మోడీ సర్కార్‌కు బాసటగా వైసీపీ: ఆ బిల్లుపై మారిన వ్యూహం
అమరావతి: కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వంతో ఎడమొహం, పెడమొహంగా ఉంటో వస్తోన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. తన వైఖరిని మార్చుకుంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విశాఖపట్నం ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ, పోలవరం బకాయిల చెల్లింపు, సొంత పార్టీకే చెందిన లోక్‌సభ సభ్యుడు రఘురామ కృష్ణంరాజుపై అనర్హత వేటు.. వంటి విషయాలపై కేంద్ర ప్రభుత్వంపై కత్తి నూరుతూ వస్తోన్న వైఎస్సార్సీపీ.. ఆ బిల్లు విషయంలో తన వ్యూహాన్ని మార్చుకుంది.
పార్లమెంట్ ఉభయ సభలో ఎన్డీఏ కూటమికి అండగా నిలవాలని నిర్ణయించుకుంది. ఈ నిర్ణయం.. ఆ ఒక్క బిల్లు వరకు మాత్రమే పరిమితమౌతుందా? లేక.. ఆ స్నేహం కొనసాగుతుందా? అనేది తేలాల్సి ఉంది. పెగాసస్ వ్యవహారంలో ఉభయ సభలను స్తంభింపజేస్తూ వస్తోన్న ప్రతిపక్ష పార్టీల సభ్యులు కూడా ఆ బిల్లు విషయంలో తమ వైఖరిని మార్చుకున్నాయి. దాన్ని ప్రవేశపెట్టిన సమయంలో సభను సజావుగా సాగనివ్వాలని తీర్మానించుకున్నాయి. సభ ఆమోదం పొందడానికి సహకరించాలని నిర్ణయించుకున్నాయి.

కేంద్ర ప్రభుత్వం లోక్‌సభ, రాజ్యసభలో ప్రవేశపెట్టదలిచిన బిల్లు- ఇతర వెనుకబడిన వర్గాల సవరణలతో కూడినది. ఈ ఓబీసీ సవరణల బిల్లు సభామోదం పొందడానికి తాము సహకరిస్తామని వైఎస్సార్సీపీకి చెందిన రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, లోక్‌సభ సభ్యులు మార్గాని భరత్, గోరంట్ల మాధవ్ ప్రకటించారు. లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓబీసీ సవరణ బిల్లుకు తాము సంపూర్ణ మద్దతు ఇస్తామని తెలిపారు. ఈ మేరకు ఢిల్లీలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు.
ఓబీసీలను గుర్తించే అధికారం రాష్ట్రాలకు ఇచ్చేలా కేంద్ర ప్రభుత్వం ఈ చట్టంలో సవరణలు చేసిందని తెలిపారు. ఇలా రాష్ట్రాలకు అధికారాన్ని అప్పగించడాన్ని తమ పార్టీ స్వాగతిస్తోందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం శుభపరిణామం అని వ్యాఖ్యానించారు. ఏయే కులాలు వెనకబడి ఉన్నాయో గుర్తించడం ఇకపై సులభతరమౌతుందని పేర్కొన్నారు. వెనుకబడిన తరగతులను గుర్తించడంపై రాష్ట్ర ప్రభుత్వాలకే అవగాహన ఉంటుందని అన్నారు.
ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడ్డ ఓబీసీలకు సమగ్రంగా న్యాయం జరగట్లేదని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పలుమార్లు కేంద్రం దృష్టికి తీసుకెళ్లారని గుర్తు చేశారు. ఓబీసీల రిజర్వేషన్లన విషయాన్ని కూడా ఆయన కేంద్ర ప్రభుత్వం వద్ద ప్రస్తావించారని చెప్పారు. ఓబీసీ బిల్లును తాము స్వాగతిస్తున్నామని అన్నారు. అదే సమయంలో బీసీ వర్గాల అభ్యున్నతి కోసం కేంద్రం కేటాయిస్తున్న బడ్జెట్‌ను పెంచేలా ఒత్తిడిని తీసుకొస్తామని చెప్పారు.
ఇప్పటి వరకు కేంద్ర గుర్తించని ఓబీసీ కులాలు సుమారు 671 వరకు ఉన్నాయని, ఈ బిల్లు ద్వారా వారికి ప్రయోజనం కలుగుతుందని అన్నారు. సుమారు 67 ఏళ్ల నుంచి ఓబీసీ కేటగిరీ కింద వెనకబడి ఉన్న కులాలకు ఇన్ని సంవత్సరాలుగా అన్యాయం జరుగుతూ వస్తోందని, అలాంటి వారికి కేంద్ర ప్రభుత్వం విద్యా, ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం ఈ బిల్లును తీసుకురావడం హర్షణీయమని వ్యాఖ్యానించారు. ఇకముందు వెనుకబడిన వర్గాల వారిని గుర్తించి, వారిని ఓబీసీల జాబితాలో చేర్చే అధికారం రాష్ట్రాలకు అప్పగించడం ఓ విప్లవాత్మక మార్పునకు శ్రీకారం చుట్టినట్టయిందని పేర్కొన్నారు.
-
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త!












Click it and Unblock the Notifications