వరుస ఏకగ్రీవాల వేళ పులివెందుల కేంద్రంగా జగన్ అనూహ్య నిర్ణయం..!!
మాజీ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. స్థానిక ఎన్నికల వేళ అనూహ్య రాజకీయం చోటు చేసుకుంది. ఈ ఎన్నికల్లో జగన్ ఏకగ్రీవాలకు అవకాశం ఇవ్వద్దని పార్టీ నేతలను ఆదేశించారు. దీనికి కౌంటర్ గా టీడీపీ కడప జిల్లాలో మెజార్టీ స్థానాలు ఏకగ్రీవంగా దక్కించుకుంది. పోలింగ్ కు సమయం సమీపిస్తున్న వేళ రాజకీయం మరింత ఉత్కంఠ పెంచుతోంది. ఈ సమయంలోనే మాజీ సీఎం జగన్ పులివెందుల కేంద్రంగా తీసుకున్న నిర్ణయం మరింత ఆసక్తిగా మారుతోంది.
స్థానిక ఎన్నికల వేళ కొత్త రాజకీయం తెర మీదకు వస్తోంది. ప్రధానంగా కడప జిల్లా కేంద్రంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. నామినేషన్ల ప్రారంభం రోజు నుంచి పుంగనూరుతో పాటు గా కడప జిల్లాలోనూ వరుస ఘటనలు చోటు చేసుకున్నాయి. తమను నామినేషన్ల వేయనీయటం లేదని వైసీపీ సుప్రీం వరకు వెళ్లింది. కోర్టు ఆదేశాలతో కొన్ని ప్రాంతాల్లో మాత్రం నామినేషన్ల కు మరింత సమయం ఇచ్చారు. కాగా.. సమయం దక్కని మున్సిపాల్టీల్లో టీడీపీ ఏకగ్రీవంగా విజయం సాధించినట్లు రిటర్నింగ్ అధికారులు ప్రకటించారు. అందులో ఎక్కువగా కడప జిల్లాలో ఉన్నాయి. జిల్లాలో 8 పురపాలక సంఘాలకు ఎన్నికలు జరుగుతుండగా, అందులో 6 చోట్ల ఛైర్‌పర్సన్ పదవులను కూటమి ఏకగ్రీవంగా దక్కించుకుంది.

పులివెందులలో జగన్ మకాం
కాగా.. కడప కార్పొరేషన్‌లో 66 డివిజన్లకు గాను 50 స్థానాలను, పులివెందుల మున్సిపాలిటీలో 40 వార్డులకు గాను 20 వార్డులను కూటమి ఏకగ్రీవంగా గెలుచుకుంది.ఇప్పుడు కేవలం జమ్మలమడుగు, పులివెందుల మున్సిపాలిటీల చైర్‌పర్సన్ స్థానాలకు, కడప కార్పొరేషన్ మేయర్ స్థానానికి మాత్రమే పోలింగ్ జరగాల్సి ఉంది. అయితే.. సుప్రీంకోర్టులో వైసీపీ దాఖలు చేసిన పిటీషన్ పైన మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన సుప్రీంకోర్టు.. తిరిగి ఈ నెల 27వ తేదీన విచారణ కొనసాగించనుంది. కోర్టు నిర్ణయం పైన వైసీపీ ఆశలు పెట్టుకుంది. ఈ సమయంలోనే జగన్ పులి వెందులలో ఉండాలని డిసైడ్ అయ్యారు. రేపు (మంగళవారం) పులివెందులలో పార్టీ నేతలతో జగన్ సమావేశం ఏర్పాటు చేసారు. రెండు రోజులు అక్కడే మకాం వేయనున్నారు. సుప్రీం కోర్టు తీర్పు.. ప్రధానంగా పులివెందులతో పాటుగా జమ్మలమడుగు, కడప మేయర్ స్థానాల గెలుపు పైన దిశా నిర్దేశం చేయనున్నారు. దీంతో.. సుప్రీం కోర్టు తీర్పు.. కడపలో జరిగే పోలింగ్... ఫలితాల పైన ఉత్కంఠ పెరుగుతోంది.













Click it and Unblock the Notifications
