'బాబుకు నచ్చలేదని రాజమౌళి వద్దకా', జక్కన్న అప్పుడే నో చెప్పారు, ఐనా

Posted By:
Subscribe to Oneindia Telugu
  Chandrababu taking Rajamouli's help, Know Why ? రాజమౌళిని లండన్ పంపండి: చంద్రబాబు | Oneindia Telugu

  అమరావతి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎంచుకున్న రాజధాని డిజైనర్లు అసమర్థులా లేక మీరు అవినీతికి పాల్పడుతున్నారా అని వైసిపి నేత పార్థసారథి ప్రశ్నించారు.

  మళ్లీ మొదటికి వచ్చిన అమరావతి డిజైన్ల వ్యవహారం

  అమరావతి డిజైన్లపై మరోసారి సందిగ్ధత ఏర్పడిన విషయం తెలిసిందే. ఆకృతులపై అసంతృప్తి వ్యక్తం చేసిన చంద్రబాబు, మరింత మంచి రూపు తీసుకు రావాలని సూచించారు.

  మూడున్నరేళ్లలో ఏం చేశారు?

  మూడున్నరేళ్లలో ఏం చేశారు?

  ఈ నేపథ్యంలో పార్థసారథి గురువారం విలేకరులతో మాట్లాడారు. ఈ మూడున్నరేళ్ల పాటు చంద్రబాబు ఏం చేశారని ప్రశ్నించారు. డిజైన్లకే కోట్లాది రూపాయల ధనం దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. డిజైన్లు చూపించి ప్రజలను మభ్య పెడతారా అని ప్రశ్నించారు.

  డిజైన్లతో మభ్యపెడతారా?

  డిజైన్లతో మభ్యపెడతారా?

  అమరావతికి బడ్జెట్ ఎంత కేటాయించారు, కేంద్రం నుంచి ఎంత తీసుకు వచ్చారో చెప్పాలని పార్థసారథి ప్రశ్నించారు. ఈ నెల 30న శంకుస్థాపన అన్నారని, మరి డిజైన్లు చూపించి ప్రజలను మభ్యపెడతారా అని ప్రశ్నించారు. మొక్కుబడిగా శంకుస్థాపన చేస్తే నిలదీస్తామన్నారు.

  బాబుకు నచ్చలేదని రాజమౌళి వద్దకు పంపారట

  బాబుకు నచ్చలేదని రాజమౌళి వద్దకు పంపారట

  నార్మ్న పోస్టర్స్ డిజైన్లు చంద్రబాబుకు నచ్చలేదని చెబుతున్నారని, ఆయనకు నచ్చక దర్శకులు రాజమౌళికి పంపిస్తామని చెబుతున్నారని పార్థసారథి ఎద్దేవా చేశారు. డిజైన్లను లోకేష్‌కు చూపించడం ఏమిటని ఎద్దేవా చేశారు.

  గతంలోనే రాజమౌళి నో చెప్పారు

  గతంలోనే రాజమౌళి నో చెప్పారు

  కాగా, డిజైన్ల వ్యవహారంలో దర్శకులు రాజమౌళిని సంప్రదించాలని చంద్రబాబు సూచించిన విషయం తెలిసిందే. అయితే, గతంలోనే జక్కన్న దీనికి నో చెప్పారని అంటున్నారు. గతంలోనే చంద్రబాబు ప్రతిపాదన చేయగా సున్నితంగా తిరస్కరించారని చెబుతున్నారు. తాను సినిమాలకే పరిమితం అవుతానని చెప్పారని చెబుతున్నారు.

  అయినా రాజమౌళి వద్దకే

  అయినా రాజమౌళి వద్దకే

  ఇప్పుడు మళ్లీ రాజమౌళి వద్దకు వెళ్లాలని చంద్రబాబు ప్రభుత్వం సూచించడం చర్చనీయాంశంగా మారింది. 2018 జూన్ నాటికి రాజధానిలో మొదటి దశ నిర్మాణాలు పూర్తి చేస్తామని ప్రమాణ స్వీకారం సమయంలో చంద్రబాబు చెప్పారు. మూడున్నరేళ్లు గడిచినా ఒక్క అడుగు పడలేదు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  National award-winning Telugu director SS Rajamouli, who recreated the imaginary city of Mahishmati in his magnum opus film Baahubali, will help the Andhra Pradesh government design its new capital Amaravati.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి