Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పవన్ కల్యాణ్ తో వైసీపీ ఎమ్మెల్యే సమావేశం - సీటు పై కీలక హామీ..!!

ఏపీలో ఎన్నికల వేళ నేతల పార్టీ మార్పులు మొదలయ్యాయి. ఇప్పటికే వైసీపీ నుంచి కొందరు ముఖ్య నేతలు టీడీపీ, జనసేన లోకి వెళ్లేందుకు డిసైడ్ అయ్యారు. ఇప్పుడు వైసీపీ మాజీ ఎంపీ, ప్రస్తుత ఎమ్మెల్యే వర ప్రసాద్ జనసేనాని పవన్ తో సమావేశమయ్యారు. గూడూరు నుంచి ఈ సారి ఎమ్మెల్సీ మేరిగ మురళీధరరావుకు జగన్ ఇంఛార్జ్ బాధ్యతలు కేటాయించారు. దీంతో, తాజాగా పవన్ ను కలిసిన వరప్రసాద్ వచ్చే ఎన్నికల్లో సీటు పైన చర్చించగా, హామీ దక్కినట్లు తెలుస్తోంది.

పవన్ తో వైసీపీ ఎమ్మెల్యే భేటీ : వైసీపీలో సీట్లు దక్కని నేతలు టీడీపీ, జనసేన నుంచి సీట్ల కోసం ప్రయత్నిస్తున్నారు. గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ రావు తాజాగా జనసేనాని పవన్ తో సమావేశమయ్యారు. వరప్రసాద్ 2009లో ప్రజారాజ్యం నుంచి తిరుపతి ఎంపీ అభ్యర్దిగా పోటీ చేసారు. ఆ సమయంలోనే మెగా కుటుంబంతో సంబంధాలు ఏర్పడ్డాయి. తరువాత వైసీపీలో చేరిన వరప్రసాద్ 2014లో తిరుపతి నుంచి పోటీ చేసి గెలుపొందారు. 2019 లో గూడూరు నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. ఈ సారి ఎన్నికల్లో వరప్రసాద్ కు సీఎం జగన్ సీటు నిరాకరించారు. అక్కడినుంచి పలువురు అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్న పరిస్థితుల్లో వైసీపీ ఇన్‌చార్జిగా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ మేరిగ మురళీధరరావు పేరును పార్టీ ఖరారు చేసింది.

YSRCP Gudur MLA Varaprasada Rao meets Janasena Chief Pawan Kalyan

ఎంపీ సీటు కేటాయించాలని వినతి : దీంతో, పవన్ ను కలిసిన వరప్రసాద్ వచ్చే ఎన్నికల్లో తిరుపతి ఎంపీగా అవకాశం ఇవ్వాలని కోరినట్లు తెలుస్తోంది. టీడీపీతో పొత్తు ఉండటంతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని పవన్ హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు. తిరుపతికి ప్రస్తుతం వైసీపీ ఎంపీ గురుమూర్తి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బీజేపీ తమతో కలిసి వస్తే తిరుపతి బీజేపీకి కేటాయించాలనేది చంద్రబాబు, పవన్ ఆలోచనగా తెలుస్తోంది. బీజేపీ కలిసి రాకపోతే జనసేనకు తిరుపతి పార్లమెంట్ సీటు కేటాయిస్తారనే వాదన ఉంది.

YSRCP Gudur MLA Varaprasada Rao meets Janasena Chief Pawan Kalyan

35 సీట్లకు పవన్ అభ్యర్దులు సిద్దం : ఈ క్రమంలో పవన్ ను కలిసిన వరప్రసాద్ తాను గతంలో తిరుపతి నుంచి గెలిచి ఉండటంతో, తనకు తిరుపతి సీటు కేటాయించాలని కోరినట్లుగా సమాచారం. అటు పవన్ కల్యాణ్ ఇప్పటికే 35 సీట్లకు సంబంధించి అభ్యర్దులను ఖరారు చేసినట్లు చెబుతున్నారు. పొత్తులో భాగంగా పవన్ 40 సీట్లు కోరుతున్నారు. కాగా, చంద్రబాబు నుంచి ఎన్ని సీట్లకు ఆమోదం లభిస్తుందనేది ఇప్పుడు కీలక అంశంగా మారుతోంది. గోదావరి జిల్లాల్లో జనసేన ఎక్కువ సీట్లు ఆశిస్తోందది. దీంతో, జనసేనకు కేటాయించే సీట్ల ఆధారంగా పవన్ తన పార్టీలో చేరిన వారికి సీట్లు కేటాయించే అవకాశం కనిపిస్తోంది. ప్రధానంగా గోదావరి తో పాటుగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో పవన్ ఎక్కువ సీట్లు కోరుతున్నట్లు తెలుస్తోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+