Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

చంద్రబాబు ఇలాకాలో ఫ్యాన్ హవా : పల్నాడు లో వైసీపీ ఏకపక్షంగా : జిల్లాల వారీగా ఫలితాల సరళి ఇలా..!!

ఊహించిందే జరుగుతోంది. జెడ్పీటీసీ..ఎంపీటీసీ ఫలితాల్లో వైసీపీ ఏకపక్షంగా విజయాలు నమోదు చేస్తోంది. ఈ రోజు ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ లను లెక్క పెట్టారు. ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు జరుగుతోంది. కొన్ని చోట్ల జెడ్పీటీసీ తొలి రౌండ్ ఫలితాలు వెల్లడయ్యాయి. ఇప్పటి వరకు అందుతున్న సమాచారం మేరకు పలు నియోజకవర్గాల్లో జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ ఆధీక్యంలో ఉంది. జిల్లాల వారీగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల సమాచారం.

కుప్పంలోనూ వైసీపీ ఆధిక్యత

కుప్పంలోనూ వైసీపీ ఆధిక్యత

ఇక టీడీపీకి గతంలో మంచి పట్టున్న కుప్పంలోనూ ఇప్పుడు వైసీపీ హవా స్పష్టంగా కనిపిస్తోంది. చంద్రబాబు ఇలాకాలో ఫ్యాన్‌ గాలి వీచింది. కుప్పం మండలం టీ సద్దుమూరు ఎంపీటీసీ స్థానం వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. టీడీపీ అభ్యర్థిపై వైఎస్సార్‌సీపీ అభ్యర్థి అశ్విని 1073 ఓట్ల మెజారిటీతో విజయం సాధించింది. దీంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఇక చిత్తూరు జిల్లాలో 65 జడ్పీటీసీలకుగానూ ఇప్పటికి 29 స్థానాలను .. 841కి ఎంపీటీసీ స్థానాలకుగానూ.. 416 స్థానాలను కైవసం చేసుకుని వైసీపీ ఆధిక్యంలో దూసుకుపోతోంది.

మాచర్లలో ఏకపక్షంగా వైసీపీ

మాచర్లలో ఏకపక్షంగా వైసీపీ

మాచర్ల నియెజకవర్గంలో వైఎస్సార్‌సీపీ క్లీన్‌స్వీప్‌ చేసింది. ఐదు జీడ్పీటీసీ స్థానాలకు ఐదూ వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంది. 71 ఎంపీటీసీ స్థానాలకు 71 వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంది. విశాఖపట్నం జిల్లాలో 40 ఎంపీటీసీ..1 జెడ్పీటీసీ లో వైసీపీ ఆధిక్యంలో ఉండగా.. బీజేపీ ఒక స్థానంలో ముందుంది. తూర్పు గోదావరి జిల్లాలో 75 ఎంపీటీసీ స్థానాల్లో వైసీపీ..టీడీపీ 1, బీజేపీ రెండు స్థానాల్లో ఆధిక్యతలో ఉన్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో ఇప్పటికే రెండు జెడ్పీటీసీలు గెలిచిన వైసీపీ 69 ఎంపీటీసీల్లో ఆధిక్యంలో ఉంది. టీడీపీ 3, బీజేపీ 1 స్థానాల్లో ముందున్నాయి.

అన్ని జిల్లాల్లోనూ వైసీపీ ఒకే విధంగా

అన్ని జిల్లాల్లోనూ వైసీపీ ఒకే విధంగా

కృష్ణా జిల్లాలో రెండు జెడ్పీసీలు గెలుచుకున్న వైసీపీ 95 ఎంపీటీసీలో ఆధిక్యతలో ఉంది. టీడీపీ ఎంపీటీసీల్లో ముందుకు సాగుతోంది. గుంటూరు జిల్లాలో 8 జెడ్పీటీసీలను వైసీపీ గెలుచుకుంది. కాగా, 207 ఎంపీటీసీ స్థానాల్లో వైసీపీ, 4 స్థానాల్లో టీడీపీ, ఒక స్థానంలో బీజేపీ ముందున్నాయి. ప్రకాశం జిల్లాలో వైసీపీ 15 జెడ్పీటీసీ గెలుచుకుంది. కాగా, 350 ఎంపీటీసీల్లో ఆధిక్యతలో ఉండగా... టీడీపీ 25, ఇతరులు 5 స్థానాల్లో ఆధిక్యతలో ఉన్నారు. నెల్లూరు జిల్లాలో 13 జెడ్పీటీసీలను గెలుచుకున్న వైసీపీ 226 ఎంపీటీసీ స్థానాల్లో ముందు నిలిచింది. కాగా, టీడీపీ 5, బీజేపీ 2, ఇతరులు 2 స్థానాల్లో ఆధిక్యతలో ఉన్నారు.

చిత్తూరు జిల్లాలో ఊహించని విధంగా..

చిత్తూరు జిల్లాలో ఊహించని విధంగా..

టీడీపీ అధినేత చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరు లో 30 జెడ్పీటీసీ గెలిచిన వైసీపీ 447 ఎంపీటీసీ స్థానాల్లో ఆదిక్యతలో ఉంది. కాగా, టీడీపీ 14 ఎంపీటీసీ స్థానాల్లో మాత్రమే ఆధిక్యత చూపిస్తోంది. ముఖ్యమంత్రి జగన్ సొంత జిల్లా వైఎస్సార్‌ కడపలో మొత్తం 502 జెడ్పీటీసీ స్థానాలు ఉండగా..అందులో 38 వైసీపీ గెలిచింది. కాగా, 431 ఎంపీటీసీ స్థానాల్లో ఆధిక్యతలో ఉంది. బీజేపీ రెండు స్థానాల్లో ముందుంది. కర్నూలు జిల్లాలో 16 జెడ్పీటీసీలను గెలిచిన వైసీపీ 399 ఎంపీటీసీ స్థానాల్లో ముందు నిలిచింది. అదే విధంగా టీడీపీ 54 ఎంపీటీసీ స్థానాల్లో ఆధిక్యతలో ఉంది. బీజేపీ మూడు స్థానాల్లో ముందుంది.

సాయంత్రానికి ఫలితాలపై పూర్తి క్లారిటీ

సాయంత్రానికి ఫలితాలపై పూర్తి క్లారిటీ

అనంతపురం జిల్లాలో 98 ఎంపీటీసీల్లో వైసీపీ..1 స్థానంలో టీడీపీ ఆధిక్యలో ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లాలో ఇంకా అధికారికంగా ఫలితాలు వెల్లడి కాలేదు. చివరగా విజయనగరం జిల్లాలో 3 జెడ్పీటీసీలు గెలిచిన వైసీపీ.. 66 ఎంపీటీసీ స్థానాల్లో ముందు నిలిచింది. సాయంత్రానికి జెడ్పీటీసీ ఫలితాల వేగం పుంజుకొనే అవకాశం ఉంది. రాత్రికి పూర్తి ఫలితాలు వెల్లడవుతాయని అధికారులు చెబుతున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+