సీఎం జగన్ వర్సస్ బాలయ్య పోటీ తప్పదా - ఏం జరుగుతోంది..!?

ఏపీ రాజకీయాల్లో కొత్త ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. వైసీపీ అధికారంలో రాకుండే చేయటమే తన లక్ష్యమని పవన్ కల్యాణ్ ప్రకటించారు. 2014 నాటి తరహా పొత్తుల కోసం ప్రయత్నిస్తున్నారు. టీడీపీ జనసేన పొత్తు ఖాయంగా కనిపిస్తోంది. బీజేపీ వ్యవహారం తేలాల్సి ఉంది. సింగిల్ గానే పోటీ చేస్తామని వైసీపీ ప్రకటించింది. వచ్చే ఎన్నికల్లోనూ సీఎం జగన్ తన కంచుకోట పులివెందుల నుంచే పోటీ చేయటం ఖాయంగా కనిపిస్తోంది. కానీ, కొత్త ట్విస్ట్ తెర మీదకు వచ్చింది.

వచ్చే ఎన్నికల్లో వైసీపీ, టీడీపీ హోరా హోరీ పోరు తప్పేలా లేదు. ప్రతీ సీటు కీలకంగా మారనుంది. కుప్పంలో చంద్రబాబును ఓడిస్తాం..వై నాట్ 175 అంటూ సీఎం జగన్ నినదిస్తున్నారు. పులివెందులలో జగన్ ను ఓడిస్తామంటూ టీడీపీ సవాల్ చేస్తోంది. లోకేశ్ మంగళగిరి నుంచి మరోసారి పోటీ ఖాయంగా కనిపిస్తోంది. జనసేనాని పవన్ ఎక్కడా నుంచి పోటీ చేస్తారనేది స్పష్టత లేదు. ఇక, సినీ హీరో...టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ మరోసారి హిందూపురం నుంచి పోటీకి రంగం సిద్దం చేసుకుంటున్నారు. అక్కడ వైసీపీ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త ఇంఛార్జ్ గా దీపికను నియమించారు. వచ్చే ఎన్నికల్లో సామాజిక సమీకరణాల్లో భాగంగా దీపికకు బాధ్యతలు కేటాయించారు.

jaganvsbalakrishna

ఇప్పుడు హిందూపురంలో వైసీపీ కేడర్ నుంచి కొత్త డిమాండ్ మొదలైంది. సీఎం జగన్ హిందూపురం నుండి పోటీ చేయాలని వైసీపీ నాయకుడు నరేష్ ఆధ్వర్యంలో ఫకార్డులతో ర్యాలీ నిర్వహించారు. వైఎస్సార్ విగ్రహానికి పూలమాలవేసి మహిళల తో పట్టణం లో భారీ ర్యాలీ చేసారు. బాలకృష్ణ సినీ గ్లామర్ తో వరుస విజయాలు సాధిస్తున్నారని వైసీపీ నేతలు చెబుతున్నారు. బాలకృష్ణకు చెక్ పెట్టాలంటే వైయస్ కుటుంబం నుండి హిందూపురంలో పోటీ చేయాలని కోరుతూ కొత్త చర్చకు కారణమయ్యారు. రేపటినుండి ఇదే నినాదంతో హిందూపురంలో పోస్ట్ కార్డుల ఉద్యమాన్ని ప్రారంభిస్తామని ప్రకటించారు. జగన్ పోటీ చేస్తే గెలుపు ఖాయమని చెబుతున్నారు. ఈ డిమాండ్ వైసీపీ సర్కిల్స్ లో వైరల్ అవుతోంది.

పులివెందుల వైఎస్ కుటుంబానికి కంచుకోట. అక్కడ నుంచే వైఎస్సార్... విజయమ్మ...జగన్ గెలుస్తూ వచ్చారు. 2014,2019 ఎన్నికల్లో జగన్ ఇక్కడ నుంచే ఎమ్మెల్యేగా గెలుపొందారు. మరోసారి అక్కడ నుంచే పోటీకి సిద్దం అవుతున్నారు. ఈ క్రమంలో తాజాగా హిందూపురం కేడర డిమాండ్ పైన ఆసక్తి కర చర్చ సాగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+