నెల్లూరుకు జగన్..! మళ్లీ సేమ్ రిపీట్..! వైసీపీ పైర్..!

ఏపీలో వైఎస్ జగన్ మరో జిల్లా పర్యటనకు సిద్దమయ్యారు. అయితే పోలీసులు కూడా ఆయన్ను అడ్డుకునేందుకు సిద్దమయ్యారు. జగన్ పర్యటన ఖరారు కాగానే దానికి అనుమతి కోరిన వైసీపీ నేతలకు ఎప్పటిలాగే నోటీసులు ఇచ్చేశారు. దీంతో పోలీసుల తీరుపై వైసీపీ మండిపడుతోంది. ఎల్లుండి జగన్ నెల్లూరు టూర్ గురించే ఇదంతా. ఇంతకీ జగన్ టూర్ నేపథ్యంలో ఏం జరుగుతుందో ఓసారి చూద్దాం..

వైయస్ జగన్ నెల్లూరు పర్యటన సందర్భంగా ప్రభుత్వ ఒత్తిడితో పోలీసులు ఇష్టారాజ్యంగా ఆంక్షలు విధిస్తున్నారని పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వైయస్సార్సీపీ నాయకులకు, కార్యకర్తలకు జగన్మోహన్ రెడ్డి పర్యటనపై నోటీసులు ఇవ్వడంపై అభ్యంతరం తెలిపారు. ఆయన పర్యటకు జన సమీకరణ చేయాల్సిన అవసరం లేదని, జగన్ అంటేనే జనం అన్నారు. జగన్ టూర్ కు జనం స్వచ్చందంగా తరలివస్తారని భూమన తేల్చి చెప్పారు.

ysrcp leader bhumana karunakar reddy slams restrictions to ys jagan s Nellore tour on July 31

వైయస్ జగన్ పర్యటన నేపథ్యంలో నెల్లూరు జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డికి స్ధానిక డీఎస్పీ ఆంక్షలతో కూడిన ఉత్తర్వులు జారీ చేయడంపై భూమన ఫైర్ అయ్యారు. మాజీ ఎమ్మెల్యే, వైయస్సార్సీపీ సీనియర్ నేత నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటికి వైయస్ జగన్ పరామర్శకు వెళ్తున్న నేపధ్యంలో 15 వాహనాలను అనుమతించడంతో పాటు ఇంటిలోపలికి కేవలం జగన్మోహన్ రెడ్డిని మాత్రమే పంపిస్తాని చెప్పారన్నారు.

ysrcp leader bhumana karunakar reddy slams restrictions to ys jagan s Nellore tour on July 31

రహదారులు సరిగ్గా లేనందున, ఈ పర్యటనకు జనసమీకరణ చేస్తే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరిగినా బాధ్యత వహించాల్సి ఉంటుందని లేఖలో పోలీసులు వైసీపీ నేతల్ని హెచ్చరించారు. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో జరిగిన వైయస్ జగన్ పర్యటనలో కూడా హెలీప్యాడ్ వద్దకు 30 మంది కంటే ఎక్కువ మంది రాకూడదని, మార్కెట్ యార్డులోకి కేవలం 300 మందికి మాత్రమే ప్రవేశం, అంతకంటే ఎక్కువ మంది వస్తే వాళ్ల మీద రౌడీషీట్ ఓపెన్ చేస్తామని బెదిరించారని, దాదాపు 2 వేల మంది పోలీసులు, ఒక డీఐజీ, ముగ్గురు ఎస్పీలు, 9 మంది ఏఎస్పీలు, 27 మంది డిఎస్పీలు మోహరించారన్నారు. తాము జనసమీకరణ చేయబోమని చెప్పినా.. జనాలు ఉప్పెనలా హాజరయ్యారన్నారు.

ysrcp leader bhumana karunakar reddy slams restrictions to ys jagan s Nellore tour on July 31

ఈ నెల 31న జగన్మోహన్ రెడ్డి నెల్లూరుకు పరామర్శకు వస్తున్న నేపథ్యంలో దాని కోసం తమ పార్టీ జనసమీకరణ చేయదని భూమన తెలిపారు. తాము చేయాలనుకుంటే దాని స్థాయి మరో రకంగా ఉంటుందన్నారు. ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి వెనక 10 మందే ఉండాలి అంతకంటే ఎక్కువ ఉండకూడదు అని బెదిరించే ధోరణిలో తాఖీదులు ఇస్తే.. జనం రారనుకోవడం పొరపాటన్నారు. సూర్యకాంతిని అరచేత్తో అడ్డుకోవాలని చూసినా అది జరిగేది కాదన్నారు. ఆదే తరహాలో ప్రభుత్వమూ, పోలీసులు ఆంక్షలు విధించినా.. వైయస్సార్సీపీ జన సమీకరణ చేయకపోయినా, ఆయన వెనుక వేలాదిగా ఉరకలెత్తి జనాలు వస్తారన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+