తిరుపతి ఉప ఎన్నికల్లో పోటీ చేయట్లేదు: భూమన
హైదరాబాద్: తిరుపతి అసెంబ్లీ స్థానానికి జరగబోయే ఉప ఎన్నికలో తాము పోటీ చేయడం లేదని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఎమ్మెల్యే వెంకటరమణ మృతితో తిరుపతి అసెంబ్లీ స్థానం ఖాళీ అయిన సంగతి తెలిసిందే.
దీంతో ఉప ఎన్నికపై పోటీకి అభ్యర్థిని నిలపవద్దని ఆంధ్రప్రదేశ్ ఆర్ధికమంత్రి యనమల రామకృష్ణుడు పార్టీ అధినేత వైయస్ జగన్‌ను కోరారు. యనమల రామకృష్ణుడు విజ్ఞప్తి మేరకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ నుంచి విరమించుకుంటున్నట్లు పార్టీ పీఏసీ సమావేశంలో నిర్ణయించినట్లు భూమన స్పష్టం చేశారు.

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహారెడ్డి గురువారం పార్టీ అధినేతలతో లోటస్‌పాండ్‌లో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి అందుబాటులో ఉన్న పార్టీ సీనియర్ నేతలు ఎంవీ మైసూరారెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, సోమయాజులు, మిథున్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఈ సమావేశంలో ప్రజా సమస్యలపై చర్చించారు. అలాగే తిరుపతి ఉప ఎన్నికలు, ఆంధ్రప్రదేశ్ రాజధాని భూ సేకరణ అంశం, పంట రుణాలు తదితర అంశాలను చర్చించినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications