నామినేషన్లపై వైసీపీకి మరో గుడ్ న్యూస్..! ఎస్ఈసీ కీలక నిర్ణయం..!

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల్లో విపక్ష వైఎస్సార్సీపీకి (YSRCP ) ఇవాళ మరో గుడ్ న్యూస్ అందింది. రాష్ట్రంలో హింసాత్మక ఘటనల నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల గడువు పొడిగించాలంటూ దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు స్పందించి.. రేపటి లోగా దీనిపై నిర్ణయం తీసుకోవాలని ఎస్ఈసీకి ఉదయం ఆదేశాలు ఇచ్చింది. సాయంత్రానికి వైఎస్సార్సీపీ ఫిర్యాదులు చేస్తున్న మరో అంశంపై ఎస్ఈసీ (AP SEC) సానుకూల ఆదేశాలు ఇచ్చింది. దీంతో విపక్ష పార్టీకి మరో భాారీ ఊరట లభించినట్లయింది.

 ఏపీలో నామినేషన్ల పొడిగింపుపై సుప్రీం కీలక ఆదేశాలు-వైసీపీకి ఊరట..!
ఏపీలో నామినేషన్ల పొడిగింపుపై సుప్రీం కీలక ఆదేశాలు-వైసీపీకి ఊరట..!

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ప్రభుత్వం అధికారులపై ఒత్తిడి తెచ్చి వైఎస్సార్సీపీ అభ్యర్ధులకు నో డ్యూస్ సర్టిఫికెట్లు, ఎన్వోసీలు ఇవ్వకుండా అడ్డుపడుతోందని ఆ పార్టీ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో ఎస్ఈసీకి ఇప్పటికే పలు ఫిర్యాదులు కూడా చేసింది. అయితే వీటిపై ఇప్పటివరకూ ఎలాంటి నిర్ణయం తీసుకోని ఎస్ఈసీ.. ఇవాళ సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఈ సర్టిఫికెట్ల జారీ వ్యవహారంపైనా స్పందించింది. ఈ మేరకు అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసింది.

ysrcp nominations ap sec
పులివెందుల పోలీసు కాల్పుల కేసులో బిగ్ టర్న్- వైసీపీ అనూహ్య డిమాండ్..!
పులివెందుల పోలీసు కాల్పుల కేసులో బిగ్ టర్న్- వైసీపీ అనూహ్య డిమాండ్..!

పోలీసుల నుండి ఎన్వోసీ, ప్రభుత్వ శాఖల నో డ్యూ సర్టిఫికెట్లు లేకపోయినా నామినేషన్ తిరస్కరించడానికి వీల్లేదని అధికారులకు ఎస్ఈసీ ఆదేశాలు ఇచ్చింది. నామినేషన్ పత్రాలతో పాటు సంబంధిత పోలీస్ స్టేషన్ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ సమర్పించలేదనే కారణంతో నామినేషన్‌ను తిరస్కరించకూడదని అధికారులకు స్పష్టం చేసింది. అలాగే ఏదైనా ప్రభుత్వ శాఖ నుంచి బకాయిలు లేవని తెలిపే నో డ్యూస్ సర్టిఫికెట్ సమర్పించలేదనే కారణంతో కూడా నామినేషన్‌ను తిరస్కరించకూడదని తెలిపింది. నామినేషన్ పత్రాలతో పాటు పోలీస్ ఎన్వోసీ లేదా ఏదైనా ప్రభుత్వ శాఖకు సంబంధించిన నో డ్యూస్ సర్టిఫికెట్లు తప్పనిసరిగా జతచేయాలనే నిబంధన స్థానిక సంస్థల చట్టాల్లోగానీ, రాష్ట్ర ఎన్నికల సంఘం సూచనల్లోగానీ లేదని ఎన్నికల సంఘం క్లారిటీ ఇచ్చింది. నామినేషన్ల దాఖలు, పరిశీలనకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే జారీ చేసిన మార్గదర్శకాలను రిటర్నింగ్ అధికారులు, ఎన్నికల అధికారులు తప్పనిసరిగా పాటించాలని ఎస్ఈసీ ఆదేశాలకు ఇచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+