'ఈశాన్య రాష్ట్రాల గురించి ఎందుకు, హైదరాబాద్‌తో పోటీ ఉండాలంటే'
హైదరాబాదుతో పోటీ పడాలంటే ఏపీకి ప్రత్యేక హోదా కావాలని, హోదా గురించి అడిగితే ఈశాన్య రాష్ట్రాల గురించి కేంద్రమంత్రి, టిడిపి నేత సుజనా చౌదరి మాట్లాడటం ఏమిటని వైసిపి నేత పార్థసారథి మంగళవారం అన్నారు
విజయవాడ: హైదరాబాదుతో పోటీ పడాలంటే ఏపీకి ప్రత్యేక హోదా కావాలని, హోదా గురించి అడిగితే ఈశాన్య రాష్ట్రాల గురించి కేంద్రమంత్రి, టిడిపి నేత సుజనా చౌదరి మాట్లాడటం ఏమిటని వైసిపి నేత పార్థసారథి మంగళవారం అన్నారు.
బీజేపీ నేత, కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు హోదా విషయంలో పార్లమెంట్ సాక్షిగా ఎన్ని మాటలు మార్చారని విమర్శించారు. చంద్రబాబు కానీ వెంకయ్య కానీ ప్రతిపక్షంలొనే ఉంటే మంచిదని, కనీసం ప్రజలకు మంచి జరిగే మాటలు మాట్లాడుతారన్నారు.

అధికారానికి రావడానికి ఎలాంటి హామీలైనా ఇస్తారని, అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మారుస్తారన్నారు. ప్రత్యేక హోదా కనుక మనకు వచ్చి ఉంటే ఇతర రాష్ట్రాలకు వెళ్లే పారిశ్రామిక వేత్తలంతా మన రాష్ట్రానికి వచేవాళ్ళు కాదా? దీనికి వెంకయ్య సమాధానం చెప్పాలన్నారు.
ప్రత్యేక హోదా వల్ల ప్రయోజనం లేదు అనే ప్రచారం వెంకయ్య, చంద్రబాబు, సుజనా ఎందుకు చేస్తున్నారని, ఈశాన్య రాష్ట్రాలతో ఏపీని ఎందుకు పొలుస్తున్నారని నిలదీశారు. హోదా గత చరిత్ర కాదన్నారు. ముగిసిపోయిన చరిత్ర అని సుజన అనడం సరికాదని అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications