మళ్లీ బెంగళూరుకు జగన్ ! వైసీపీ-టీడీపీ ట్వీట్ వార్..ఎవరేమన్నారంటే..!
ఏపీలో వైసీపీ అధికారం కోల్పోయాక అప్పటివరకూ సీఎం క్యాంపు ఆఫీసు అయిన తాడేపల్లి నివాసాన్ని వదిలి అయితే కడప లేదంటే బెంగళూరు వెళ్లేందుకు మాజీ సీఎం జగన్ ఆసక్తి చూపుతున్నారు. మధ్యమధ్యలో తాడేపల్లికి వచ్చి వైసీపీ నేతలను కలిసి వెళ్తున్నారు. ఇదే క్రమంలో గత 15 రోజుల్లో మరోసారి బెంగళూరు పర్యటనకు వెళ్లేందుకు జగన్ సిద్దమయ్యారు. ఈ నేపథ్యంలో జగన్ ను టార్గెట్ చేస్తూ టీడీపీ మొదలుపెట్టిన ట్వీట్ వార్ కు వైసీపీ చంద్రబాబు టార్గెట్ గా కౌంటర్లు ఇస్తోంది.
"అసెంబ్లీ ఎగ్గొట్టటానికి కాలు బెణికింది అంటూ డ్రామా ఆడి, బెంగళూరు ప్యాలెస్‌కి, స్పెషల్ ఫ్లైట్ లో పారిపోయిన జగన్. మొదటి అసెంబ్లీ సమావేశంలో గత ప్రభుత్వ ఘనకార్యాలపై చర్చ ఉంటుందని తెలిసి, మొఖం చూపించలేక పరార్" అంటూ టీడీపీ ఇవాళ ఎక్స్ లో పోస్ట్ చేసింది. అలాగే "కొత్త ప్రభుత్వంలో ఎలాంటి ప్రధానమైన సమస్యలు లేకపోవటంతో, ఇక్కడ ఉండి చేసేది ఏమి లేదంటూ, విలాసవంతమైన బెంగళూరు యలహంకా ప్యాలెస్ లో రైనీ సీజన్ ఎంజాయ్ చేయటానికి వెళ్ళిపోయిన జగన్ రెడ్డి" అంటూ సెటైర్లు వేసింది.

అసెంబ్లీ ఎగ్గొట్టటానికి కాలు బెణికింది అంటూ డ్రామా ఆడి, బెంగళూరు ప్యాలెస్‌కి, స్పెషల్ ఫ్లైట్ లో పారిపోయిన జగన్. మొదటి అసెంబ్లీ సమావేశంలో గత ప్రభుత్వ ఘనకార్యాలపై చర్చ ఉంటుందని తెలిసి, మొఖం చూపించలేక పరార్.
— Telugu Desam Party (@JaiTDP) July 15, 2024
కొత్త ప్రభుత్వంలో ఎలాంటి ప్రధానమైన సమస్యలు లేకపోవటంతో, ఇక్కడ ఉండి చేసేది… pic.twitter.com/vLZWY9Wejz
దీన్ని ట్యాగ్ చేస్తూ వైసీపీ ఘాటుగా జవాబిచ్చింది. "2019-24లో ఎన్ని సార్లు ఏపీకి చంద్రబాబు వచ్చాడు
@JaiTDP ?.. రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నప్పుడు మినహా.. ఐదేళ్లలో ఒక్కసారైనా కుదురుగా 50 రోజులు ఏపీలో ఉన్నాడా? కోవిడ్ టైమ్‌లో హైదరాబాద్‌లోనే కదా మీ చంద్రబాబు కాలయాపన చేశాడు?" అని ప్రశ్నించింది.
2019-24లో ఎన్ని సార్లు ఏపీకి చంద్రబాబు వచ్చాడు @JaiTDP?
— YSR Congress Party (@YSRCParty) July 15, 2024
రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నప్పుడు మినహా.. ఐదేళ్లలో ఒక్కసారైనా కుదురుగా 50 రోజులు ఏపీలో ఉన్నాడా?
కోవిడ్ టైమ్‌లో హైదరాబాద్‌లోనే కదా మీ చంద్రబాబు కాలయాపన చేశాడు?
మీ కూటమి ప్రభుత్వం చేతగాని పాలనతో రాష్ట్రం రావణకాష్టంగా… https://t.co/XKqSfNrFEo
"మీ కూటమి ప్రభుత్వం చేతగాని పాలనతో రాష్ట్రం రావణకాష్టంగా మారింది. దాంతో ఆడబిడ్డలకి రక్షణ కరువైంది. ఎక్కడ చూసినా.. అత్యాచారాలు, అఘాయిత్యాలు, దౌర్జన్యాలతో టీడీపీ గూండాలు రాజ్యమేలుతున్నారు. ముందు లా ఆండ్ ఆర్డర్‌పై దృష్టిపెట్టండి. తప్పుడు హామీలతో అధికారంలోకి వచ్చిన మీరు.. వాటి అమలుని గాలికొదిలేసి ప్రజలకి ఎలా కుచ్చుటోపీ పెట్టాలని ప్రయత్నిస్తూ తప్పించుకుని తిరుగుతున్నారే సిగ్గులేదా?" అని వైసీపీ నిలదీసింది.












Click it and Unblock the Notifications