వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చెప్పింది చేస్తున్నాం: వారి అకౌంట్లలోకి నేరుగా రూ.10 వేలు: రూ.119.87 కోట్లు: వైఎస్ జగన్

|
Google Oneindia TeluguNews

అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం వరుసగా మూడోసారి వైఎస్ఆర్ మత్స్యకార భరోసా పథకాన్ని అమలు చేసింది. ఈ పథకం కింద లబ్దిదారుల అకౌంట్లలోకి నేరుగా 10 వేల రూపాయల మొత్తాన్ని జమ చేసింది. రాష్ట్రంలో 1,19,875 మత్స్యకార కుటుంబాలు ఈ పథకం కింద లబ్ది పొందాయి. వారి బ్యాంక్‌ అకౌంట్లలోకి 119.87 కోట్ల రూపాయలు జమ అయ్యాయి. ఈ ఉదయం తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ఈ మొత్తాన్ని లబ్దిదారుల అకౌంట్లకు బదలాయించింది.

కరోనా ఇబ్బందులు ఉన్నా..

కరోనా ఇబ్బందులు ఉన్నా..

ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడారు. వేట నిషేధ సమయంలో మత్స్యకార కుటుంబాలకు అండగా ఉంటామంటూ మాట ఇచ్చామని, దాన్ని నిలబెట్టుకున్నామని చెప్పారు. కోవిడ్‌ సమయంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ మత్స్యకార కుటుంబాలకు ఎలాంటి ఇబ్బందులు రాకూడదనే ఉద్దేశంతో ఈ మొత్తాన్ని విడుదల చేశామని అన్నారు. ఒకవైపు కోవిడ్, మరోవైపు ఏప్రిల్‌ 15 నుంచి జూన్‌ 15 వరకు వేట నిషేధ సమయంలో మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లరని, ఈ పరిస్థితుల్లో ఆ కుటుంబాలకు తాము అందించే 10 వేల రూపాయల చొప్పున సాయం ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు.

చెప్పింది చేస్తున్నాం..

చెప్పింది చేస్తున్నాం..


అక్కచెల్లెమ్మలకు, పేదలకు మంచి జరగాలనే ఉద్దేశంతో తాము అధికారంలోకి వచ్చిన ఈ 23 నెలల కాలంలో ప్రతి పథకాన్నీ అమలు చేస్తున్నామని అన్నారు. ప్రతి పథకాన్నీ గ్రామస్థాయి వరకు ఎక్కడా వివక్షత, అవినీతికి ఆస్కారం లేకుండా అర్హులైన ప్రతి పేదవాడికి చేరేలా చేస్తున్నామని వైఎస్ జగన్ అన్నారు. ఇదివరకు అధికారంలో ఉన్న ప్రభుత్వం- మత్స్యకార కుటుంబాలకు వేట నిషేధ సమయంలో ఇస్తామన్న భృతిని అమలు చేసేది కాదని అన్నారు. నాలుగు వేల రూపాయల మొత్తాన్ని కూడా అరకొరగా ఇచ్చేవారని, ఎప్పుడిస్తారో కూడా తెలిసేది కాదని వ్యాఖ్యానించారు.

మృతుల కుటుంబాలకు పరిహారం..

మృతుల కుటుంబాలకు పరిహారం..

సముద్రంలో వేటకు వెళ్లిన సమయంలో మత్స్యకారుడు ప్రమాదవశాత్తు చనిపోతే వెంటనే వారిని గుర్తించి పరిహారం అందిస్తున్నామని జగన్ వివరించారు. ఇప్పటికే వేటకు వెళ్లి చనిపోయిన దాదాపుగా 67 మంది మత్స్యకార కుటుంబాలకు అక్షరాల 10 లక్షల రూపాయల చొప్పున పరిహారాన్ని ఇచ్చామని, దీనికోసం 6.7 కోట్ల రూపాయలను విడుదల చేశామని అన్నారు. ఆక్వా సాగుతో జీవనోపాధి పొందుతున్న రైతులకు కూడా తోడుగా ఉన్నామని, దాదాపు 53,550 మంది ఆక్వా రైతులకు విద్యుత్‌ యూనిట్‌ రేట్‌ రూ.1.5కు తగ్గించామని అన్నారు.

 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం..

ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం..

మత్స్యకారులు వలస వెళ్ల కూడదనే కారణంతో రాష్ట్రంలో ఎనిమిది ఫిషింగ్‌ హార్బర్ల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామని వైఎస్ జగన్ అన్నారు. ఇప్పటికే నాలుగు హార్బర్లకు సంబంధించి 1,510 కోట్ల రూపాయల వ్యయంతో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మాణాలను చేపట్టాలని చెప్పారు. నెల్లూరు జిల్లా జువ్వెలదిన్న, తూర్పుగోదావరి జిల్లాలోని ఉప్పాడ, గుంటూరు జిల్లాలో నిజాంపట్నం, కృష్ణా జిల్లా మచిలీపట్నంలో హార్బర్ల నిర్మాణ పనులకు రంగం సిద్ధం చేశామని, పనులు కూడా సాగుతున్నాయని తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలో బూడబుట్లపాలెం, విశాఖపట్నం పూడిమడక, పశ్చిమగోదావరిలోని బియ్యపుతిప్ప, ప్రకాశం జిల్లాలోని కొత్తపట్నంలో మరో 1365 కోట్ రూపాయలతో త్వరలో మిగిలిన నాలుగు ఫిషింగ్‌ హార్బర్లకు టెండర్లను పిలుస్తామని తెలిపారు.

English summary
Under YSR Matsyakara Bharosa Scheme for the third consecutive year which provides financial assistance to fishing families, Chief Minister YS Jagan Mohan Reddy disbursed the amount of 119.87 at his camp office in Tadepalli and into the beneficiaries' bank accounts.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X