లిక్కర్ కేసులో సాయిరెడ్డి అరెస్ట్ కాకపోవటం వెనుక, ఇదీ జరిగిందీ - సజ్జల సంచలనం..!!
వైసీపీ ముఖ్య నేత సజ్జల కీలక వ్యాఖ్యలు చేసారు. సాయిరెడ్డి చేసిన ఆరోపణల పైన ఘాటుగా స్పందించారు. సాయిరెడ్డి పబ్లిసిటీ కోసం తపన పడుతున్నారని వ్యాఖ్యానించారు. సాయిరెడ్డికి జగన్ పార్టీలో తన తరువాత స్థానం కల్పించారని చెప్పుకొచ్చారు. నెంబర్ 2 స్థానంలో నిలబెట్టారని వివరించారు. తాను పార్టీ కార్యకర్త మాత్రమే అని స్పష్టం చేసారు. పార్టీలో ఎలాంటి కోటరీ లేదని సజ్జల పేర్కొన్నారు.
వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల తాజాగా సాయిరెడ్డి రాసిన బహిరంగ లేఖ పైన స్పందించారు. సాయిరెడ్డి చేసిన ఆరోపణలతో అపోహలు రావచ్చని.. అందుకే వివరణ ఇస్తున్నట్లు చెప్పుకొచ్చారు. జగన్ మత మార్పడిలకు పాల్పడ్డారంటూ సాయిరెడ్డి ఆరోపించినా.. తామంతా సంయమనం పాటించామని చెప్పారు. వైఎస్సార్, జగన్ ఇద్దరూ అన్ని మతాలను గౌరవించారని చెప్పుకొచ్చారు. సాయిరెడ్డికి జగన్ పార్టీలో తన తరువాతి స్థానం కల్పించారని గుర్తు చేసారు. నెంబర్ టూ స్థానంలో సాయిరెడ్డి కొనసాగారని వివరించారు.

ఛార్టెడ్ ఎకౌంటెంట్ గా సాయిరెడ్డి.. ఎలాంటి రాజకీయ నేపథ్యం లేని తాను.. ఇద్దరం జగన్ కారణంగానే గుర్తింపు పొందామని చెప్పుకొచ్చారు. టీటీడీ బోర్డు సభ్యుడిగా.. రాజ్యసభ సభ్యుడిగా.. పార్లమెంటరీ పార్టీ నేతగా.. ఢిల్లీలో ఏపీ అధికార ప్రతినిధిగా , ఇక పార్టీలో అనేక కీలక పదవులు సాయిరెడ్డికి జగన్ ఇచ్చారని వివరించారు.
జగన్ లేనిదే వైసీపీ లేదని.. జగన్ పార్టీలో నెంబర్ ఒన అని.. కర్త, కర్మ, క్రియా అంతా జగన్ మాత్రమే అని సజ్జల స్పష్టం చేసారు. వైసీపీలో కోటరీ అనే ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. 2022 లో తనను విస్మరించారని చెబుతున్నారని.. ఆ సమయంలోనే సాయిరెడ్డి రాజ్యసభకు సీటు కేటాయించారని గుర్తు చేసారు. తనతో పాటుగా సాయి రెడ్డి తప్పుడు కేసుల్లో జైలుకు వెళ్లారనే కారణంతో సాయిరెడ్డి ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారని చెప్పారు.
సాయిరెడ్డి పార్టీ ఏర్పాటు తప్పుకాదని.. ప్రచారం కోసం ఈ తరహాలో వైసీపీ పైన వ్యాఖ్య లు చేయటం సరికాదని వ్యాఖ్యానించారు. లిక్కర్ కేసులో అందరూ అరెస్ట్ అయినా.. సాయిరెడ్డి ఎందుకు కాలేదని ప్రశ్నించారు. తనకు, తన పార్టీకి ప్రచారం కోసమే సాయిరెడ్డి ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నారని... తనకు తాను ఎక్కువగా ఊహించుకోవటం వలనే ఈ రకంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. సాయిరెడ్డిని ఇక సీరియస్ గా తీసుకోమని తేల్చి చెప్పారు. తన పైన కేసులు లేవని సాయిరెడ్డి వర్రీ అవుతున్నారని.. తాను భౌతిక దాడి చేసానని చెబుతున్న సాయిరెడ్డి ఫిర్యాదు చేస్తే సీఎం చంద్రబాబు అటెంప్ట్ టు మర్డర్ కింద కేసు పెట్టేందుకు సిద్దంగా ఉన్నారని సజ్జల వ్యాఖ్యానించారు.














Click it and Unblock the Notifications