ప్రత్యేకహోదా: వైసీపీ ఎంపీల ఆమరణ దీక్ష, జగన్ తాజా అస్త్రం
అమరావతి: ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్‌తో వైసీపీ ఎంపీలు ఆమరణ నిరహర దీక్షలు చేపట్టనున్నారు. పార్లమెంట్ సమావేశాల ముగింపు రోజునే ఆ పార్టీకి చెందిన ఎంపీలు ఢిల్లీలోనే ఆమరణ నిరహరదీక్షకు దిగనున్నారు.అంతేకాదు తమ పదవులకు కూడ రాజీనామా చేయనున్నారు.
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్‌తో వైసీపీ పలు రకాల డిమాండ్లతో ఆందోళనలు చేస్తోంది. ఈ ఆందోళనలో భాగంగా వైసీపీ ఈ నిర్ణయం తీసుకొంది. ఇప్పటికే రాజీనామాలు చేస్తామని ఆ పార్టీ ప్రకటించింది. పార్లమెంట్ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడినట్టు ప్రకటన వెలువడిన వెంటనే వైసీపీ ఎంపీలు రాజీనామాలు చేయనున్నారు.
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్‌తో ఆ రాష్ట్రానికి చెందిన అధికార, విపక్ష పార్టీలకు చెందిన ఎంపీలు పార్లమెంట్ వెలుపల, బయట ఆందోళనలు నిర్వహిస్తున్నాయి. అయితే ఇందులో భాగంగానే వైసీపీ నేతలు ఈ నిర్ణయం తీసుకొన్నారు.ఈ మేరకు వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ ఈ విషయాన్ని ప్రకటించారు.

వైసీపీ ఎంపీల ఆమరణ నిరహర దీక్ష
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్‌తో పార్లమెంట్ సమావేశాలు ముగిసిన చివరిరోజునే వైసీపీ ఎంపీలు రాజీనామాలు చేయనున్నారు. అంతేకాదు రాజీనామాలు స్పీకర్ కార్యాలయంలో సమర్పించిన తర్వాత న్యూఢిల్లీలోనే ఆమరణ నిరహరదీక్షకు దిగనున్నారు. పాదయాత్రలో భాగంగా వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ ఈ విషయాన్ని గుంటూరు జిల్లాలో శనివారం రాత్రి పేరిచర్ల వద్ద ప్రకటించారు.

జగన్ వ్యూహం వెనుక కారణమిదే
ప్రత్యేక హోదా డిమాండ్‌తో అవిశ్వాసం, ఎంపీల రాజీనామాలు చేయాలనే విషయాన్ని ఇప్పటికే ఆ పార్టీ ప్రకటించింది. టిడిపి కూడ ఎన్డీఏ నుండి వైదొలిగి కేంద్రంపై అవిశ్వాసాన్ని ప్రతిపాదించింది. మరో వైపు తాజాగా వైసీపీ ఎంపీలు ఢిల్లీలో ఆమరణ నిరహర దీక్ష చేయాలని నిర్ణయించారు.. ఈ తరుణంలో రాజకీయంగా ఈ టిడిపిపై ఒత్తిడి పెంచే అవకాశం లేకపోలేదని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఎంపీల దీక్ష కారణంగా దేశ వ్యాప్తంగా ఈ విషయం మరోసారి చర్చకు దారితీస్తోంది. అదే సమయంలో వైసీపీ చేస్తున్న పోరాటంపై ఏపీ లో కూడ చర్చ సాగే అవకాశం ఉందని ఆ పార్టీ భావిస్తోంది. రాజకీయంగా ఈ నిర్ణయం తమకు కలిసివస్తోందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు.

ప్రతి నియోజకవర్గంలో దీక్షలు
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్‌తో వైసీపీ ఎంపీలు న్యూఢిల్లీలో చేపట్టే దీక్షకు మద్దతుగా రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో దీక్షలు చేపట్టాలని వైసీపీ శ్రేణులను ఆదేశించారు వైఎస్ జగన్. ఈ దీక్షలకు మద్దతివ్వాలని ఆయన ప్రజలను కోరారు. ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తున్నట్టు చంద్రబాబునాయుడు నాటకాలు ఆడుతున్నారని జగన్ విమర్శించారు.

పార్టీల వ్యూహలన్నీ ప్రత్యేక హోదాపై
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్‌తో పలు రాజకీయ పార్టీలు పోరాటం చేస్తున్నాయి. ప్రత్యేక హోదా విషయమై రాజకీయ పార్టీల ఆందోళనలు కేంద్రంలోని బిజెపిపై ఒత్తిడిని తెస్తున్నాయి. అయితే ఈ సమయంలో ఏపీ రాష్ట్రంలో అధికారంలో ఉన్న అధికార టిడిపి, విపక్ష వైసీపీలు వ్యూహలతో ముందుకు వెళ్తున్నారు. ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కారణంగా ఈ రెండు పార్టీల నేతలు వ్యూహ ప్రతి వ్యూహలు మునిగి ఉన్నారు. ఇప్పటికే కేంద్రంపై అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇచ్చారు. జనసేన, వామపక్షాలతో కలిసి పోరాట కార్యక్రమాలను రూపొందించే పనిలో ఉంది. ఏప్రిల్ 4 నుండి విజయవాడలో మకాం వేసి పవన్ కళ్యాణ్ ఈ విషయమై లెఫ్ట్ నేతలతో చర్చించనున్నారు.
-
జగన్ లాంటి అన్న ఉంటే వేరే శత్రువు అవసరం లేదు! -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!!












Click it and Unblock the Notifications