జగన్ పార్టీ నేత హత్య: రాజకీయ శత్రుత్వమే కారణం?
విశాఖపట్నం: వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ స్థానిక నాయకుడు విశాఖపట్నం జిల్లాలో దారుణ హత్యకు గురయ్యాడు. సరబవరం సర్పంచ్ బిడివి లక్ష్మి భర్త, వైసిపి స్థానిక నాయకుడు బి రాజు (35)ను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు.
విశాఖపట్నం జిల్లాలోని రోలుగుంట పోలీసు స్ఠేషన్ పరిధిలో గల సరబవరం శివారులో ఈ సంఘటన జరిగింది. ఇంటికి తిరిగి వస్తున్న రాజును దుండగులు చంపేశారు. గురువారం రాత్రి 11 గంటల ప్రాంతంలో స్థానికులతో ముచ్చట్లు పెట్టి ఇంటికి తిరిగి వస్తుండగా ఈ సంఘటన జరిగినట్లు తెలుస్తోంది.

పదునైన ఆయుధాలతో హత్య చేసి దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. రాజు రక్తం మడుగులో శవమై తేలాడు. స్థానికుల ఇచ్చి సమాచారం మేరకు రోలుగంట సబ్ ఇన్‌స్పెక్టర్ కె. గోవింద రాజు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు
రాజు హత్యకు రాజకీయ శత్రుత్వమే కారణమని అనుమానిస్తున్నారు. అతని భార్య లక్ష్మి సర్పంచ్‌గా ఎన్నికైనప్పటి నుంచి రాజకీయ ప్రత్యర్థులు అతనిపై కక్ష పెంచుకున్నట్లు చెబుతున్నారు. వ్యాపార లావాదేవీల కోణంలో కూడా పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. కొంత మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications