వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబు ఊహించినట్లే వైసీపీ ఎత్తులు- బీజేపీతో స్నేహానికి షార్ట్ కట్-సాక్ష్యాలివే

|
Google Oneindia TeluguNews

ఏపీలో వైసీపీ అధికారంలోకి పచ్చే నాటికి బీజేపీతో టీడీపీ సంబంధాలు పూర్తిగా తెగిపోయి ఉన్నాయి. గత ప్రభుత్వంలో కేంద్రంలోని బీజేపీతో సత్సంబంధాలు కొనసాగించి ఆ తర్వాత తెగదెంపులు చేసుకుని వారిపై ధర్మపోరాటం చేసిన చరిత్ర ఉన్న టీడీపీ.. మరోసారి కాషాయ పార్టీ అండ కోసం తపిస్తోంది. ఇందుకోసం టీడీపీ చేయని ప్రయత్నం లేదు. కానీ కాగల కార్యం గంధర్వులే తీర్చినట్లు వైసీపీ నేతలు టీడీపీకి ఆ సాయం చేసి పెడుతున్నట్లు కనిపిస్తోంది.

టీడీపీ, బీజేపీ సంబంధాలు

టీడీపీ, బీజేపీ సంబంధాలు

గత టీడీపీ ప్రభుత్వ హయాంలో టీడీపీ బీజేపీ సంబందాలు కొనసాగాయి. 2014 ఎన్నికల్లో విజయం కోసం కలిసిన వీరిద్దరూ ఆ తర్వాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో అధికారంలోనూ భాగస్వాములయ్యారు. ఆ తర్వాత కేంద్రంలోని బీజేపీకి గుడ్ బై చెప్పేసిన టీడీపీ.. ధర్మపోరాటం ప్రకటించింది. బీజేపీపై ధర్మపోరాటం పేరుతో విపక్ష పార్టీలన్నింటినీ ఏకం చేసి కేంద్రంలో చక్రం తిప్పేయాలని ఆశించింది. కానీ ఆ కలలు కల్లలయ్యాయి. దీంతో ఎన్టీయే సర్కార్ మరింత భారీ మెజారిటీతో అధికారంలోకి రావడం, టీడీపీ రాష్ట్రంలో పూర్తిగా చతికిలపడటం ఏకకాలంలో జరిగిపోయాయి.. ఆ తర్వాత టీడీపీ, బీజేపీ తిరిగి ఇప్పటివరకూ కలవలేదు.

 టీడీపీని బీజేపీకి దూరం చేసిన వైసీపీ

టీడీపీని బీజేపీకి దూరం చేసిన వైసీపీ

గతంలో టీడీపీ కేంద్రంలోని ఎన్టీయే సర్కార్ లో భాగస్వామిగా ఉంటూ వీరిద్దరి కాపురం సజావుగా సాగిపోతున్న తరుణంలో వైసీపీ ప్రత్యేక హోదా పేరుతో చిచ్చుపెట్టింది. రాష్ట్రానికి గతంలో బీజేపీ ఇచ్చిన ప్రత్యేక హోదా హామీపై కేంద్రాన్ని నిలదీయలేక టీడీపీని నిలదీయడం మొదలుపెట్టింది. ప్రజల్లోనూ బీజేపీతో స్నేహంగా ఉంటూ ప్రత్యేక హోదాను టీడీపీ ముంచుతోందని ఒత్తిడి పెంచింది. దీంతో చివరికి టీడీపీ-బీజేపీ బంధం పెటాకులైంది. ఆ తర్వాత కూడా వైసీపీ శాంతించలేదు. కేంద్రం నుంచి తప్పుకున్నా ఎన్టీయేలోనే ఉందామనుకున్న టీడీపీని అక్కడి నుంచి కూడా దూరం చేసింది. చివరికి టీడీపీ వైసీపీ ట్రాప్ లో పడి బీజేపీపై ధర్మపోరాటం చేసి పరాజయం పాలైంది.

బీజేపీతో స్నేహం కోసం అర్రులు చాస్తున్న టీడీపీ

బీజేపీతో స్నేహం కోసం అర్రులు చాస్తున్న టీడీపీ

ఎప్పుడైతే 2019 ఎన్నికల్లో బీజేపీపై ధర్మపోరాటం చేసి దారుణ ఓటమిపాలైందో అప్పటి నుంచి టీడీపీ తన స్టాండ్ మార్చుకుంది. బీజేపీకి తిరిగి దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. కేంద్రంలో మోడీ, షాలతో విభేదించే గడ్కరీ వంటి నేతల ద్వారా తిరిగి బీజేపీకి చేరువయ్యేందుకు చాలా ప్రయత్నాలు చేసింది. కానీ వాటిని మోడీ-షా ద్వయం ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. దీంతో పాటు రాష్ట్రంలో మారిన పరిణామాలు కూడా ఏపీ బీజేపీ నేతలకు టీడీపీపై విరక్తి పుట్టేలా చేశాయి. చివరికి టీడీపీ, వైసీపీ ఇద్దరూ ఒక్కటేనంటూ ఏపీ బీజేపీ నేతలు వారిని దూరంగా ఉంచుతున్నారు.

Recommended Video

Vijayawada లో Sonu Sood కి ఊహించని క్రేజ్.. Amaravati రైతులకి మాటిచ్చిన సోనూ || Oneindia Telugu
మళ్లీ టీడీపీని బీజేపీకి దగ్గర చేస్తున్న వైసీపీ ?

మళ్లీ టీడీపీని బీజేపీకి దగ్గర చేస్తున్న వైసీపీ ?


రాష్ట్రంలో తాజాగా మారిన పరిస్దితుల్లో వైసీపీ సర్కార్ పై టీడీపీ, బీజేపీ వేర్వేరుగా పోరాటాలు చేస్తున్నాయి. అయితే బీజేపీకి దగ్గరయ్యేందుకు ఇదే అదనుగా టీడీపీ నేతలు వారి అజెండాకు అనుగుణంగా స్పందించడం మొదలుపెట్టారు. తాజాగా గణేస్ ఉత్సవాలపై జగన్ సర్కార్ ఆంక్షలపైనా టీడీపీ స్పందించిన తీరు చూస్తే బీజేపీ అజెండాను వారు ఎలా మోస్తున్నారో అర్ధమవుతుంది. దీంతో అటు వైసీపీ కూడా బీజేపీ-టీడీపీని కలిపి విమర్శించడం మొదలుపెట్టేసింది. బీజేపీ అజెండాను టీడీపీ మోస్తోందని, తాజాగా మత్సకారుల సమస్యపై బీజేపీ చేస్తున్న పోరాటం స్క్రిప్ట్ టీడీపీ ఆఫీసులేనే తయారైందని మంత్రి అప్పలరాజు చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే టీడీపీ-బీజేపీని కలుపుతూ వైసీపీ చేస్తున్న విమర్శల తీవ్రత ఇట్టే అర్ధమవుతుంది. దీంతో టీడీపీ పని సులుపు చేసేందుకు వైసీపీ ప్రయత్నిస్తోందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

English summary
ruling ysrcp leaders comments against opposition tdp seems to be useful for them to move closer for ties with bjp.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X