విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తప్పిదం: కాపు రిజర్వేషన్ల మీద జగన్ ప్రకటనపై సొంత పార్టీలో అసంతృప్తి

By Srinivas
|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై సొంత పార్టీ కాపు నేతలు అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది. కాపులకు రిజర్వేషన్లు తమ పరిధిలో లేదని, తాను దానిపై హామీ ఇవ్వలేనని ఆయన చేతులెత్తేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలతో కాపు నాయకుల రాజకీయ జీవితం నాశనం అవుతున్నాయని ముద్రగడ పద్మనాభం మండిపడ్డారు.

Recommended Video

జగన్ పై దుమ్మెత్తి పోస్తున్న ముద్రగడ

జగన్‌కు 'కాపు' షాక్, ఉద్రిక్తత: 200 రోజులు అగండి.. చుక్కలు చూపిస్తాం: కొడాలి నానిజగన్‌కు 'కాపు' షాక్, ఉద్రిక్తత: 200 రోజులు అగండి.. చుక్కలు చూపిస్తాం: కొడాలి నాని

బయటి కాపు నేతలే కాదు వైసీపీలోని వారు కూడా లోలోన ఆవేదన వ్యక్తం చేస్తున్నారని అంటున్నారు. కాపులను బీసీ జాబితాలో చేర్చే అంశంపై జగన్ చేసిన వ్యాఖ్యలు సరికాదని, వాటిని ఉపసంహరించుకోవాలని లేదంటే కాపుల ఆగ్రహానికి గురవుతారని వైసీపీ నేత తోట రాజీవ్ అన్నారు.

YSRCP kapu leaders unhappy with YS Jagans statement

కాపులను బీసీ జాబితాలో చేర్చే అంశంపై రాష్ట్ర పరిధిలో లేదని చెప్పడం రాజకీయ తప్పిదమవుతుందన్నారు. మద్రాసు రాష్ట్రంలో ఉన్నప్పుడు కూడా కాపులకు రిజర్వేషన్ ఉండేదని చెప్పారు. కాపులకు రిజర్వేషన్‌పై జగన్ ఇలా మాట్లాడటం తమకు ఆశ్చర్యం కలిగించిందని వ్యాఖ్యానించారు.

జగన్‌పై ముద్రగడ కూడా నిప్పులు చెరిగిన విషయం తెలిసిందే. నియోజకవర్గానికి ఇద్దరు ముగ్గురు కాపు నాయకులను వైసీపీ ఇంచార్జులుగా పెట్టి వారితో రూ.50 లక్షల నుంచి రూ.కోటి వరకు ఖర్చు పెట్టిస్తున్నారని ఆరోపించారు. జగన్ హంగూ ఆర్భాటాల కోసం కాపు నేతల కుటుంబాలు నాశనం కావాలా అని నిలదీసారు. పాదయాత్రకు అంత ఖర్చు అవసరమా అన్నారు. అందులో మీరు ఒక్క రూపాయి అయినా ఖర్చు చేస్తున్నారా అని ప్రశ్నించారు.

English summary
YSR Congress Party kapu leaders unhappy with party chief YS Jagan MOhan Reddy's statement on Kapu Reservations.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X