జగన్ పార్టీ నేత, భార్య అరెస్టు, రూ. 60 లక్షలు సీజ్

ఈ నెల 11వ తేదీన జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో టెక్కలి ఒకటవ ప్రాదేశిక పోలింగ్ కేంద్రం సమీపంలో పోలీసులతో బాహాబాహీకి దిగినట్లు శ్రీనివాస్‌పై ఆరోపణలు వచ్చాయి. పోలీసులు ఆయన భార్య దువ్వాడ వాణిని కూడా అరెస్టు చేశారు. ఆ దంపతులను పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు.
ఈ నెల 12వ తేదీన టెక్కలి ఎస్ఐ శంకర్రావు దువ్వాడ శ్రీనివాస్‌పై ఫిర్యాదు చేశారు. వివిధ సెక్షన్ల కింద దువ్వాడ దంపతులపై సిఐ శ్రీనివాస రావు కేసులు నమోదు చేశారు.
సార్వత్రిక ఎన్నికల సందర్భంగా రాష్ట్రవ్యాప్తంలో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. తాజాగా హైదరాబాద్ నగరంలోని నారాయణగూడలో మంగళవారం ఉదయం పోలీసులు తనిఖీలు నిర్వహించగా ఓ కారులో తరలిస్తున్న రూ.60 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ నగదు హవాలా సొమ్ముగా పోలీసులు అనుమానిస్తున్నారు.












Click it and Unblock the Notifications