ysr బీమా పథకం.. రూ.5 లక్షలవరకు లాభం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేక పథకాలను అందిస్తోంది. వైఎస్సార్ బీమా పథకం కూడా ఇందులో ఒకటి. దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వారందరికీ వర్తించే విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. కుటుంబ పెద్ద సహజ మరణం పొందినా లేదంటే ప్రమాదవశాత్తు మరణించినా మొత్తం బీమా పరిహారం అందిస్తారు. వైఎస్సార్ బీమా పథకం పూర్తి వివరాలు తెలుసుకుందాం.
* స్కీమ్ పేరు వైఎస్సార్: బీమా
* రాష్ట్రం: ఆంధ్రప్రదేశ్
* లబ్ధి ఎవరికి: ప్రజలు
* లక్ష్యం: ఉచితబీమా
* ఆవిష్కర్త: వైఎస్ జగన్మోహన్ రెడ్డి
* అధికారిక వెబ్‌సైట్ https://ysrbima.ap.gov.in/

పరిహారం ఎంత చెల్లిస్తారు?
ఈ బీమా పథకం పరిధిలోకి వచ్చినవారు ప్రమాదవశాత్తూ మృతిచెందినా, లేదంటే సహజ మరణం పొందినా బీమా లభిస్తుంది. 18 నుంచి 70 సంవత్సరాల మధ్య వయసువారు ప్రమాదంలో మరణించినా, అంగవైకల్యం సంభవించినా వారికి రూ.5 లక్షలు వస్తాయి. బీమా సొమ్ము వారి బ్యాంకు ఖాతాలో పడుతుంది. క్లెయిమ్ చేసిన 15 రోజుల్లోగా రూ.5 లక్షలు వస్తాయి. తక్షణమే బాధిత కుటుంబానికి సాయం కింద రూ.10వేల ఆర్థిక సాయం చేస్తారు. బీమా ప్రీమియం ఖర్చును ఏపీ ప్రభుత్వం భరిస్తుంది. వైఎస్సార్ బీమా పథకంలో చేరినవారికి ప్రభుత్వం ఒక గుర్తింపుకార్డును అందజేస్తుంది. ఈ పథకానికి సంబంధించిన అన్ని సందేహాలను తొలగించేందుకు 155214 టోల్ ఫ్రీ నెంబరులో సంప్రదింవచ్చు. ఎవరికైతే అర్హత ఉందో వారందరినీ వాలంటీర్లు గుర్తిస్తారు. ఇంటికి వచ్చి ఈ పథకంలో మిమ్మల్ని నమోదు చేయిస్తారు.
నామినీలుగా..
* పెళ్లి కాని కుమార్తె
* 21 ఏళ్ల కుమారుడు
* లబ్ధిదారుడి భార్య
* తల్లిదండ్రులు
* వితంతువు కుమార్తె లేదంటే ఆమె పిల్లలు
అవసరమైన డాక్యుమెంట్లు
* ధరఖాస్తు చేసుకునేవారు ఏపీలో నివసిస్తూ ఉండాలి
* కచ్చితంగా రేషన్ కార్డు ఉండాల్సిందే
* ఆధార్ కార్డు
* నివాస ద్రువీకరణ పత్రం
* ఆదాయ ధ్రువీకరణ పత్రం
* బ్యాంక్ ఖాతా వివరాలు
* మొబైల్ నెంబర్












Click it and Unblock the Notifications