వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్పీకర్ కొడుకు, కూతురు అరాచకం: వైసిపి, సభలో నేరగాళ్లు: పత్తిపాటి

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: శాసన సభాపతి కోడెల శివప్రసాద రావు పైన వైసిపి పెట్టిన అవిశ్వాస తీర్మానం పైన మంగళవారం అసెంబ్లీలో చర్చ ప్రారంభమైంది. వైసిపి సభ్యుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చర్చను ప్రారంభించారు. చర్చలో భాగంగా గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి స్పీకర్ పైన తీవ్ర ఆరోపణలు చేశారు. మంత్రులు వాటిని ఖండించారు.

వైసిపి ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. తాను నర్సారావుపేట నుంచి పోటీ చేసి గెలిచానని చెప్పారు. గత ఎన్నికల్లో కోడెల శివప్రసాద రావు నర్సారావుపేట నుంచి సత్తెనపల్లి వెళ్లి పోటీ చేసారన్నారు. మొన్న చంద్రబాబు కోటప్పకొండకు వచ్చారని, కానీ ఎమ్మెల్యేగా తనకు సమాచారం లేదన్నారు.

ఓ శాసన సభ్యుడి హక్కులు కాపాడాల్సిన బాధ్యత స్పీకర్‌ది అన్నారు. వాటిని స్పీకర్ కాపాడలేదన్నారు. ఓ ఎన్నికల సమయంలో బాంబు పేలుడు కేసులో నలుగురు వ్యక్తులు చనిపోయారని.. గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి చెబుతుండగా.. యనమల స్పందించారు.

YSRCP allegations on Speaker son and daughter

యనమల మాట్లాడుతూ... అది 1999లో జరిగిన ఘటన అని అప్పుడు కోడెల స్పీకర్‌గా లేరని చెప్పారు.

దీనిపై గోపిరెడ్డి మాట్లాడుతూ... దీనిపై సిబిఐ విచారణ చేయలేదన్నారు. కేంద్రం ప్రాసిక్యూట్ చేసేందుకు అనుమతివ్వలేదు కాబట్టి చేయలేదని సిబిఐ చెప్పిందన్నారు. సిబిఐ కోడెలకు క్లీన్ చిట్ ఇవ్వలేదన్నారు.

మంత్రి పల్లె మాట్లాడుతూ.. చట్టసభల్లో మాట్లాడేటప్పుడు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలన్నారు. సిబిఐ విచారించిందని, దీనిపై కోర్టులకు కూడా వెళ్లారని, అన్నింటా కోడెల శివప్రసాద్ రావుకు అనుకూలంగా తీర్పు వచ్చిందన్నారు. పేలుడు కేసులో కోడెలకు క్లీన్ చిట్ వచ్చిందన్నారు. కోడెల స్పీకర్‌గా ఉండటం అందరి అదృష్టమన్నారు. ఆయన నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నారన్నారు.

మంత్రి కామినేని శ్రీనివాస్ రావు మాట్లాడుతూ... ఇదే కోడెలను ఎన్నుకున్నప్పుడు మీరు ఏం మాట్లాడారో తెలుసుకోవాలని వైసిపిని ఉద్దేశించి అన్నారు. కోడెలను సభాపతిగా ఎన్నుకున్నప్పుడు వైసిపి పొగిడిందన్నారు. అప్పుడు మీరు ఇప్పుడు చెబుతున్న కేసుల గురించి తెలియదా అన్నారు.

గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ... కోడెల శివప్రసాద రావు పైన కేసులు పాతవని, తమకు ఆయన స్పీకర్‌గా ఎన్నిక చేసే సమయంలో గుర్తుకు లేదా అని ప్రశ్నిస్తున్నారని, వాటిని తాను పక్కన పెడుతున్నానని చెప్పారు. అయితే సభ్యుడిగా తన హక్కులను (కోటప్పకోండ విషయం) కాలరాయడం సరైన చర్యేనా అన్నారు.

YSRCP allegations on Speaker son and daughter

మంత్రి పత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ.. స్పీకర్ పైన ఉద్దేశ్యపూర్వకంగా ఆరోపణలు చేస్తున్నట్లుగా కనిపిస్తోందన్నారు. నన్ను పిలవలేదని గోపిరెడ్డి చెబుతున్నారని, కానీ పిలిచిన వాటికి ఎందుకు రావడం లేదన్నారు. అన్ని శంకుస్థాపన పలకాల పైన మీ పేర్లు పెడుతున్నామని చెప్పారు.

కోడెల శివప్రసాద రావు మీకన్నా ఎక్కువ దృష్టి పెట్టి నర్సారావుపేటను అభివృద్ధి చేస్తున్నారన్నారు. మీ నియోజకవర్గంలో ఎన్ని వందల కోట్ల పనులు చేశారన్నారు. స్పీకర్ రాజకీయాలకు అతీతంగా పని చేస్తున్నారని చెప్పారు. కావాలని స్పీకర్ పైన బురద జల్లుతున్నారన్నారు.

మీరు ఎలాంటి నినాదాలు చేశారని వైసిపి సభ్యులను ఉద్దేశించి ప్రశ్నించారు. స్పీకర్ బ్రోకర్, స్పీకర్ స్థానంలో ఫ్యాక్షనిస్ట్, రౌడీ స్పీకర్, బాంబులు అంటూ వ్యాఖ్యానించడం ఎంత వరకు సమంజసమన్నారు. కోడెల వంటి వారి పైన బురద జల్లే పని చేయవద్దన్నారు. ఇప్పటికైనా మీరు పెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని చెంపలు వేసుకొని వెనక్కి తీసుకోవాలన్నారు.

గోపిరెడ్డి మాట్లాడుతూ... స్పీకర్ కోడెల తనయుడు చేస్తున్న అవినీతి గురించి కూడా మాట్లాడాలన్నారు. ముప్పాళ్ల ఎంపీటీసీలను కిడ్నాప్ చేస్తే విచారణ జరిపించారా అని ప్రశ్నించారు.

ఒక్క వ్యవస్థ పైనా అయినా జగన్‌కు గౌరవం ఉందా: అచ్చెన్నాయుడు

మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ... స్పీకర్ పైన అవిశ్వాసం ఇవ్వాలంటే బలమైన కారణం ఉండాలన్నారు. మీరు అవిశ్వాస తీర్మానంపై దేని పైన పెట్టారో గుర్తుంచుకోవాలన్నారు. చాలా సిల్లీగా అవిశ్వాస తీర్మానం పెట్టారన్నారు.

మా సభ్యురాలు రోజాను ఓ ఏడాది సస్పెండ్ చేశారని, నియోజకవర్గంలో తనను పిలువలేదని అవిశ్వాసం పెట్టడం విడ్డూరమన్నారు. రోజా సస్పెన్షన్‌కు స్పీకర్‌కు ఏం సంబంధమన్నారు.

అధికార పార్టీకి 25 గంటలు, ప్రతిపక్ష నేతకు, సభ్యులకు 20 గంటలు మాట్లాడే అవకాశమిచ్చారని, ఇక స్పీకర్ పక్షపాతం ఎక్కడ చూపారన్నారు. విపక్ష పార్టీకి ఏ వ్యవస్థ పైనా నమ్మకం లేదన్నారు. కనీసం ఒక్క వ్యవస్థ పైన కూడా నమ్మకం లేని వ్యక్తి జగన్ అన్నారు.

గోపిరెడ్డి మాట్లాడుతూ.. స్పీకర్ స్థానంలో ఉండి పార్టీ కార్యకర్తల సమావేశానికి హాజరు కావొచ్చా అని ప్రశ్నించారు. పార్టీ కండువా కప్పవచ్చా అని ప్రశ్నించారు. శంకుస్థాపన సమయంలో శిలా పలకంపై తన కొడుకు పేరు వేసుకోవచ్చా అన్నారు.

మంత్రి పత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ.. స్పీకర్ పైన అవిశ్వాస తీర్మానం పెట్టారా లేక ఇతర విషయాలు మాట్లాడేందుకు అవిశ్వాసం పెట్టారా అని ప్రశ్నించారు. స్పీకర్ కొడుకు, కూతురు గురించి మాట్లాడటం ఏమిటన్నారు. ఎంతో పవిత్రమైనసభా స్థానాన్ని కించపరుస్తున్నారన్నారు.

స్పీకర్ బాధ్యతలు చేపట్టి ఏడాది కాకముందే అవిశ్వాసం పెడతామని చెప్పారని, ఆరు నెలల తర్వాత నోటీసు అన్నారని, ఇప్పుడు అవిశ్వాసం పెట్టారన్నారు. కోడెల శివప్రసాద్ రావు పవిత్రమైన వైద్య వృత్తి నుంచి వచ్చారన్నారు.

గోపిరెడ్డి మాట్లాడుతూ.. నేను కూడా డాక్టర్ వృత్తి నుంచే వచ్చానని చెప్పారు. స్పీకర్ అధికార దుర్వినియోగం వల్ల ఇటీవల తన పైన కేసు పెట్టించారన్నారు. నాన్ బెయిలబుల్ వారెంట్ ఇప్పించారని, చివరకు స్టేషన్ బెయిల్ ఇచ్చి, ఇంటికి పంపించారన్నారు.

సభలో నేరగాళ్లు: పత్తిపాటి

మంత్రి పత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ.. నా పైన మీ ప్రభుత్వం హయాంలో ఎన్నో కేసులు పెట్టారన్నారు. మీ గురించి చెప్పాలంటే ఎన్నో ఉన్నాయన్నారు. స్పీకర్ పైన బురద జల్లేందుకు ఇవన్నీ మాట్లాడటం ఏమిటన్నారు. స్పీకర్ పైన బురద జల్లే ప్రయత్నం మానుకోవాలన్నారు.

అరాచక శక్తులు, నేరగాళ్లు చట్ట సభల్లోకి ప్రవేశించి సభా వాతావరణాన్ని కలుషితం చేస్తున్నారని జగన్‌ను ఉద్దేశించి పరోక్షంగా అన్నారు. స్పీకర్ పైన ఆరోపణలు సరికాదన్నారు. ఇప్పటికైనా అవిశ్వాస తీర్మానం వెనక్కి తీసుకోవాలన్నారు.

స్పీకర్ కూతురు, కొడుకు అరాచకం

గోపిరెడ్డి మాట్లాడుతూ.. స్పీకర్ కొడుకు, కూతురు చేస్తున్న అరాచకత్వం పైన విచారణ జరిపించాలన్నారు. స్పీకర్ అధికార దుర్వినియోగం వల్లనే తన పైన కేసు అన్నారు.

మాకు ట్రెయినింగ్ ఇప్పించారు

టిడిపి ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ... అవిశ్వాస తీర్మానాన్ని జోక్‌గా తీసుకుంటున్నట్లుగా ఉందన్నారు. వెంకయ్య నాయుడు, చంద్రబాబు నాయుడు, లోకసభ సెక్రటరీ జనరల్ వంటి వారిని తీసుకు వచ్చి కొత్త సభ్యులకు మాట్లాడటంలో ట్రెయినింగ్ ఇప్పించిన వారు స్పీకర్ కోడెల అన్నారు.

English summary
YSRCP hot allegations on Speaker son and daughter.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X