హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

స్పీకర్‌పై వైసిపి అవిశ్వాస నోటీస్: నెట్లో రోజా వీడియోలు, ఎలా వచ్చాయి?

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: సభాపతి కోడెల శివప్రసాద రావు పైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బుధవారం ఉదయం అవిశ్వాస తీర్మానం నోటీసును ఇచ్చింది. అసెంబ్లీ కార్యదర్శిని కలిసిన వైసిపి ఎమ్మెల్యేలు స్పీకర్ పైన తీర్మానం అందించారు.

ఈ సందర్భంగా రోజాకు చెందిన వీడియోలు బయటకు ఎలా వచ్చాయని అసెంబ్లీ కార్యదర్శిని అడిగి ఆరా తీశారు. శాసన సభలో రోజాకు సంబంధించిన వీడియోలు కొన్ని సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. అనంతరం వారు విలేకరులతో మాట్లాడారు.

YSRCP gives notice for no confidence motion against speaker

సభాపతి అంటే నిష్పక్షపాతంగా వ్యవహరించాలన్నారు. తొలి సమావేశం నుంచి స్పీకర్ కోడెల శివప్రసాద రావు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. సభలో టెలికాస్ట్ కాని కొన్ని వీడియోలు సోషల్ మీడియాకు ఎలా విడుదలయ్యాయని ప్రశ్నించారు.

రోజా పైన దుష్ప్రచారం కోసమే టెలికాస్ట్ కానీ వీడియోలను లీక్ చేశారని ఆరోపించారు. వీడియో ఎలా లీక్ అయింది? అసెంబ్లీ ప్రాపర్టీ సోషల్ మీడియా చేతికి ఎలా వచ్చింది? అనేవి చెప్పాలన్నారు. వాటిని ఎడిట్ చేసి లీక్ చేశారన్నారు. హౌస్ ప్రాపర్టీకి చెందినవి (వీడియోలు) ఎలా లీక్ అయ్యాయన్నారు.

YSRCP gives notice for no confidence motion against speaker

వీటన్నింటి నేపథ్యంలో తాము సభాపతి పైన అవిశ్వాస నోటీసు ఇచ్చామని చెప్పారు. రోజా పైన ఏడాది పాటు సస్పెన్షన్ వేటు వేసి, ప్రతిపక్ష వైసిపి సభ్యులను అధికార తెలుగుదేశం పార్టీ బెదిరించే ప్రయత్నం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.

అవిశ్వాసంలో మీరు గెలుస్తారా అని విలేకరులు ప్రశ్నించగా... ఇప్పుడు అవిశ్వాసం పెట్టేందుకు తమకు బలం ఉందని అవిశ్వాసంపై చర్చ సందర్భంగా ఓటింగ్ వచ్చినప్పుడు మేం చూస్తామన్నారు. అయినా అవిశ్వాసానికి కావాల్సింది మందబలం కాదన్నారు.

English summary
YSRCP gives notice for no confidence motion against speaker.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X