మజ్జి శ్రీనుతో అనుబంధం గుర్తు చేసుకుంటూ.. బొత్సా కన్నీటి పర్యంతం..!!
వైసీపీ ముఖ్య నేత బొత్సా ఎమోషనల్ అయ్యారు. కంట తడి పెట్టారు. పార్టీ కార్యకర్తల సమక్షంలో నే ఒక్క సారిగా ఆవేదనకు గురయ్యారు. మజ్జి శ్రీను తాజాగా వైసీపీ వీడి టీడీపీలో చేరారు. కుమార్తు రాజకీయ భవిష్యత్ కోసం పార్టీ మారినట్లు చెబుతున్నారు. మజ్జి శ్రీను పార్టీ మార్పు పైన ఇప్పటికే బొత్సా స్పందించారు. అందులో ఆశ్చర్యం లేదన్నారు. అయితే.. పార్టీ సమావేశంలో మాత్రం ఒక్క సారిగా మజ్జి శ్రీనుతో అనుబంధం గుర్తు చేసుకుంటూ కన్నీటి పర్యంతమయ్యారు.
మజ్జి శ్రీనివాస రావు వైసీపీ వీడి టీడీపీలో చేరటం పై వైసీపీ ముఖ్య నేత బొత్సా సత్యనారాయణ ఎమోషనల్ అయ్యారు. ఆయనతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. చీపురుపల్లి వైసీపీ కార్యకర్తల సమావేశంలో ఈ ఘటన చోటు చేసుకుంది. జిల్లాలో కొద్ది రోజులుగా వైసీపీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. బొత్సా కుటుంబంలో కొందరు కూటమి పార్టీల వైపు చూస్తున్నట్లు ప్రచారం జరిగింది. జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవి కోసం రాజకీయంగా విభేదాలు బొత్సా కుటుంబంలో వచ్చినట్లు చెబుతున్నారు. అందులో భాగంగా మజ్జి శ్రీను తన కుమార్తెతో కలిసి టీడీపీలో చేరారు. కాగా.. తన సొంత మేనల్లుడు తనను కాదని తాను ఉన్న పార్టీని కాదని తన దారి తాను చూసుకోవడం మీద బొత్సా ఇప్పటికే ఆసక్తి కర వ్యాఖ్యలు చేసారు. మనిషన్న వాడికి స్వార్థం ఉంటుంది అని, రాజకీయ పార్టీల్లోకి మనుషులు వస్తుంటారు పోతుంటారు చివరికి పార్టీలు మాత్రమే శాశ్వతం అని బొత్స చెప్పుకొచ్చారు.

బొత్సా ఎమోషనల్.. వైరల్
దీని ద్వారా తన స్వార్ధం కోసమే మేనల్లుడు పార్టీ మారారు అన్నది బొత్సా విశ్లేషించారు. ఇప్పటి కే బొత్సా తన కుమార్తె కు స్థానిక ఎన్నికల్లో విజయనగరం జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ పదవి కోసం పోటీ చేస్తారని ప్రకటించారు. దీంతో.. చిన్ని శ్రీను తన కుమార్తె కోసం కూటమి వైపు చూసారని పార్టీ లో ప్రచారం సాగుతోంది. కాగా.. తాజాగా మాజీ ఎమ్మెల్యే .. బొత్సా బంధువు బడ్డుకొండ అప్పల నాయుడు కూడా ఇదే నిర్ణయంతో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. బొత్సా కుటుంబంలో చీలిక కనిపిస్తోంది. కాగా.. తొలుత చిన్ని శ్రీను పార్టీ మార్పు వ్యవహారం లైట్ గానే తీసుకున్నట్లుగా బొత్సా వ్యాఖ్యలు కనిపించాయి. చిన్ని శ్రీను సైతం తనకు బొత్సాతో ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేసారు. కాగా.. ఇప్పుడు బొత్సా తనకు చిన్ని శ్రీను తో ఉన్న అనుబంధం గుర్తు చేసుకుంటూ.. ఇలా కార్యకర్తల సమావేశంలో కన్నీటి పర్యంతం కావటం.. వైరల్ అవుతోంది.













Click it and Unblock the Notifications
