వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్‌కు ఫ్యాన్స్ జోష్, ఢిల్లీలో క్యాండిల్ లైట్స్ (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: పదహారు నెలల జైలు జీవితం అనంతరం చంచల్ గూడ జైలు నుండి బయటకు వచ్చిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలిసేందుకు హైదరాబాదులోని లోటస్ పాండుకు పెద్ద ఎత్తున అభిమానులు, కార్యకర్తలు తరలి వస్తున్నారు. ఆయనను కలిసేందుకు, ఆయనతో కరచాలనం చేసేందుకు ఎగబడుతున్నారు.

గురువారం సిఎల్పీ కార్యాలయంలో మాజీ మంత్రి శంకర రావు, మంత్రి శైలజానాథ్, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డిలు వేర్వేరుగా మాట్లాడారు. రాష్ట్రం సమైక్యంగానే ఉంటుందనే నమ్మకం తమకు ఉందని శైలజానాథ్ చెప్పారు. డిజిపి దినేష్ రెడ్డి కొనసాగింపుకు ఆమోదం తెలపనందుకు శంకర రావు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.

మరోవైపు తెలుగుదేశం పార్టీ తెలంగాణ నేతలు తెలుగుదేశం శాసన సభా పక్ష కార్యాలయంలో భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో వారు భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. త్వరలో ప్రజల్లోకి వెళ్లాలని, కాంగ్రెసు, తెలంగాణ రాష్ట్ర సమితి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీల లాలూచీని ప్రజలకు చెప్పాలని భేటీలో నిర్ణయించారు.

అభిమానుల హంగామా

అభిమానుల హంగామా

హైదరాబాదులోని లోటస్ పాండు వద్ద పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డితో కరచాలనం చేసేందుకు ఎగబడుతున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు.

అభిమానం

అభిమానం

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అంటే అభిమానం గల ఓ కార్యకర్త ఆయనకు శాలువా కప్పారు.

జగన్‌తో మాటా మంతి

జగన్‌తో మాటా మంతి

పదహారు నెలల అనంతరం జైలు నుండి విడుదలైన తమ అభిమాన నాయకుడితో మాట్లాడుతున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్త.

రాజన్న ఆశయం

రాజన్న ఆశయం

రక్తదానం చేయాలని కోరుతూ పోస్టర్ విడుదల చేస్తున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు. అక్టోబర్ 1 నుండి రక్తదానం చేయాలని పేర్కొన్నారు.

మాట్లాడుతున్న శైలజానాథ్

మాట్లాడుతున్న శైలజానాథ్

రాష్ట్రం సమైక్యంగానే ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి శైలజానాథ్, రుద్రరాజు పద్మారాజు.

శంకర రావు

శంకర రావు

డిజిపి దినేష్ రెడ్డి కొనసాగింపును నిరాకరిస్తున్నట్లు ప్రభుత్వం క్యాట్‌కు చెప్పడంతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి శంకర రావు థ్యాంక్స్ చెప్పారు.

టిటిడిపి

టిటిడిపి

తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకులు గురువారం టిడిఎల్పీ కార్యాలయంలో భేటీ అయి తాజా పరిస్థితులు, భవిష్యత్తు కార్యాచరణ పైన చర్చించారు.

ఢిల్లీలో సచివాలయ ఉద్యోగులు

ఢిల్లీలో సచివాలయ ఉద్యోగులు

ఆంధ్ర ప్రదేశ్ సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు ఢిల్లీలోని ఎపి భవన్ వద్ద గురువారం రాత్రి కొవ్వొత్తులతో సమైక్యాంధ్ర కోసం నిరసన తెలిపారు.

కొవ్వొత్తుల నిరసన

కొవ్వొత్తుల నిరసన

ఆంధ్ర ప్రదేశ్ సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు ఢిల్లీలోని ఎపి భవన్ వద్ద గురువారం రాత్రి కొవ్వొత్తులతో సమైక్యాంధ్ర కోసం నిరసన తెలియజేస్తున్న దృశ్యం.

English summary
YSR Congress Party activists and fans of party chief were met YS Jaganmohan Reddy on Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X