రాజధానిపై వైసీపీ తాజా స్టాండ్ చెప్పేసిన బొత్స ! ఎమ్మెల్సీగా ప్రమాణం..

ఏపీలో కూటమి సర్కార్ అధికారం చేపట్టిన తర్వాత తొలిసారి జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైన వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ఇవాళ ప్రమాణస్వీకారం చేశారు. మండలి ఛైర్మన్ కొయ్యే మోషేన్ రాజు సమక్షంలో ఆయన ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి పలువురు వైసీపీ మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు, ఇతర నేతలు హాజరయ్యారు. అనంతరం బొత్స పలు అంశాలపై మీడియాతో మాట్లాడారు.

స్థానిక సంస్థ ల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు బొత్స సత్యనారాయణ సంతోషం వ్యక్తం చేశారు.స్థానిక వైసీపీ నేతలకు అన్నిటి కంటే ముఖ్యంగా పార్టీ అధ్యక్షుడు జగన్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. బాధ్యతగా ఎమ్మెల్సీ పదవి నిర్వహిస్తానని బొత్స తెలిపారు. అసెంబ్లీకి వచ్చారా లేదా అనేది కాదు ప్రజలకు మేలు జరిగేలా చూడడమే ముఖ్యమని ఆయన పేర్కొన్నారు.

ysrcp leader botsa Satyanarayana clears party s latest stand on ap capital taken oath as mlc

ప్రజలకు కూటమి ప్రభుత్వం ఎన్నో వాగ్దానాలు చేసిందని, అమలుకు ఇంకా టైం ఉంది కదా చూద్దామని బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం కేవలం 75రోజులు మాత్రమే పూర్తి అయిందన్నారు. రాబోయే కాలంలో ఉత్తరాంధ్ర ప్రాంతం విశాఖ ఒకేలా అభివృద్ధి చెందాలన్నారు. ప్రస్తుతం తమ పార్టీది మూడు రాజధానుల విధానమే అని బొత్స క్లారిటీ ఇచ్చారు. ఒకవేళ విధానం మారితే చెప్తామన్నారు. దీంతో ఓవైపు అమరావతి రాజధాని పనులు ముమ్మరంగా సాగుతున్నా వైసీపీ మాత్రం మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నట్లు బొత్స తేల్చిచెప్పేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+