సినిమా వాళ్లకే సినిమా చూపిస్తున్న పవన్..! అంబటి రాంబాబు సెటైర్లు..!
ఏపీలో జనసేన అధినేత, డిప్యూటీ సీఎం కూడా అయిన పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ సెటైర్లు వేస్తూ, విమర్శలు చేసే వారిలో వైసీపీ మాజీ మత్రులు పేర్నినాని, అంబటి రాంబాబు ముందుంటారు. వీరిద్దరిలో ఎవరి శైలి వారిది. పవన్ పై సెటైర్లు వేయడంలో ముందుండే వీరిలో అంబటి రాంబాబు ఇవాళ ఓ ట్వీట్ చేశారు. ఇందులో ఆయన సినిమా థియేటర్లలో తనిఖీలు నిర్వహించాలన్న పవన్ కళ్యాణ్ నిర్ణయంపై సెటైర్లు గుప్పించారు.
హామీలు ఎగ్గొట్టి, పాప్ కార్న్, కూల్ డ్రింక్స్ చవక చేసేందుకు సినిమా వాళ్లకే సినిమా చూపిస్తున్న వీరమల్లు(పవన్)కి వీరతాడు అంటూ అంబటి రాంబాబు ఇవాళ ట్వీట్ చేశారు. తద్వారా పవన్ నిర్ణయం వెనుక ఉన్న గుట్టును అంబటి రాంబాబు బయటపెట్టారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదనే విమర్శలు ఇప్పటికే ఉన్నాయి. ఈ నేపథ్యంలో వాటి నుంచి జనం దృష్టి మరల్చేందుకే పవన్ ఇలా థియేటర్ల వ్యవహారాన్ని రచ్చ చేస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

హామీలు ఎగొట్టి
— Ambati Rambabu (@AmbatiRambabu) May 29, 2025
Popcorn, Icecream, Cold Drinks చవక చేసేందుకు సినిమా వాళ్లకే
సినిమా చూపిస్తున్న
వీరమల్లు కి వీరతాడు !@PawanKalyan
టాలీవుడ్ నిర్మాతలతో విభేదాల నేపథ్యంలో ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు జూన్ 1 నుంచి థియేటర్లు మూసేస్తామన్న హెచ్చరికలు పంపారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ తాజా చిత్రం హరిహర వీరమల్లు రిలీజ్ డేట్ జూన్ 12కు ఫిక్స్ అయింది. ఈ నేపథ్యంలోనే పవన్ సినిమాను అడ్డుకునేందుకే ఇలా థియేటర్ల బంద్ కు పిలుపునిచ్చారంటూ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ విచారణకు ఆదేశించడం, ఆ తర్వాత టాలీవుడ్ పెద్దలు బయటికి వచ్చి తమకు సంబంధం లేదని చెప్పేయడం జరిగిపోయాయి. ఆ తర్వాత కూడా పవన్ కళ్యాణ్ థియేటర్లలో తనిఖీలకు ఇచ్చిన ఆదేశాలు చర్చనీయాంశమయ్యాయి.












Click it and Unblock the Notifications