సీమ కేంద్రంగా వైసీపీ భారీ స్కెచ్, ముహూర్తం ఫిక్స్..!!
ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వైసీపీ లక్ష్యంగా కూటమి పార్టీలు కొత్త వ్యూహాలు ఫిక్స్ చేస్తున్నాయి. ఇందుకు కౌంటర్ గా మాజీ సీఎం జగన్ కొత్త ప్రణాళికలతో ప్రభుత్వాన్ని టార్గెట్ చేసేందుకు సిద్దం అవుతున్నారు. అందులో భాగంగా తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నారు. రాయలసీమ కేంద్రంగా భారీ స్కెచ్ సిద్దం చేస్తున్నారు. అమలు ముహూర్తం ఖరారు చేసారు. ఈ నిర్ణయం ద్వారా ప్రభుత్వాన్ని టార్గెట్ చేయాలనేది వైసీపీ లక్ష్యంగా కనిపిస్తోంది.
వైసీపీ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకొని మరో కార్యక్రమానికి సిద్దమైంది. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని అడ్డుకునేలా కూటమి ప్రభుత్వం చేస్తున్న కుట్రలను నిరసిస్తూ ఫిబ్రవరి 5వ తేదీన పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద భారీ ధర్నా, బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఉమ్మడి కర్నూలు జిల్లా వైసీపీ నేతలతో కీలక సమావేశం నిర్వహించారు.

రాయలసీమ దేశంలోనే అత్యంత వెనుకబడిన ప్రాంతమని పేర్కొన్నారు. సీమ ప్రజల సాగు, త్రాగునీటి అవస రాల కోసం శ్రీశైలం ప్రాజెక్టు ద్వారా వెనుక నుండి నీటిని తరలించే ఏర్పాట్లు చేశారని మాజీ ఆర్దిక మంత్రి బుగ్గన వెల్లడించారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా సీమకు నీరు అందుతుండ గా, అదే సమయంలో తెలంగాణ ప్రభుత్వం తమ ప్రాంతానికి ప్రాజెక్టులు నిర్మించుకుంటోందని చెప్పారు. సీమకు తరలిస్తున్న నీటిని అడ్డుకునేలా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో చంద్రబాబు నాయుడు చీకటి ఒప్పందం కుదుర్చుకున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ ఒప్పందంపై ఏపీ మంత్రులు ఒక్కరూ ప్రశ్నించకపోవడం దురదృష్టకరమని మండిపడ్డారు.
నిరసనలు.. బహిరంగ సభ
ఇక, గ్రేటర్ రాయలసీమ కోసం ఎత్తిపోతల పథకం సాధించేవరకు వైసీపీ పోరాటం కొనసాగిస్తుంద ని స్పష్టం చేశారు. ఈ పథకాన్ని నిలిపివేయాలన్న చంద్రబాబు నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ప్రజా ఉద్యమానికి సిద్ధమయ్యామని చెప్పారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉద్యోగులకు సమయానికి జీతాలు ఇవ్వడంలో విఫలమవుతోందని, ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తోందని బుగ్గన విమర్శించారు. తిరుమల శ్రీవారి లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందంటూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ స్వయంగా ఆరోపణలు చేశారని, అయితే సీబీఐ విచారణలో అలాంటిది ఏమీ లేదని తేలిందని గుర్తు చేశారు. ఈ తప్పుడు ఆరోపణలతో శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీశారని తీవ్రంగా తప్పుబట్టారు. ఫిబ్రవరి 5న పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద జరిగే ఈ నిరసన కార్యక్రమానికి అన్ని వర్గాల ప్రజలు, గ్రేటర్ రాయలసీమ వాసులంతా సంపూర్ణ మద్దతు ఇవ్వాలని బుగ్గన కోరారు.
-
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
Tamil Nadu Election: అంతుబట్టని విజయ్ తీరు..! తెరవెనుక ఏం జరుగుతోంది ?












Click it and Unblock the Notifications