వైఎస్ షర్మిల కు వైఎస్ భారతి లేఖ రాశారా ? వైఎస్సార్సీపీ క్లారిటీ..!

ఏపీలో ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్న వేళ, వాటి కంటే వైఎస్ జగన్ కూ (YS Jagan), వైఎస్ షర్మిల (YS Sharmila) కూ ఆమె కుమార్తె పెళ్లి విషయంలో చోటు చేసుకున్న వివాదం ఎక్కువగా తెరపైకి వస్తోంది. దీని వెనుక కారణాలు ఏమైనా తాజాగా వైఎస్ షర్మిల కుమార్తె అంజిలీ రెడ్డి పెళ్లికి తన బెంగళూరు నివాసం ఇచ్చేది లేదని వైఎస్ జగన్ తన సోదరికి కుండబద్దలు కొట్టేస్తూ ఓ లేఖ రాశారు. ఇందులో భద్రత కారణాలను చూపారు. ఈ నేపథ్యంలో షర్మిల ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతి (YS Bharati) రాసినట్లు చెబుతున్న ఓ లేఖ ఇంగ్లీష్, తెలుగులోనూ వైరల్ అవుతోంది.

జగన్ - షర్మిల వివాదంపై స్పందించిన చంద్రబాబు- కీలక వ్యాఖ్యలు..!
జగన్ - షర్మిల వివాదంపై స్పందించిన చంద్రబాబు- కీలక వ్యాఖ్యలు..!

ఇందులో వైఎస్ భారతి.. వైఎస్ షర్మిలను ఉద్దేశించి తాము ప్రస్తుతం అనుభవిస్తున్న ఆస్తులు తన తండ్రి నుంచి వారసత్వంగా రావడమో లేక కష్టార్జితమో మాత్రమేనని, తాము రాజశేఖర్ రెడ్డి కుటుంబం నుంచి తెచ్చుకున్న ఆస్తులు కావంటూ చెబుతున్నట్లుగా ఉంది. కొన్ని నిర్థిష్టమైన ఆస్తులతో నీకెలాంటి సంబంధం లేదని, అలాంటి ఆస్తులపై నీకు ఎలాంటి హక్కులేదని భారతి షర్మిల కు చెబుతున్నట్లుగా ఇందులో ఉంది. ఆ ఆస్తులు నా పుట్టింటి వారు తనకు బహుమతిగా ఇచ్చినవని, తన స్వయంకృషితో కష్టార్జితంతో సంపాదించుకున్నవని కూడా ఉంది. వాటి సంపాదనలో, నిర్మాణంలో గానీ, వైఎస్ కుటుంబానికి ఎలాంటి భాగస్వామ్యం లేదని ఉంది. తన పుట్టింటి వైపు నుంచి వచ్చిన, తన స్వార్జిత ఆస్తులపై నువ్వు హక్కులు కోరడం సరికాదని షర్మిల కు బారతి చెబుతున్నట్లుగా ఉంది. ఆస్తుల విషయంలో వివాదాల్లోకి లాగడం సరికాదని కూడా వైఎస్ భారతి ఇందులో చెబుతున్నట్లు ఉంది.
దీంతో భారతి పేరుతో కనిపిస్తున్న లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది ఫేక్ అని వైఎస్సార్సీపీ (YSRCP) క్లారిటీ ఇచ్చింది.

YSRCP Issues Clarification on Reported Bharati Letter to Sharmila Over Jagan s Assets
వైఎస్ షర్మిలకు వైఎస్ జగన్ రాసిన లేఖ ఇదే- బయటపెట్టిన వైసీపీ..!
వైఎస్ షర్మిలకు వైఎస్ జగన్ రాసిన లేఖ ఇదే- బయటపెట్టిన వైసీపీ..!

దిగజారుడు రాజకీయాల్లో రోజురోజుకీ హద్దులు దాటేస్తున్న పచ్చమంద అంటూ టీడీపీని ఉద్దేశించి వైఎస్సార్సీపీ ఎక్స్ హ్యాండిల్ లో ఇవాళ ఓ ట్వీట్ పెట్టారు. వైయస్ భారతి గారి పేరుతో ఫేక్ లేఖను ఒకటి క్రియేట్ చేసి.. యెల్లో మీడియా, టీడీపీ అనుకూల సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో సర్క్యులేట్ చేస్తున్నారంటూ మండిపడింది. స్థానిక ఎన్నికల వేళ గెలిచే దమ్ము లేక.. ఇలా ఫేక్ ప్రచారంతో లబ్ధి పొందే కుట్రలు చేస్తున్నావా చంద్రబాబూ అంటూ నిలదీసింది. ఇప్పటికే జగన్ షర్మిల కు ఓసారి రాసిన లేఖ ఆలస్యంగా బయటికి వచ్చిన నేపథ్యంలో.. భారతి కూడా మరో లేఖ రాసి ఉంటారనే అనుమానాల మధ్య ఈ లేఖ వైరల్ అవుతోంది. ఇప్పుడు దాన్ని ఫేక్ అంటూ వైఎస్సార్సీపీ ఇచ్చిన క్లారిటీతో ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+