ఏడాదిలో వైసీపీ ప్రభుత్వం, ఆ ఎంపీకి బాబు కాంట్రాక్టులు:జగన్

Posted By:
Subscribe to Oneindia Telugu

శ్రీకాకుళం: రైతులపై ఏ మాత్రం చంద్రబాబునాయుడుకు ప్రేమ ఉంటే ఒక్క ఏడాదిలోనే వంశధార ప్రాజెక్టును పూర్తిచేసి ఉండేవారని వైఎస్ఆర్ సీపీ అధినేత జగన్ అన్నారు.అయితే రైతులపై చంద్రబాబుకు ప్రేమ లేదని తేటతెల్లమైందన్నారు. రైతులకు వెయ్యికోట్లిస్తే చంద్రబాబుకు కమీషన్ రాదన్నారు. అయితే కాంట్రాక్టర్లకు ఇస్తే మాత్రం 30 శాతం కమీషన్ వస్తోందని జగన్ ఆరోపించారు.

శ్రీకాకుళం జిల్లా హీర మండలంలోని ఆయన వంశధార ప్రాజెక్టు నిర్వాసితులతో జగన్ ముఖాముఖి నిర్వహించారు.ధర్నాలు చేసి గొడవ చేయకుండా యువకులను ఆకట్టుకొనేందుకు యూత్ ప్యాకేజీ పేరుతో మోసం చేస్తున్నారని ఆయన విమర్శించారు. వంశధార ప్రాజెక్టు రెండో దశ పూర్తి చేస్తే ఈ ప్రాంతంలోని రైతులకు ప్రయోజనం జరిగేదన్నారు వైఎస్ జగన్.

పదిశాతం పనులు పూర్తిచేస్తే ప్రాజెక్టు పనులు పూర్తయ్యేవన్నారు జగన్ .అంతేకాదు చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించేనాటికే ఈ ప్రాజెక్టుకు 53 కోట్లు ఖర్చు చేస్తే పనులు పూర్తయ్యేవన్నారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలోనే ఈ ప్రాజెక్టు పనులు దాదాపుగా పూర్తయ్యాయని చెప్పారు వైఎస్ జగన్. వంశధార ప్రాజెక్టులో 700 కోట్లకు పైగా పనులు పూర్తయ్యాయని ఆయన గుర్తు చేశారు.

ఏడాదిన్నరలో వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం

ఏడాదిన్నరలో వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం

ఏడాదిన్నరలో వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం వస్తోందని జగన్ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఎల్లకాలం చంద్రబాబునాయుడు పాలన ఉండదన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతులకు 2013 భూసేకరణ చట్టాన్ని ఖచ్చితంగా అమలు చేస్తామని జగన్ భరోసాను ఇచ్చారు.ప్రతి ఇంటికి న్యాయం చేస్తామన్నారాయన. ఇదే జిల్లాలో ఎకరానికి 18 లక్షలు ఇస్తున్నారని ఆయన గుర్తు చేశారు.అయితే ఈ ప్రాజెక్టు కింద ఎందుకు ఆ పరిహారాన్ని ఇవ్వడం లేదని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

పదిశాతం పనులు పూర్తి చేస్తే ప్రాజెక్టు పూర్తయ్యేది

పదిశాతం పనులు పూర్తి చేస్తే ప్రాజెక్టు పూర్తయ్యేది

వంశధార రెండోదశ ప్రాజెక్టుకు చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించకముందే 700 కోట్లకుపైగా పనులు పూర్తయ్యాయని జగన్ చెప్పారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించడానికి ముందే 190 కోట్లను ఖర్చు చేశారని ఆయన చెప్పారు. అయితే కేవలం 53 కోట్లను ఖర్చు చేస్తే ప్రాజెక్టు పూర్తయ్యేదని జగన్ అభిప్రాయపడ్డారు. కాని, వంశధార రెండోదశ ప్రాజెక్టుకు నిర్మాణానికి సంబంధించి రైతులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీని ఇస్తే ప్రాజెక్టు నిర్మాణానికి అడ్డంకులు తొలగిపోయేవని జగన్ అభిప్రాయపడ్డారు.రైతులపై ప్రేమ ఉంటే ప్రాజెక్టును పూర్తిచేసేవారని చెప్పారు.

రైతులకు అండగా ఉంటాను

రైతులకు అండగా ఉంటాను

తమకు పరిహారం పెంచాలని రైతులు కోరుతున్న డిమాండ్ లో తప్పేమీలేదని జగన్ అభిప్రాయపడ్డారు. రైతులకు తాను అండగా ఉంటానని జగన్ భరోసా ఇచ్చారు. చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యేనాటికి రాష్ట్రంలో 97 వేల కోట్ల అప్పులున్నాయి. ఈ మూడేళ్ళలో రాష్ట్రంలో భారం రూ.2.16 కోట్లకు తీసుకెళ్ళారు.తోటపల్లి, వంశధార ప్రాజెక్టు పనులు ఎవరైనా చేశారంటే వైఎస్ మాత్రమేనని ఆయన గుర్తు చేశారు. బడ్జెట్ లో లక్షన్నర కోట్ల అప్పులున్నాయి. అప్పులు 1.18 లక్షల కోట్లు, శ్రీకాకుళం జిల్లాకు వెయ్యి కోట్లు ఇచ్చి ఉంటే ఈ ప్రాజెక్టు పూర్తయ్యేదని జగన్ అభిప్రాయపడ్డారు. అయితే ఈ పనులు మాత్రం చేయడం బాబుకు ఇష్టం లేదన్నారు.తమ న్యాయమైన డిమాండ్ల కోసం రైతులు చేస్తున్న పోరాటానికి తాము అండగా ఉంటామని జగన్ ప్రకటించారు.

కాంట్రాక్టర్లతో బాబు లాలూచీపడ్డారు

కాంట్రాక్టర్లతో బాబు లాలూచీపడ్డారు

ఈపీసీ ప్రాజెక్టు కింద కాంట్రాక్టు ఇచ్చారని చెప్పారు. 54 కోట్ల పనులను 400 కోట్లకు పెంచేశారని జగన్ ఆరోపించారు. టిడిపికి చెందిన ఎంపి సిఎం రమేష్ కూడ బినామీగా కాంట్రాక్టులు చేస్తున్నారని జగన్ విమర్శించారు. పెట్రోల్, డీజీల్ , సిమెంట్, స్టీల్ ధరలు పెరిగాయని ప్రజల చెవుల్లో పూలు పెడుతున్నారని ఆయన జగన్ చంద్రబాబు తీరును దుయ్యబట్టారు. కాంట్రాక్ట్ ఇచ్చే సమయానికి ఇప్పటికీ చూస్తే పెట్రోల్, డీజీల్, స్టీల్, సిమెంట్ ధరలు తగ్గాయని, ఇసుకను ఉచితంగానే ఇస్తున్నా రేట్లు ఎందుకు పెంచారని జగన్ ప్రశ్నించారు.రైతుల ప్యాకేజీని ఎందుకు పెంచలేదని ఆయన ప్రశ్నించారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Ysrcp chief Ys Jagan slams on Andhrapradesh chiefminister Chandrababu naidu on Friday in Srikakulam district. he meeting with the farmers in Heera mandal.
Please Wait while comments are loading...