డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు పై వైసీపీ బిగ్ ట్విస్ట్..!!

వైసీపీ కీలక నిర్ణయం తీసుకుంది. రేపు (సోమవారం) పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అందులో భాగంగా అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్స్ తో కేంద్రం అఖిల పక్ష సమావేశం నిర్వహించింది. కీలక బిల్లులను ఈ సమావేశాల్లో ప్రవేశ పెట్టనున్నట్లు కేంద్రం వెల్లడించింది. వైసీపీ ఫ్లోరు లీడర్లు తాము ప్రస్తావించే కీలక అంశాలను వివరించారు. అదే సమయంలో కేంద్రం తీసుకొచ్చే మహిళా రిజర్వేషన్.. డీలిమిటేషన్ బిల్లు పైనా స్పష్టత ఇచ్చారు.

పార్లమెంట్ సమావేశాల వేళ కేంద్రం నిర్వహించిన అఖిల పక్ష భేటీలో వైసీపీ లోక్ సభ ప్లోరు లీడన్ మిధున్ రెడ్డి, పార్లమెంటరీ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి కీలక అంశాలను ప్రస్తావించారు. ఏపీలో రైతులు మద్దతు ధరలు లేక ఇబ్బంది పడుతున్నారని.. ఆక్వా, మామిడి, పొగాకు తో సహా ఇతర రైతుల సమస్యల పైన చర్చకు అవకాశం ఇవ్వాలని కోరారు. అదే విధంగా ఏపీ ప్రభుత్వం ప్రజా ఆస్తులను ప్రయివేటుకు కట్టబెడుతుందని.. పోర్టులు షిప్పింగ్ హార్బర్ లు.. మెడికల్ కాలేజీలు ప్రయివేటు కు అప్పగిస్తున్నారని ఆరోపించారు. చిన్న పరిశ్రమలు మూత పడుతున్నా యని.. లాకప్ డెత్ లు పెరిగిపోతున్నాయని విమర్శించారు.

ysrcp-floor-leaders-clarifies-party-stand-over-delimitaiton-bill-in-all-party-meeting-here-the-deta

ఏపీలో అంశాల పైనా ప్రస్తావన

పోలవరం సకాలంలో పూర్తి చేయాలనే డిమాండ్ తో పాటుగా స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ నిలుపుదల చేయాలని.. ఈ అంశాల పై సభలో చర్చ జరగాలని కోరారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఇప్పటికే మాజీ సీఎం జగన్ మద్దతు ప్రకటించారని.. డీలిమిటేషన్ బిల్లు సభలో ప్రవేశ పెట్టిన తరువాత పరిశీలించి తమ నిర్ణయం ప్రకటిస్తామని చెప్పారు. ఏపీలో పెరిగిపోతున్న అప్పులు ఎక్కడ ఖర్చు చేస్తున్నారో చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. అమరావతిలో అవినీతి జరుగుతుందని..దీనికి తాము వ్యతిరేకమని స్పష్టం చేసారు. అమరావతి రైతుల పక్షాన పోరాటం చేస్తామని ప్రకటించారు. అమరావతిలో ఒకే చోట పెట్టుబడి పెడుతున్నారని.. అందుకే జగన్ మావిగన్ ప్రతిపాదన చేసారని చెప్పారు. సీఆర్డీఏ పరిధిలోకే మావిగన్ వస్తుందని సుబ్బారెడ్డవి వ్యాఖ్యానించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+