చంద్రబాబు నిర్ణయాన్ని స్వాగతించిన వైసీపీ నేత భూమన..! అంతలోనే షాకింగ్..
ఏపీ రాజకీయాల్లో సీఎం చంద్రబాబు నాయుడికీ, తిరుపతి వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డికీ బద్ధ శత్రువులుగా పేరుంది. ముఖ్యంగా గత కొన్ని దశాబ్దాలుగా వీరిద్దరూ పరస్పరం విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకుంటూనే ఉన్నారు. ముందు కాంగ్రెస్ పార్టీలో ఉండి ఆ తర్వాత టీడీపీలోకి వచ్చిన చంద్రబాబుతో కాంగ్రెస్ నేతగా ఉంటూ వైసీపీలోకి వచ్చిన తర్వాత కూడా అదే శత్రుత్వం కొనసాగిస్తున్న భూమన కరుణాకర్ రెడ్డి ఇవాళ ఓ విషయంలో మాత్రం చంద్రబాబు నిర్ణయాన్ని స్వాగతించారు.
ఇంతకీ విషయం ఏంటంటే.. తిరుపతిలోని అలిపిరి టోల్ గేట్ సమీపంలో ముంతాజ్ హోటల్ నిర్మాణానికి గతంలో వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన అనుమతుల్ని సీఎం చంద్రబాబు ఇవాళ రద్దు చేశారు. ఈ మేరకు తిరుపతి పర్యటనలో చంద్రబాబు ఈ మేరకు వెల్లడించారు. చంద్రబాబు తీసుకున్న ఈ నిర్ణయాన్ని వైసీపీ అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి స్వాగతించారు. ఇప్పటికే తాము ఈ డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు.

సాధువులు, పీఠాధిపతులు చేసిన పోరాటానికి భయపడి ముంతాజ్ హోటల్ కు ఇచ్చిన అనుమతుల్ని చంద్రబాబు రద్దు చేశారని భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. కాళ్ళు పట్టుకుని పూజించే సాధువులను కూటమి ప్రభుత్వం మెడలు పట్టుకుని గెంటి వేయడంపై దేశం మొత్తం సాధువులు అంతా ఏకం అవుతున్న తరుణంలో ముంతాజ్ హోటల్ నిర్మాణం అనుమతులు రద్దు చేశారన్నారు. హిందూ ధర్మం కాపాడతామంటూ మాటలకే పరిమితం తప్ప ఆచరణలో లేదని ఆయన తెలిపారు. స్వామీజీలు చేపట్టిన పోరాటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందన్నారు.












Click it and Unblock the Notifications