వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏప్రిల్ 28న, తేలనున్న జగన్ భవితవ్యం, న్యూజిలాండ్ కు అనుమతివచ్చేనా?

వైసీపీ అధినేత వైఎస్ జగన్ బెయిల్ ను రద్దు చేయాలన్న సీబీఐ పిటిషన్ పై ఏప్రిల్ 28న , తుది తీర్పు వెలువడనుంది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

అమరావతి: వైసీపీ అధినేత వైఎస్ జగన్ బెయిల్ ను రద్దు చేయాలన్న సీబీఐ పిటిషన్ పై ఏప్రిల్ 28న , తుది తీర్పు వెలువడనుంది.

మరో వైపు కుటుంబసభ్యులతో కలిసి న్యూజిలాండ్ కు వెళ్ళేందుకు అనుమతివ్వాలన్న జగన్ పిటిషన్ పై కూడ న్యాయస్థానం అదే రోజున నిర్ణయాన్ని వెలువర్చనుంది.

జగన్ 'బెయిల్': ల్యాప్‌టాప్‌లో జడ్జికి రమాకాంత్ ఇంటర్వ్యూ చూపిన సిబిఐజగన్ 'బెయిల్': ల్యాప్‌టాప్‌లో జడ్జికి రమాకాంత్ ఇంటర్వ్యూ చూపిన సిబిఐ

సాక్షులను ప్రభావితం చేసేలా వైఎస్ జగన్ వ్యవహరిస్తున్నారని సిబిఐ ఆరోపిస్తోంది.ఈ మేరకు జగన్ బెయిల్ ను రద్దు చేయాలంటూ కోర్టును ఆశ్రయించింది. ఈ కేసు విషయమై కోర్టులో వాదోపవాదాలు సాగాయి.

సాక్షి మీడియాలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన రమాకాంత్ రెడ్డితో ఇంటర్వ్యూ సాక్షులను ప్రభావితం చేసేలా ఉందని సిబిఐ అభిప్రాయపడింది.

ఏప్రిల్ 28న,, తేలనున్న జగన్ భవితవ్యం

ఏప్రిల్ 28న,, తేలనున్న జగన్ భవితవ్యం

వైసీపి అధినేత జగన్ భవితవ్యం ఈ నెల 28వ, తేదిన తేలనుంది.సాక్షులను ప్రభావితం చేయరాదనే షరతును జగన్ ఉల్లంఘించారని సిబిఐ ఆరోపిస్తోంది.

ఈ మేరకు ఆయన బెయిల్ ను రద్దు చేయాలని కోరుతూ సిబిఐ దాఖలు చేసిన పిటిషన్ పై శుక్రవారం నాడు కోర్టులో వాదనలు జరిగాయి.సిబిఐ తరపున ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ సురేందర్, జగన్ తరపున సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి తన వాదనలను విన్పించారు.ఇరువైపులా వాదనలను విన్న కోర్టు ఈ నెల 28వ, తేదికి కేసును వాయిదా వేసింది.

కోర్టుకు ఇంటర్వ్యూను చూపిన న్యాయవాది

కోర్టుకు ఇంటర్వ్యూను చూపిన న్యాయవాది

సాక్షి మీడియాలో ప్రసారమైన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రమాకాంత్ రె్డ్డి ఇంటర్వ్యూ ను కోర్టును చూపారు. ఈ మేరకు సాక్షి మీడియాలో ప్రసారమైన ఇంటర్వ్యూను ప్రత్యేకంగా కోర్టుకు వాదనల సమయంలో సిబిఐ తరపు న్యాయవాది చూపించారు. ఈ ఇంటర్వ్యూలో ఏ రకంగా సాక్షులను ప్రభావితం చేయగలిగారో కోర్టులో తమ వాదనను సమర్థంగా విన్పించేందుకు వీలుగా ఈ వీడియోను సిబీఐ తరపు న్యాయవాది చూపారు.

న్యూజిలాండ్ కు జగన్ కు అనుమతి వచ్చేనా?

న్యూజిలాండ్ కు జగన్ కు అనుమతి వచ్చేనా?

ఈ ఏడాది మే 15వ, తేది నుండి జూన్ 15వ, తేది మద్య కాలంలో సుమారు 15 రోజులపాటు న్యూజిలాండ్ కు వెళ్ళాలని జగన్ భావిస్తున్నారు. ఈ మేరకు కుటుంబసభ్యులతో కలిసి ఆయన న్యూజిలాండ్ టూర్ ను ప్లాన్ చేసుకొన్నారు.

అయితే సిబిఐ కేసులు ఎదుర్కొంటున్నందున అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్ళరాదని కోర్టు ఆదేశించింది. దరిమిలా న్యూజిలాండ్ వెళ్ళేందుకు అనుమతివ్వాలని జగన్ కోర్టును కోరారు.అయితే న్యూజిలాండ్ పర్యటనకు అనుమతి విషయమై అదే రోజునే కోర్టు తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది.

 బెయిల్ రద్దు చేస్తే పార్టీకి కష్టాలు తప్పవా?

బెయిల్ రద్దు చేస్తే పార్టీకి కష్టాలు తప్పవా?

రెండు వర్గాల వాదనలు విన్న తర్వాత ఈ కేసుపై ఈ నెల 28న కోర్టు తీర్పు ఇవ్వనుంది.అయితే జగన్ కు ఒకవేళ కోర్టు బెయిల్ ను రద్దు చేస్తే పార్టీకి కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలు లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో టిడిపి వైసీపి ఎమ్మెల్యేలను తమ పార్టీలోకి చేర్చుకొంటుంది.ఈ తరుణంలో జగన్ బెయిల్ రద్దు చేస్తే పార్టీపై ప్రభావం కన్పించే అవకాశాలు లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

టిడిపి వ్యూహమిదే

టిడిపి వ్యూహమిదే


పార్టీ ఫిరాయింపుల విషయాన్ని జగన్ ప్రధానంగా ప్రస్తావిస్తుంటే , జగన్ పై ఉన్న కేసుల అంశాన్ని టిడిపి ప్రధానంగా ప్రస్తావించాలని భావిస్తోంది.జగన్ పై ఉన్న కేసుల విషయాన్ని ఆ పార్టీ ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్ళాలని తలపెట్టింది.సిబిఐ కేసు విషయమై మరోసారి తెరమీదికి రావడంతో టిడిపి ఈ వ్యూహాన్ని అమలు చేయడం ద్వారా రాజకీయంగా వైసీపిని మరింత దెబ్బకొట్టాలనే ఆలోచన చేస్తోంది.

English summary
Ysrcp chief Jagan's Bail to Be Decided on April 28th.On Friday CBI and Jagan advocates expressed their opinions, court reserved decission till April 28.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X