పులివెందులకు వైఎస్ జగన్: మూడురోజుల పాటు అక్క‌డే!

కడప: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మంగ‌ళ‌వారం త‌న స్వ‌స్థ‌లం క‌డ‌ప జిల్లాలోని పులివెందుల‌కు వెళ్ల‌నున్నారు. మూడురోజుల పాటు ఆయ‌న అక్క‌డే మ‌కాం వేస్తారు. మంగ‌ళ‌వారం సాయంత్రం ఆయ‌న హైద‌రాబాద్‌లోని లోట‌స్ పాండ్ నివాసం నుంచి హెలికాప్ట‌ర్‌లో పులివెందుల‌కు బ‌య‌లుదేరి వెళ్తారు. బుధ‌, గురువారాల్లో ఆయ‌న అక్క‌డే ఉంటారు. పులివెందుల‌లోని పార్టీ కార్యాల‌యంలో ప్ర‌జా ద‌ర్బార్ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిస్తారు. రెండు రోజుల పాటు ఈ కార్య‌క్ర‌మం ఉంటుంది. గురువారం సాయంత్రం లేదా.. శుక్ర‌వారం ఉద‌యం ఆయ‌న మ‌ళ్లీ హైద‌రాబాద్‌కు చేరుకుంటార‌ని పార్టీ వ‌ర్గాలు వెల్ల‌డించాయి.

YSRCP Chief YS Jagan will visit his Home town Pulivendula on Tuesday

ప్ర‌జా ద‌ర్బార్ నిర్వ‌హించ‌డం ఆన‌వాయితీ..
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భ‌వించిన‌ప్ప‌టి నుంచీ పులివెందుల‌లోని పార్టీ కార్యాల‌యంలో ప్ర‌జా ద‌ర్బార్‌ను నిర్వ‌హించ‌డం ఆన‌వాయితీగా వ‌స్తోంది. వైఎస్ జ‌గ‌న్ అందుబాటులో లేని స‌మ‌యంలో పార్టీ కీల‌క నాయ‌కులు దీన్ని నిర్వ‌హిస్తుంటారు. నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌జ‌లు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌పై విన‌తిప‌త్రాల‌ను స్వీక‌రించ‌డానికి, వారి అభిప్రాయాల‌ను సేక‌రించ‌డానికి ప్ర‌జా ద‌ర్బార్‌ను నిర్వ‌హిస్తోన్న విష‌యం తెలిసిందే. వేస‌విలో పులివెందుల నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలో మంచినీటి స‌మ‌స్య‌, సాగునీటి స‌మ‌స్య‌, నీటి ఎద్ద‌డి తీవ్రంగా ఉన్న దృష్ట్యా ఆయా అంశాల‌తో పాటు స్థానిక విష‌యాలు కూడా ప్ర‌జాద‌ర్బార్‌లో ప్ర‌స్తావ‌న‌కు వ‌స్తాయ‌ని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+