సీఈసీని తక్షణం తొలగించండి..! కేంద్రానికి వైసీపీ సంచలన డిమాండ్ ..! ఇక పోరాటమే..!

ఎన్నికల సంఘాన్ని ఏక వ్యక్తి నియంతృత్వ పాలనగా మార్చిన ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ (CEC Gyanesh Kumar) ను వెంటనే ఆ పదవి నుంచి తప్పించాలని కేంద్రాన్ని వైఎస్సార్సీపీ (YSRCP) డిమాండ్ చేసింది. రాజ్యాంగబద్ధమైన ఎన్నికల సంఘం నిర్ణయాలు, ఈసీఐనెట్ (ECINet) నిర్వహణ, ఓటర్ల జాబితాలపై తోటి ఎన్నికల కమిషనర్లే పలుమార్లు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు జాతీయ మీడియాలో కథనాలు రావడం దేశ ప్రజల్లో అనేక సందేహాలను రేకెత్తిస్తోందని మాజీ మంత్రి సాకే శైలజానాథ్ తెలిపారు.

EC కీలక భేటీ- విభేదాలపై క్లారిటీ - SIR, ఓటర్ల ధృవీకరణపై సంచలన నిర్ణయాలు..!
EC కీలక భేటీ- విభేదాలపై క్లారిటీ - SIR, ఓటర్ల ధృవీకరణపై సంచలన నిర్ణయాలు..!

గత సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో పోలింగ్ రోజు నమోదైన శాతానికి, ఆ తర్వాత నాలుగు రోజులకు ఈసీ అధికారికంగా ప్రకటించిన శాతానికి మధ్య అనూహ్యమైన భారీ వ్యత్యాసం ఉండటం ట్యాంపరింగ్ అనుమానాలకు బలం చేకూరుస్తోందని శైలజానాథ్ తెలిపారు. కమిషనర్ల మధ్య నెలకొన్న భేదాభిప్రాయాలపై ప్రజలకు తగిన వివరణ ఇవ్వాలని, గత ఎన్నికల్లో జరిగిన గణాంకాల తేడాలు, వ్యవస్థాగత లోపాలపై విస్తృత చర్చ జరిగి సమగ్ర రీ-ఎగ్జామినేషన్ నిర్వహించాలని, అప్పుడే ప్రజాస్వామ్య వ్యవస్థపై పౌరులకు సంపూర్ణ నమ్మకం కలుగుతుందని ఆయన తెలిపారు.

YSRCP Demands Immediate Removal of CEC Gyanesh Kumar Accuses EC of One-Man Autocracy

రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 ప్రకారం ఎన్నికల సంఘంలోని ప్రధాన ఎన్నికల కమిషనర్, మిగతా ఇద్దరు కమిషనర్లు సమానమైన హోదా, అధికారాలు కలిగిన వ్యక్తులని, కానీ సీఈసీ.. కమిషనర్ల అభిప్రాయాలను బేఖాతరు చేస్తూ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తోటి కమిషనర్లు 14 సార్లు అభ్యంతరాలు వ్యక్తం చేసినా పట్టించుకోకుండా, ఎన్డీయే కూటమికి అనుకూలంగా నిర్ణయాలు తీసుకున్నారన్నారు. రాజ్యాంగ నిబంధనలను కాలరాసి వన్ మ్యాన్ ఆటోక్రసీ నడుపుతున్న సీఈసీని కేంద్ర ప్రభుత్వం తక్షణమే పదవి నుంచి తప్పించాలన్నారు. 2024 మే 13న ఏపీలో పోలింగ్ ముగిసిన రోజు రాత్రి 11:45 గంటలకు 76.50 శాతం పోలింగ్ నమోదైనట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి స్వయంగా వెల్లడించారని, తీరా మే 17 నాటికి అది 81.66 శాతానికి ఎలా పెరిగిందని ప్రశ్నించారు. పోలింగ్ ముగిసిన రోజు రాత్రి 11:45 నుండి అర్ధరాత్రి 2 గంటల మధ్య-కేవలం 2 గంటల 15 నిమిషాల వ్యవధిలోనే రాకెట్ కంటే వేగంగా 17,19,482 ఓట్లు ఎలా ఈవీఎంలలో నమోదయ్యాయని ప్రశ్నించారు.

ఈసీ వివాదంలో ఎన్డీయే మిత్రుల షాకులు- వైఎస్సార్సీపీ బాటలో టీడీపీ, మరో 2 పార్టీలు..!
ఈసీ వివాదంలో ఎన్డీయే మిత్రుల షాకులు- వైఎస్సార్సీపీ బాటలో టీడీపీ, మరో 2 పార్టీలు..!

సాయంత్రం 5 నుండి రాత్రి 8 గంటల మధ్య పోలింగ్ శాతం కేవలం 0.08 శాతంగా ఉంటే, అర్ధరాత్రి దాటాక ఒక్కసారిగా ఓట్లు కుప్పలుతెప్పలుగా ఎలా వచ్చిపడ్డాయన్నారు. ఈ లెక్కలపై ఇప్పటివరకు రాష్ట్ర సీఈఓ గానీ, కేంద్ర ఎన్నికల సంఘం గానీ స్పష్టమైన వివరణ ఎందుకు ఇవ్వలేదని అడిగారు. ఏపీ ఎన్నికల్లో జరిగిన అవకతవకలపై విచారణకు అవకాశం లేకుండా హడావుడిగా వీవీప్యాట్ స్లిప్పులను ఎందుకు కాల్చేశారని నిలదీశారు. పోలింగ్ కేంద్రాల్లో రికార్డైన వెబ్‌కాస్టింగ్ వీడియో క్లిప్పింగులను బహిర్గతం చేయమంటే ఈసీ ఎందుకు వెనుకాడుతోందని అఢిగారు. కేంద్ర ఎన్నికల సంఘం ఏకపక్ష వైఖరి, అనుమానాస్పద విధానాల వల్ల అత్యధికంగా నష్టపోయింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీయే అన్నారు.

YSRCP Demands Immediate Removal of CEC Gyanesh Kumar Accuses EC of One-Man Autocracy

ప్రజల్లో నెలకొన్న ఈ తీవ్రమైన అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ఈసీపై లేదా? అని ప్రశ్నించారు. అందుకే జగన్ చెప్పినట్లుగా.. 2023 నాటి ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇతర కమిషనర్ల నియామక చట్టాన్ని కేంద్రం పునఃసమీక్షించాలన్నారు. రాష్ట్రంలో లక్షలాది డబుల్ ఓట్లు, చనిపోయిన వారి పేర్లు ఉన్న పాత ఓటర్ల జాబితాతోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం కోర్టుకు చెప్పడం అత్యంత దారుణమన్నారు. అక్రమాలను అరికట్టి, తప్పులను సరిదిద్దే వరకు ప్రజాక్షేత్రంలో, న్యాయస్థానాల్లో వైఎస్సార్‌సీపీ పోరాటం కొనసాగుతుందని సాకే శైలజానాధ్ స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+