సోఫా చేరాల్సిందే-రేవంత్-టాలీవుడ్ భేటీ ముగిశాక అంబటి సెటైర్ ట్వీట్..!
తెలంగాణలో హీరో అల్లు అర్జున్ నటించిన పుష్ప2 విడుదల సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాల తర్వాత ఇవాళ టాలీవుడ్ పెద్దలు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ప్రభుత్వానికీ, టాలీవుడ్ కూ మధ్య వచ్చిన గ్యాప్ పై వీరు చర్చించారు. అయితే ప్రభుత్వం మాత్రం బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపు విషయంలో మాత్రం తగ్గేది లేదని వీరికి తేల్చిచెప్పేసింది. దీంతో టాలీవుడ్ ప్రతినిధులు నిరాశగా వెనుదిరిగారు.
అదే సమయంలో రాజకీయ ప్రత్యర్థులపై సెటైర్లతో రెచ్చిపోతారనే పేరున్న వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు ఎంట్రీ ఇచ్చారు. ఎక్స్ లో ఆయన ఓ సంచలన ట్వీట్ పెట్టారు. అయితే ఇందులో ఎవరి పేరూ పెట్టలేదు. అయినా అది ఎవరిని ఉద్దేశించి పెట్టారో మాత్రం ఎవరికైనా సులువుగా అర్థమవుతుంది. రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పిస్తూ, టాలీవుడ్ కు సలహా ఇస్తున్నట్లు ఉన్న ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.

అంబటి తన ట్వీట్ లో వ్యూహాత్మకంగా ఎవరి పేరూ ప్రస్తావించలేదు. కానీ పుష్ప 2 చిత్రంలో సోఫా సీన్ ను మాత్రం వాడుకున్నారు. పూర్తి పరిష్కారానికి "Sofa" చేరాల్సిందే! అంటూ వ్యాఖ్యానించారు. పుష్ప2 చిత్రంలోనూ హీరో అల్లు అర్జున్ తన ప్రత్యర్దుల్ని అనుకూలంగా మార్చునేందుకు డబ్బు కట్టలు పెట్టిన సోఫాల్ని పంపుతుంటాడు. దీన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ అంబటి ఈ ట్వీట్ చేసినట్లు అర్దమవుతోంది. అయితే దీనిపై ఇప్పటివరకూ ఎవరూ స్పందించలేదు. కానీ రేవంత్-టాలీవుడ్ భేటీపైనే ఈ ట్వీట్ అయి ఉంటుందని తెలుస్తోంది. దీనికి కారణం గతంలో అల్లు అర్జున్ కు మద్దతుగా అంబటి పెట్టిన ట్వీట్లే.
పూర్తి పరిష్కారానికి
— Ambati Rambabu (@AmbatiRambabu) December 26, 2024
"Sofa" చేరాల్సిందే!












Click it and Unblock the Notifications