వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మహేష్ బాబుపై వైసీపి ఫ్యాన్స్ అసంతృప్తి..! అంత వినయం ఎందుకంటున్న అభిమానులు..!!

|
Google Oneindia TeluguNews

Recommended Video

మహేష్ బాబు పై విరుచుకుపడుతున్న జగన్ ఫ్యాన్స్ || YSRCP Fans Fires On Hero Mahesh Babu || Oneindia

అమరావతి/హైదరాబాద్ : హీరో మహేష్ బాబుకు రాజకీయ తారతమ్యాలు ఉన్నాయా..? రాజకీయ నేతల పట్ల చూపించే అభిమానం కూడా ఒకే వర్గానికి పరిమితం చేసుకున్నారా..? ఏపిలో అదికార పార్టీతో ఒక లాగా, ప్రతిపక్ష పార్టీ నేతలతో మరోలాగా వ్యవహరిస్తున్నారా..? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఇదే అంశంపై ఏపిలో ప్రస్తుతం అభిమానుల మద్య ప్రకంపనలు రేగుతున్నాయి. ముఖ్యంగా వైసీపి అభిమానులు హీరో మహేష్ బాబు పై అసహనంగా ఉన్నట్టు తెలుస్తోంది. కృష్ణను పరామర్శించడానికి ఏపి సీయం జగన్ వెళ్లినప్పుడు కనిపించని మహేష్ బాబు, మాజీ సీఎం చంద్రబాబు వెళ్లినప్పుడు మాత్రం అన్నీతానై మర్యాదలు చేసాడని వైసీపి అభిమానులు తెగ నొచ్చుకుంటున్నట్టు తెలుస్తోంది. అదే సమయంలో దివంగత సీఎం వైయస్ రాజశేఖర్ రెడ్డికి, హీరో కృష్ణకి ఉన్న సాన్నిహిత్యం గురించి నెమరువేసుకుంటున్నారు అభిమానులు. ఈ నేపథ్యంలో మహేష్ బాబు తీరును జగన్ అభిమానులు అసంతృప్తి వ్యక్వం చేస్తున్నారు.

మహేష్ బాబు ను ఇబ్బందులకు గురి చేసిన చంద్రబాబు..! పరామర్శలో విమర్శలు..!!

మహేష్ బాబు ను ఇబ్బందులకు గురి చేసిన చంద్రబాబు..! పరామర్శలో విమర్శలు..!!

నటుడు మహేష్ బాబుపై ఏపీ సీఎం జగన్ వీరాభిమానులు గుర్రుమంటున్నారు, కన్నెర్ర చేస్తున్నారు. వారి కోపావేశానికి కారణముంది. అదేమిటంటే...
సీనియర్ నటి, దర్శకురాలు విజయ నిర్మల మృతితో సినీ ఇండస్ట్రీ మొత్తం విషాదంలో మునిగింది. నా ప్రాణం పోయింది... అంటూ, సూపర్ స్టార్ కృష్ణ కన్నీటిపర్యంతమవుతున్నారు. ఆ దంపతుల మధ్య ప్రేమానురాగాలు అంత బలంగా పెనవేసుకున్నాయి. ఒకరిని విడిచి ఒకరు ఎప్పుడూ లేరు. ఒకరంటే ఒకరికి ప్రాణం. ఎక్కడున్నా, ఎక్కడికెళ్లినా జంటగా వెళ్లాల్సిందే. ఆ జంట ఇప్పుడు విడిపోయింది. అందుకే, నా ప్రాణం పోయింది... అంటూ, సూపర్ స్టార్ కృష్ణ భావోద్వేగానికిలోనయ్యారు. ఆయనను ఓదార్చడానికి తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్ సహా అనేకమంది వచ్చి వెళ్లారు.

 వైసీపి ఫాన్స్ ఆగ్రహం..! పోకిరి వ్యవహారం శృతిమించిందంటూ వ్యాఖ్యలు..!!

వైసీపి ఫాన్స్ ఆగ్రహం..! పోకిరి వ్యవహారం శృతిమించిందంటూ వ్యాఖ్యలు..!!

కృష్ణను పరామర్శించేందుకు వచ్చిన ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబును, ఆయన బావమరిది బాలక్రిష్ణను, లోకేష్ బాబును మహేష్ బాబు బాగా రిసీవ్ చేసుకున్నారు. నాన్న కృష్ణ వెంటే ఉన్నారు. తండ్రి మానసిక పరిస్థితిని, పిన్నితో అనుబంధాన్ని బాబుకు, బాలయ్యకు వివరించారు. ఏపీ సీఎం జగన్ వచ్చినప్పుడు మాత్రం మహేష్ బాబు కనిపించలేదు. కనీసం సీఎం వస్తున్నారని ముందస్తు సమాచారం ఉన్నప్పటికి కూడా హాజరుకాలేదు. టీడీపీ అధినేత చంద్రబాబు పరామర్శకు వచ్చినప్పుడు హాజరై అన్నీ తానై వ్యవహరించిన మహేష్ ఫొటోలు బయటకు రాగానే జగన్ ఫ్యాన్స్ హర్టయ్యారు. సీఎం జగన్ ఫ్యాన్స్ కోపానికి ఇప్పుడు ఇదే కారణమైంది. సోషల్ మీడియా సాక్షిగా మహేష్ బాబును ట్రోల్స్ చేస్తున్నారు.

టక్కరి వేశాలు..! సంయంమనం పాటించాలంటున్న జగన్ శిశ్యులు..!!

టక్కరి వేశాలు..! సంయంమనం పాటించాలంటున్న జగన్ శిశ్యులు..!!

జగన్ ను మహేష్ అవమానించారంటూ ఆయన మండిపడుతున్నారు. చంద్రబాబు కంటే వైఎస్ ఫ్యామిలీనే ఘట్టమనేని ఫ్యామిలీకి దగ్గర అంటూ ఉదాహరణలు చూపుతున్నారు. నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, వివాదంలో ఉన్న సూపర్ స్టార్ కృష్ణ 'పద్మాలయ స్టూడియో' భూములను క్రమబద్దీకరించారని.. మహేష్ 'సైనికుడు' సినిమా విడుదలైనప్పుడు వరంగల్ లో జరిగిన గొడవలో కూడా మహేష్ ను వైఎస్ క్షమించారని పాత విషయాలు జగన్ అభిమానులు తవ్వి తీస్తున్నారు.

 చిన్న బుచ్చుకున్న శ్రీమంతుడు..! అప్రమత్తంగా ఉండాలనుకుంటున్న మహర్షి ..!!

చిన్న బుచ్చుకున్న శ్రీమంతుడు..! అప్రమత్తంగా ఉండాలనుకుంటున్న మహర్షి ..!!

ఇక మహేష్ బాబాయ్ ఘట్టమనేని ఆది శేషగిరిరావు కూడా మొన్నటివరకు వైసీపీలోనే ఉన్నారు. ఎన్నికల ముందే టీడీపీలో చేరారు. అంతేకాదు, కృష్ణ ఫ్యామిలీ మొత్తం వైఎస్ ఆర్ సీపీ పార్టీతో అనుబంధం ఉన్నవారే. జగన్ కూడా మహేష్ కు బెస్ట్ ఫ్రెండే. ఇంత సాన్నిహిత్యం ఉన్నా కూడా ఏపీ సీఎం హోదాలో తొలిసారి వచ్చిన జగన్ ను మహేష్ రిసీవ్ చేసుకోకపోవడం.. పైగా ప్రతిపక్ష నేత చంద్రబాబు వచ్చిన సమయంలో ఉండడంతో జగన్ ఫ్యాన్స్ లో కోపం కట్టలు తెంచుకుంది. ప్రతిపక్ష నేతకు ఇచ్చిన గౌరవం అధికార పార్టీ సీఎంకు ఇవ్వరా...? అని మహేష్ ను నెటిజన్లు ప్రశ్నలతో కడిగేస్తున్నారు. ఇప్పుడు మహేష్ ను సోషల్ మీడియా వేదికగా ఇదే విషయంపై ట్రోల్స్ తో జగన్ ఫ్యాన్స్ ఎండగడుతున్నారు. కుటుంబంలోని ఇద్దరు పెద్దల్లో ఒకరిని కోల్పోయిన బాధలో వాళ్లుంటే, ఈ వీరాభిమానుల చిల్లర గొడవేమిటి...? అని విసుక్కుంటున్న నెటిజన్లు కూడా లేకపోలేదు.

English summary
Hero Mahesh Babu has political differences? Do you have a fondness for political leaders but also for one category? How do you deal with the opposition party leaders like the one in AP? That is the answer. There is currently a fan following on the same topic.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X