వైసీపీకి పవన్‌ షాక్: ముఖాముఖి పోటీకే వైసీపీ వ్యూహత్మక అడుగులు

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: 2019 ఎన్నికల కోసం వైసీపీ ఇప్పటి నుండి వ్యూహత్మకంగా అడుగులు వేస్తోంది. ముఖాముఖి పోటీ ఉంటేనే రాజకీయంగా ప్రయోజనం కలుగుతోందని ఆ పార్టీ భావిస్తోంది,. ఈ మేరకు వైసీపీ నాయకత్వం మైండ్‌గేమ్ ఆడుతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

  YS Jagan Padayatra : కిక్కిరిసిపోయిన ఇడుపులపాయ | Oneinda Telugu

  2019 ఎన్నికల్లో ఏపీ రాష్ట్రంలో అధికారాన్ని కైవసం చేసుకోవాలని వైసీపీ ప్లాన్ చేస్తోంది. ఈ మేరకు వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ నవంబర్ 6వ, తేది నుండి పాదయాత్ర చేస్తున్నారు. మరో వైపు ఇతర పార్టీలు ఏపీ రాష్ట్రంలో బలపడితే రాజకీయంగా తమకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని వైసీపీ భావిస్తోంది.

  ఏపీ రాష్ట్రంలో అధికారాన్ని కైవసం చేసుకొనేందుకు అవసరమైన అన్ని అవకాశాలను ఆ పార్టీ అన్వేషిస్తోంది. ఈ తరుణంలో ఇతర పార్టీలకు చెందిన నేతలంతా తమ పార్టీలో చేరుతున్నారని వైసీపీ నేతలు మైండ్‌గేమ్ ఆడుతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.

   ముఖాముఖి పోటీని కొరుకొంటున్న వైసీపీ

  ముఖాముఖి పోటీని కొరుకొంటున్న వైసీపీ

  2019 ఎన్నికల్లో టిడిపి, తనకు మధ్యే ముఖాముఖి పోటీ ఉండాలని వైసీపీ భావిస్తోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లన్నీ గంపగుత్తగా తనకే పడేలా ఎత్తులు వేస్తోంది. టీడీపీతో ముఖాముఖి తలపడితేనే 2019 ఎన్నికల్లో ప్రయోజనమని అనుకుంటోంది. కాంగ్రె్‌సలో వ్యక్తిగత ప్రతిష్ఠ, ప్రజాకర్షణ కలిగిన నేతలను తన గూటికి రప్పించుకునే విధంగా వైసీపీ మైండ్‌గేమ్‌ ఆడుతోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

  ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా ఉండేందుకు వైసీపీ ప్లాన్

  ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా ఉండేందుకు వైసీపీ ప్లాన్

  ఏపీ రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా ఉండేందుకుగాను వైసీపీ వ్యూహత్మకంగా ప్లాన్ చేస్తోంది. టిడిపికి వ్యతిరేకంగా ఉన్న రాజకీయపార్టీల్లో ఉన్న నేతలను తమ పార్టీలోకి ఆహ్వనిస్తోంది వైసీపీ. వచ్చే ఎన్నికల్లో పవన్‌కళ్యాణ్ ‌కూడ ఎన్నికల బరిలో నిలిచే అవకాశం ఉన్నందున ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలితే రాజకీయంగా తమకు నష్టమనే అభిప్రాయం వైసీపీ వర్గాల్లో ఉంది. ఈ కారణంగా టిడిపికి వ్యతిరేకంగా ఉన్న నేతలను కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు.

  జనసేనతో వైసీపీకి ఇబ్బందేనా?

  జనసేనతో వైసీపీకి ఇబ్బందేనా?

  2019 ఎన్నికల బరిలోకి దిగుతామని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ఇప్పటికే ప్రకటించారు. పవన్‌ పార్టీ ఎన్నికల్లో ఎన్ని స్థానాలకు పోటీ చేస్తారు.. ఏయే స్థానాలకు పోటీ చేస్తోరు.. ఎవరితో జత కడతారు.. ఒంటరిగానే పోటీ చేస్తారా, వామపక్షాలతో కలిసి పోటీచేస్తారా, పవన్ పోటీచేస్తే ఏపీలో రాజకీయ పరిస్థితి ఎలా ఉంటుందనే విషయాలపై వైసీపీ నేతలు అంతర్గత సమావేశాల్లో చర్చిస్తున్నారు.

  నంద్యాల ఉప ఎన్నికలో కాంగ్రె్‌సకు అనుకొన్న మేర ఓట్లు

  నంద్యాల ఉప ఎన్నికలో కాంగ్రె్‌సకు అనుకొన్న మేర ఓట్లు

  రాలేదు. అయితే 2019లో శాసనసభలో అడుగుపెడతామని కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ధీమాతో ఉంది. అయితే ఈ మేరకు ఇటీవల కాలంలో ప్రత్యేక హోదా పేరుతో ఆందోళన కార్యక్రమాలను కాంగ్రెస్ పార్టీ ఆందోళనలు నిర్వహించింది. కాంగ్రెస్‌ నేతల్లో కనిపిస్తున్న ఈ ధీమా యే వైసీపీని కలవరపెడుతోంది. అసెంబ్లీలో అడుగుపెట్టేంత బలం కాంగ్రె్‌సకు వస్తే అది తమకే ముప్పని అర్థమైంది. పైగా కాంగ్రెస్‌ అభ్యర్థులు బరిలో ఉంటే వారికీ కొన్ని ఓట్లు పడతాయని.. వారంటూ పోటీలోనే లేకపోతే ఆ ఓట్లన్నీ తమకే పడతాయని వైసీపీ నేతలు అంటున్నారు. దరిమిలా కాంగ్రె్‌సలో సొంత బలం, వ్యక్తిగత ప్రతిష్ఠ కలిగిన నేతలపై వారు కన్నేశారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Ysrcp concentrated on strong leaders in congress party.Ysrcp planning to On Congerss keyleaders for 2019 elections. Congress,Janasena candidates reflects on Ysrcp results in 2019 elections said political analysts.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి