మూడేళ్ల క్రితం వైసీపీ వాళ్లే రవికిరణ్‌పై కేసు పెట్టారు.. ఇదిగో సాక్ష్యాలు!: పరకాల ప్రభాకర్

Subscribe to Oneindia Telugu

విజయవాడ: పొలిటికల్ పంచ్ రవికిరణ్‌కు సంబంధించి టీడీపీ ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్.. కొత్త వాదనను తెరపైకి తీసుకొచ్చారు. నిజానికి రవికిరణ్ పై తొలి కేసు నమోదు చేసింది వైసీపీ పార్టీ వాళ్లేనని, విశాఖపట్నంలో రవికిరణ్ పై జూలై 31, 2014న ఆ పార్టీ కేసు పెట్టిందని పరకాల అన్నారు.

అప్పట్లో విశాఖ రూరల్ పోలీస్ స్టేషన్ లో రవికిరణ్‌పై కేసు నమోదైన మాట వాస్తవమా? కాదా? అని వైసీపీని పరకాల ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఫిర్యాదుకు సంబంధించిన వివరాలను కూడా ఆయన బయటపెట్టారు. అప్పుడు కూడా భావ ప్రకటనా స్వేచ్చ కిందనే వైసీపీ నేతలు.. రవికిరణ్ పై కేసు నమోదు చేశారని చెప్పుకొచ్చారు.

 ysrcp filed case on political punch admin ravikiran three years back says parakala prabhakar

మూడేళ్ల క్రితం రవికిరణ్‌పై భావ ప్రకటన స్వేచ్చను దుర్వినియోగం చేస్తున్నారని కేసు పెట్టిన వైసీపీ.. ఇప్పుడు ఆయన్ను వెనుకేసుకొచ్చి దిగజారుడు రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా ప్రవర్తిస్తే ఎవరూ చూస్తూ ఊరుకోబోరని అన్నారు. సభ్య సమాజం అసహ్యించుకునే చిత్రాలు, భాషను ఉపయోగించడం సమంజసం కాదన్నారు.

 ysrcp filed case on political punch admin ravikiran three years back says parakala prabhakar

భావ ప్రకటనా స్వేచ్ఛకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న ప్రభుత్వం తమదేనని, పలు వేదికలపై సీఎం చంద్రబాబు వైఖరి ఇదే విషయాన్ని స్పష్టం చేసిందని అన్నారు. నిర్మాణాత్మక విమర్శలు, సద్విమర్శలు స్వీకరిస్తామని, అలా అని ప్రజా ప్రతినిధుల పరువు తీసే పనులు చేస్తే ఎవరు హర్షించరని హితవు పలికారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Ap communication adviser Parakala Prabhakar alleged that Ysrcp filed a case on political punch admin Ravikiran three years back
Please Wait while comments are loading...