పదవి: జగన్ పార్టీలో అసంతృప్తి, ముఖ్యనేతల్లో..!
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేపట్టిన పదవుల పంపిణీ ఆంధ్రప్రదేశ్‌లోని ఆ పార్టీ బీసీ నేతల్లో అసంతృప్తిని రాజేసినట్లుగా తెలుస్తోంది. పార్టీ కోసం పని చేయని వారిని అందలమెక్కించారని, సామాజిక సమతుల్యం పాటించలేదని ఆ పార్టీ వారే విమర్శలు గుప్పిస్తున్నారు. ఒకే సామాజిక వర్గానికి పెద్దపీట వేశారని విమర్శిస్తున్నారు.
అనంతపురం జిల్లాలో బుధవారం బీసీ, మైనార్టీ నేతలు సమావేశమయ్యారు. ఇదే పద్దతి కొనసాగితే తాము మూకుమ్మడిగా పార్టీని వీడేందుకు సిద్ధమనే సంకేతాలు ఇచ్చారు. భవిష్యత్తు కార్యాచరణ పైన చర్చించారు.

అనంతపురం జిల్లాలోని రెండు లోకసభ స్థానాలను బీసీలకు ఇస్తామని ప్రకటించిన జగన్... వాటిని ఒకే సామాజిక వర్గానికి ఇచ్చారన్నారు. పార్టీ కమిటీలలోనే కాకుండా అనుబంధ విభాగాల్లోను బీసీలకు సముచిత స్థానం కల్పించలేదని విమర్శిస్తున్నారంటున్నారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో పలువురు ముఖ్యనేతల్లో అసంతృప్తి ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. అనంతపురం జిల్లాలో గుర్నాథ్ రెడ్డి వర్గం, ప్రకాశం జిల్లాలో బాలినేని శ్రీనివాస్ రెడ్డి వర్గం, విశాఖ జిల్లాలో కొణతాల రామకృష్ణ వర్గం అసంతృప్తితో ఉన్నట్లుగా వినికిడి.












Click it and Unblock the Notifications