముఖులు- ఇతర రంగాల వ్యక్తులను దాదాపుగా 350 మంది వరకు విజయమ్మ ఆహ్వానించారు. వారిలో ఎవరెవరు హాజరవుతారనేది ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయంగా ఆసక్తి కరంగా మారుతోంది. ఇది పూర్తిగా షర్మిలకు మద్దతుగా నిర్వహిస్తున్న కార్యక్రమంగా ప్రచారం సాగుతోంది. నాడు వైఎస్సార్ తో పని చేసిన వారు ఇప్పుడు పలు పార్టీలో ఉన్నారు. దీంతో..విజయమ్మ నిర్వహిస్తున్న ఈ ఆత్మీయ సమావేశం పైన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ డిబేట్ నడుస్తోంది.

English summary
After a long gap AP CM YS Jagan and his sister YSRTP Chief YS Sharmila were seen at the YSR Ghat at Idupulapaya on former AP CM YS Rajasekhar Reddy's death anniversary.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X