'పోలవరంపై ప్లాన్ ప్రకారం చేతులెత్తేస్తున్న సీఎం చంద్రబాబు'

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్యేలు, సీనియర్‌ నేతలతో కూడిన బృందం ఈ నెల ఏడవ తేదీన పోలవరం ప్రాజెక్టును సందర్శించనుంది. అమరావతిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయం నుంచి ఉదయం తొమ్మిది గంటలకు బస్సుల్లో ఈ బృందం ప్రాజెక్టు సందర్శనకు బయలుదేరుతుంది.

మీడియాను ప్రత్యేకంగా తీసుకువెళ్లనున్నట్లు వైసీపీ ఓ ప్రకటనలో తెలిపింది. ఒక పథకం ప్రకారం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రాజెక్టు విషయంలో చేతులెత్తేస్తూ దానికి శాశ్వత సమాధికట్టేలా వ్యవహరిస్తోందని, ఈ దుర్మార్గ వైఖరిని ప్రజలకు వివరించాలని, పోలవరం నిర్మాణాన్ని ముందుకు తీసుకువెళ్లేలా ఒత్తిడి పెంచాలని నిర్ణయించినట్లు పేర్కొంది.

 YSR Congress Party bus yatra to Polavaram on December 7

కాంట్రాక్టర్ల నుంచి కమీషన్లు పిండుకుని ప్రాజెక్టును ఇప్పుడు వదిలేసేందుకు పన్నాగం పన్నారని వైసీపీ ఆరోపించింది. ప్రాజెక్టును రక్షించుకునేందుకు, సత్వరం నిర్మించేలా అన్ని రకాలుగా ఒత్తిడి తీసుకువచ్చేలా వైసీపీ కార్యాచరణ రూపొందించుకుందని, ఇందులో భాగంగానే ప్రాజెక్టు సందర్శన అని తెలిపింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The State government is going to have a tough time ahead on the Polavaram project with the YSR Congress (YSRC) deciding to send its MPs, MLCs and MLAs on a ‘bus yatra’ to the dam site on December 7.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి