Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఆ నియోజకవర్గం విషయంలో వైసీపీ లెక్కలు తప్పాయా..?

2019 ఎన్నికల్లో ఘన విజయం సాధించిన అధికార వైసీపీ , 2024 ఎన్నికల్లో కూడా ఇవే ఫలితాలను రిపీట్ చేయాలని భావిస్తుంది.దీనికి అనుగుణంగానే పార్టీ అధినేత జగన్ ప్రణాళికలు రచిస్తున్నారు. కొన్ని కీలక నియోజకవర్గాల్లో అభ్యర్థులను ముందుగానే ప్రకటిస్తూ ప్రత్యర్థులకు చెక్ పెడుతున్నారాయన. కాని ఓ కీలక నియోజకవర్గంలో మాత్రం అధికార పార్టీ రేసులో వెనుకపడిందనే గుస గుసలు వినిపిస్తున్నాయి. ఆ నియోజకవర్గంలో అధికార పార్టీ లెక్కలు తప్పినట్టుగానే కనిపిస్తుంది.

ఆ నియోజకవర్గం మరేదో కాదు గన్నవరం. ఈ నియోజకవర్గం టీడీపీకి కంచుకోట. గతంలో దాసరి బాలవర్ధన్, ఇప్పుడు వల్లభనేని వంశీ ఇద్దరూ టీడీపీ నుంచి వరుసగా ఎమ్మెల్యేలుగా విజయం సాధించినవారే. 2014,2019 ఎన్నికల్లో వల్లభనేని వంశీ ఇక్కడ నుంచి విజయం సాధించారు. అయితే వల్లభనేని వంశీ టీడీపీని కాదని వైసీపీ ప్రభుత్వనికి అండగా నిలిచారు. ఇక్కడ వరకు బాగానే ఉన్నప్పటికీ .. వల్లభనేని వంశీ రాకను వైసీపీ నేత యార్లగడ్డ వెంకట్రావు తీవ్రంగా వ్యతిరేకించారు. సీఎం జగన్ ముందు బాహాటంగానే తన అసంతృప్తిని వ్యక్తం చేశారు.

 YSR Congress

యార్లగడ్డ వెంకట్రావును వైసీపీ అధిష్టానం ఖాతర్ చేయకపోవడంతో.. ఆయన టీడీపీలో చేరి అధికార పార్టీకి షాకిచ్చారు. అయితే యార్లగడ్డ వెంకట్రావుతో పార్టీ నేతలు ఎవరైనా మాట్లాడి బుజ్జగించి ఉంటే ఆయన కచ్చింతంగా వైసీపీలోనే కొనసాగేవారనే మాటలు వినిపిస్తున్నాయి. యార్లగడ్డకు ప్రత్యామ్నయంగా వేరే స్థానాన్ని చూపించి ఉంటే ..నియోజకవర్గంలో వైసీపీ పరిస్థితి మెరుగ్గా ఉండేదని పార్టీ క్యాడరే చర్చించుకోవడం విశేషం. పార్టీ కార్యకర్తలను కాపాడుకోవడానికి యార్లగడ్డ చాలా సమస్యలను ఫేస్ చేశారు. వల్లభనేని వంశీ వైసీపీ కార్యకర్తలపై కేసులు పెట్టి ఇబ్బంది పెట్టినప్పుడు యార్లగడ్డ వారికి అండగా నిలిచిన సందర్భాలు చాలానే ఉన్నాయి.

 YSR Congress

దీనిని అధిష్టానం గుర్తించనందునే యార్లగడ్డ పార్టీని వీడారు. వైసీపీని వీడే ముందు కూడా ఆయన తన అనుచరులతో సమావేశం అయ్యారు. అప్పుడే వైసీపీ అధిష్టానం యార్లగడ్డతో మాట్లాడే ప్రయత్నం చేసి ఉంటే బాగుండేదనే క్యాడర్ అంటుంది.ఎన్నారైగా ఉన్న యార్లగడ్డను జగన్ పిలిచి మరి టికెట్ ఇచ్చారు. 2019 ఎన్నికల్లో యార్లగడ్డ 700 ఓట్ల అతి స్వల్ప మెజార్టీతోనే వంశీ చేతిలో ఓడిపోయారు. వంశీతో కలిసి పని చేయలేకనే యార్లగడ్డ వైసీపీని వీడారనేది స్పష్టం అవుతుంది. ఆయనకు ఎమ్మెల్సీ లేదా రాజ్యసభ సీటు హామీ ఇచ్చి ఉంటే నియోజకవర్గంలో వైసీపీకి తిరుగుండేది కాదని అంటున్నారు.

 YSR Congress

ప్రస్తుతం 2014 ఎన్నికల్లో పార్టీ తరుఫున పోటీ చేసిన దుట్టా రామచంద్రరావును యార్లగడ్డ వైపు వెళ్లకుండా పార్టీ నాయకులు బుజ్జగిస్తున్నారు. దుట్టాకు పార్టీలో తగిన గౌరవం ఇస్తామని హామీ ఇస్తుంది. ఇక వంశీతో వైసీపీ క్యాడర్ కలిసి పని చేయలేకపోతుంది. తమను కేసులతో ఇబ్బంది పెట్టిన నాయకుడుతో ఎలా పని చేస్తామని పార్టీ అధిష్టానాన్ని క్యాడర్ ప్రశ్నిస్తుంది.ఇటు వల్లభనేని వంశీ కూడా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించడం లేదు.ఇవన్నీ కలగలిసి గన్నవరం రేసులో వైసీపీ వెనుకపడినట్టుగానే కనిపిస్తుంది. మరి గన్నవరం నియోజకవర్గంలో వైసీపీ ఎలా తన పట్టును నిలుపుకుంటుందో చూడాలి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+