గలాటా, కారు ధ్వంసం: జగన్ పార్టీ నేతల అరెస్టు

 YSR Congress leaders arrested in Guntur district
గుంటూరు: గుంటూరు తూర్పు నియోజకవర్గ అభ్యర్థి ప్రకటన వివాదంలో వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు నేత బాలశౌరి నివసించే గోల్డెన్ టవర్స్ వద్ద మంగళవారం అర్ధరాత్రి గలాటా సృష్టించి కారును ధ్వంసం చేసిన కేసులో షేక్ షౌకత్, నసీర్ అహ్మద్ సహా మరో ఐదుగురు అదే పార్టీకి చెందిన నాయకులను పట్టాభిపురం పోలీసులు బుధవారం అరెస్టు చేశారు.

ఎక్సైజ్ కోర్టులో హాజరు పర్చగా నిందితులకు ఈ నెల 26 వరకు జుడీషియల్ మేజ్రిస్టేట్ ఎస్ సరిత రిమాండ్ విధించారు. నిందితులు షౌకత్, నసీర్ అహ్మద్, షేక్ గులాం రసూల్, షేక్ సమీర్, కొండముది సతీష్, షేక్ యాసిన్, కావూరి కమల్ కుమార్‌లను ఉదయం 11 గంటలకు కోర్టులో హాజరు పరిచేందుకు తీసుకొచ్చారు. వందల సంఖ్యలో వైయస్సార్ కాంగ్రెసు కార్యకర్తలు కూడా తరలిరావడంతో కోర్టు వద్ద స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది.

నిందితులు ఏడుగురిని కోర్టులో హాజరు పరిచిన పోలీసులు ఎఫ్ఐఆర్‌తో పాటు ఫర్వీజ్ అనే వ్యక్తి ఫిర్యాదును, అతనితో పాటు గోల్డెన్ టవర్స్‌లో వాచ్‌మెన్‌లు మామిళ్లపల్లి కోటేశ్వరరావు, ఎం సుబ్బారావు అనే వ్యక్తుల సాక్ష్యాన్ని కోర్టులో దాఖలు చేశారు.

కాగా, కోర్టులో ఫర్వీజ్ అనే వ్యక్తి పోలీసులకు షాక్ ఇచ్చాడు. పోలీసులు బలవంతంగా తెల్లకాగితంపై తన సంతకం తీసుకున్నారని, ఫిర్యాదులోని సంగతులు తనకు తెలియవని అఫిడవిట్‌లో ఫర్వీజ్ స్పష్టం చేశాడు. ఘటన జరిగిన సమయంలో తాను పొన్నూరు రోడ్డులోని తన ఇంట్లో ఉన్నట్లు వివరించాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+