పవన్‌తో మాకే: గెలుపు మాదేనని ఆ లెక్కచెప్పిన జగన్

హైదరాబాద్: రేపు (శుక్రవారం) వెలువడనున్న ఫలితాల పైన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ధీమా వ్యక్తం చేస్తోంది. మున్సిపల్, పరిషత్ ఎన్నికల్లో పార్టీ బోర్లా పడినప్పటికీ, తెలుగుదేశం పార్టీతో టగ్గాఫ్ వార్ ఉంటుందని సర్వేలు చెబుతున్నప్పటికీ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మాత్రం తాము ఎట్టి పరిస్థితుల్లోను వందకు పైగా అసెంబ్లీ స్థానాలు, 20కి పైగా లోకసభ స్థానాలు గెలుస్తామని ఆ పార్టీ నేతలు ఢంకా బజాయిస్తున్నారు.

ఎగ్జిట్ పోల్ సర్వేలు, మున్సిపల్, పరిషత్ ఫలితాలు అన్నింటిని బేరీజు వేసుకొని తాము పూర్తిస్థాయిలో చర్చించాకనే తమకు అన్ని సీట్లు వస్తాయని కుండబద్దలు కొడుతున్నామని అంటున్నారు. ఆ పార్టీ సీనియర్ నేతలు మైసూరా రెడ్డి, అంబటి రాంబాబు, వాసిరెడ్డి పద్మ వంటి పలువురు నేతలు తమ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

అందుకు వారు పలు కారణాలు చూపిస్తున్నారు. పంచాయతీ, పరిషత్ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలు జరిగిన సందర్భం వేరని, ఈ ఎన్నికలకు మధ్య నెల రోజుల వ్యవధి వచ్చిందని చెబుతున్నారు. ఆ నెల రోజుల్లో ఎన్నో పరిణామాలు సంభవించాయని, అవన్నీ టిడిపికి అనుకూలంగా లేవని వారు అంటున్నారు.

YSRCP confident on winning about 100 seats

పరిషత్, ప్రాదేశిక ఎన్నికలు జరిగినప్పుడు బిజెపితో టిడిపి పొత్తు పెట్టుకోలేదని, సార్వత్రిక ఎన్నికలలో ఆ పార్టీల మధ్య పొత్తు కుదిరిందంటున్నారు. ఆ రెండు పార్టీల మధ్య పొత్తు తమకు కలిసి వస్తుందని వారు అంచనా వేస్తున్నారు. బిజెపితో టిడిపి పొత్తు పెట్టుకోవడం వల్ల కొన్ని వర్గాలు సైకిల్‌కు దూరం జరిగాయని వారు అభిప్రాయపడుతున్నారు. మోడీతో జత కట్టడం టిడిపికి మైనస్ కాగా తమకు ఉపకరిస్తుందని చెబుతున్నారు.

అలాగే చంద్రబాబు అమలు కానీ హామీలతో ప్రజల ముందుకు వెళ్లారని, అదే జగన్ వైయస్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాల గురించి చెప్పారని, దీనిని ప్రజలు నమ్మారని అంటున్నారు చంద్రబాబు అమలు కానీ హామీలు ఇవ్వడమే కాకుండా.. ఆయన అధికారంలో ఉన్నప్పుడు చేయకుండా ఇప్పుడు ఆ హామీలు ఇవ్వడమేమిటని ప్రజలు అడుగుతున్నారన్నారు.

చంద్రబాబు అధికారంలో ఉండి కూడా పథకాలు పెట్టలేదని, అది ఆయనకు మైనస్ అని, అదే జగన్ తన సత్తా నిరూపించుకునేందుకు ప్రజలు అవకాశం ఇవ్వాలనుకున్నారని ఆ పార్టీ చెబుతోంది. బిజెపికి మద్దతు పలికిన జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ టిడిపికి మద్దతు పలికినా దాని వల్ల ఆ పార్టీకి వచ్చిందేమీ లేదంటున్నారు. 2009లో బాబును తిట్టి, ఇప్పుడు మెచ్చుకోవడంపై పవన్‌ను ప్రజలే ప్రశ్నిస్తున్నారని చెబుతున్నారు. అది తమకే కలిసి వస్తుందంటున్నారు.

హైదరాబాదుకు జగన్

శుక్రవారం ఎన్నికల ఫలితాల నేపథ్యంలో జగన్ కుటుంబం హైదరాబాదు చేరుకుంది. పోలింగ్ అనంతరం విశ్రాంతి కోసం వెళ్లారు. గురువారం సాయంత్రం శంషాబాద్ విమానాశ్రయంలో దిగారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+